టాలీవుడ్ డైరెక్టర్లపై మలయాళ నటుడు సెటైర్లు.. ఒక్క సినిమా కోసం ఏడాదిన్నరా? అంటూ

మలయాళ నటుడు షైన్ టామ్ చాకో మరోసారి తన వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు. నటుడిగా ఎంత గుర్తింపు సంపాదించుకున్నారో, తనదైన శైలిలో మాట్లాడే తీరు వల్ల కూడా అంతే చర్చనీయాంశంగా మారుతుంటారు. ప్రస్తుతం తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న షైన్ టామ్ చాకో, తాజాగా శ్రీవిష్ణు హీరోగా తెరకెక్కుతున్న 'కామ్రేడ్ కళ్యాణ్' సినిమాలో విలన్ గా నటిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన 'ఒరియా పిల్లా'అనే తొలి పాటను విడుదల చేసింది. ఈ సందర్భంగా నిర్వహించిన ఈవెంట్‌లో నటుడు షైన్ టామ్ చాకో షాకింగ్ కామెంట్స్ చేశారు.

తెలుగు ప్రేక్షకులకు మొదట డబ్బింగ్ సినిమాల ద్వారా పరిచయమైన షైన్ టామ్ చాకో, నాని హీరోగా తెరకెక్కిన 'దసరా' చిత్రంతో టాలీవుడ్‌లో నేరుగా ఎంట్రీ ఇచ్చారు. ఆ సినిమాలో 'చిన్న నంబి' పాత్రలో తన నటనతో మంచి ప్రశంసలు అందుకున్నారు. ఆ తర్వాత రంగబలి, దేవర, డాకు మహారాజ్, రాబిన్ హుడ్ వంటి పలు తెలుగు చిత్రాల్లో నటించి తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు.

Shine Tom Chacko shocking Comments on Tollywood Directors in Comrade Kalyan Movie event

ఇక ప్రస్తుతం శ్రీవిష్ణు కథానాయకుడిగా నటిస్తున్న 'కామ్రేడ్ కళ్యాణ్' చిత్రంలో విలన్ పాత్ర పోషిస్తున్నారు. జానకిరామ్ మారెళ్ల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మహిమా నంబియార్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఇటీవల విడుదలైన గ్లింప్స్‌కు మంచి స్పందన లభించగా, తాజాగా 'ఒరియా పిల్లా' అనే తొలి పాటను చిత్రబృందం విడుదల చేసింది. ఈ సందర్భంగా నిర్వహించిన ఈవెంట్‌లో పాల్గొన్న షైన్ టామ్ చాకో తన అనుభవాలను పంచుకున్నారు.

నటుడు షైన్ టామ్ చాకో మాట్లాడుతూ.. "నేను దసరా సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో అడుగుపెట్టాను. ఆ తర్వాత రంగబలి, దేవర, రాబిన్ హుడ్ లాంటి చిత్రాల్లో నటించాను. త్వరలో 'కామ్రేడ్ కళ్యాణ్ సినిమాతో మరో సారి మీ ముందుకు రాబోతున్నాను. అయితే.. నాకు ఇప్పటికీ ఒక విషయం అర్థం కావడం లేదు. ఈ సినిమా షూటింగ్ గత ఏడాది ఫిబ్రవరిలో ప్రారంభమైంది. ఇప్పుడు చూస్తే దాదాపు ఏడాదిన్నర అవుతోంది. ఒక సినిమాను పూర్తి చేయడానికి ఇంత సమయం ఎలా తీసుకుంటారో నాకు అర్థం కావడం లేదు"అంటూ నవ్వుతూ మాట్లాడారు.

అంతేకాకుండా, "నేనైతే ఈ గ్యాప్‌లో కనీసం 10 నుంచి 15 సినిమాలు చేసేవాడిని. మలయాళం, తమిళ పరిశ్రమల్లో సినిమాలు చాలా వేగంగా పూర్తవుతాయి. అక్కడ ఒక సినిమా కోసం ఇంత సమయం తీసుకోవడం చాలా అరుదు. కానీ ఇక్కడ మాత్రం ఒక సినిమాకు ఏడాదిన్నర, రెండేళ్లు కూడా పడుతోంది" అని తెలిపారు. అయితే ఈ వ్యాఖ్యలు ఆయన సరదాగానే చేసినప్పటికీ, అందులో ఒక ప్రాక్టికల్ సమస్య కూడా ఉందని వివరించారు.

'ఒక సినిమా షూటింగ్ ఇంతకాలం కొనసాగితే ఆ పాత్రకు సంబంధించిన లుక్‌ను అలాగే మెయింటైన్ చేయడం చాలా కష్టం. ఎందుకంటే మధ్యలో వేరే సినిమాల్లో వేరే పాత్రలు చేయాల్సి వస్తుంది. గడ్డం, హెయిర్ స్టైల్, బాడీ లాంగ్వేజ్ అన్నీ మార్చాల్సి వస్తాయి. మళ్లీ ఈ సినిమా కోసం పాత లుక్‌లోకి రావడం అంత సులభం కాదు'అని చెప్పారు. ఇంకా మాట్లాడుతూ 'ఒక సినిమా కోసం డేట్లు కేటాయిస్తే, మరో సినిమా దర్శకుడిని ఒప్పించాలి. అక్కడి నుంచి తిరిగి ఈ సినిమా కోసం మళ్లీ లుక్ రెడీ చేయాలి. ఇలా ఒక డైరెక్టర్‌ను మేనేజ్ చేయడం, మరో డైరెక్టర్‌కు వివరించడం చాలా కష్టంగా మారుతుంది. షూటింగ్ ఎక్కువకాలం సాగితే నటులకు కూడా అనేక ఇబ్బందులు ఎదురవుతాయి'అని తెలిపారు.

ప్రస్తుతం షైన్ టామ్ చాకో కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కొందరు ఆయన చెప్పింది నిజమేనని అభిప్రాయపడుతుండగా, మరికొందరు భారీ బడ్జెట్ సినిమాలు, పాన్ ఇండియా ప్రాజెక్టులకు ఎక్కువ సమయం అవసరమని కామెంట్లు చేస్తున్నారు. ఏదేమైనా, టాలీవుడ్‌లో సినిమాల నిర్మాణ సమయంపై షైన్ టామ్ చాకో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సినీ వర్గాల్లో చర్చకు దారితీశాయి.

ఇక 'కామ్రేడ్ కళ్యాణ్' విషయానికి వస్తే, శ్రీవిష్ణు మరోసారి తనదైన కామెడీ, ఎంటర్‌టైన్‌మెంట్‌తో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నారు. ఈ సినిమాలో రాధిక శరత్ కుమార్,షైన్‌ టామ్‌ చాకో, ఉపేంద్ర లిమయే కీలక పాత్రలు చేస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్‌కు మంచి రెస్పాన్ వస్తుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X