చేతక్ శీను‌గా శివ కందుకూరి.. మరో డిఫరెంట్ కాన్సెప్ట్‌తో కథనం డైరెక్టర్ రాజేష్

ప్రముఖ నిర్మాత రాజ్ కందుకూరి కుమారుడిగా చూసీ చూడంగానే చిత్రంతో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన శివ కందుకూరి వరుస సినిమాలతో దూసుకెళ్తున్నాడు. గమనం చిత్రంలో విభిన్నమైన పాత్రను పోషిస్తున్న శివ మను చరిత్ర అనే చిత్రంలో డిఫరెంట్ పాత్రను పోషిస్తున్నారు. ఇలా రెండు సినిమాలు చేతులో ఉంచుకొన్న శివ ప్రస్తుతం చేతక్ శీను అనే సినిమాతో తన నాలుగో చిత్రాన్ని కూడా పట్టాలెక్కించారు.

రవి ఫిల్మ్ కార్పొరేషన్ పతాకంపై ప్రొడక్షన్ నంబర్-1చిత్రంగా , రవి చరణ్ మెరుపో, ప్రతిమ సంయుక్తంగా నిర్మిస్తున్న "చేతక్ శీను " డిసెంబర్ 25న సంస్థ కార్యాలయంలో పూజా కార్యక్రమాలతో ప్రారంభం అయింది. కథనం చిత్రంతో ప్రేక్షకులను ఆకట్టుకొన్న టాలెంటెడ్ డైరెక్టర్ రాజేశ్ చేతక్ శీనుకు దర్శకత్వం వహిస్తున్నారు.

Shiva Kandukuris Chetak Srinu movie launched on christmas day

ఈ సందర్బంగా చిత్ర దర్శకుడు రాజేష్ మాట్లాడుతూ.. నా కెరీర్‌లో ఇది రెండో సినిమా. రాజ్ కందుకూరి గారు ఫస్ట్ కథ విని వెంటనే ఒకే చెప్పారు. కొన్ని సలహాలు సూచనలు ఇచ్చారు. ఆయన ఈ ప్రాజెక్ట్‌ను సక్సెస్‌ఫుల్‌గా పూర్తి చేశాం. శివతో వర్క్ చేస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉంది అని అన్నారు.

హీరో శివ కందుకూరి మాట్లాడుతూ.. దర్శకుడు రాజేష్ చెప్పిన స్టోరి అద్బుతంగా ఉంది. చేతక్ శీను వండర్ ఫుల్ టైటిల్.. రాజ్ కాంత్ ఇచ్చిన కథ నాకు బాగా నచ్చింది. రవి, ప్రతిమ ఈ సినిమాని నిర్మిస్తున్నారు.. ఫిబ్రవరి నుంచి షూట్‌కు వెళ్తున్నాం అని తెలిపారు.

నిర్మాత రవి చరణ్ మెరుపో మాట్లాడుతూ.. రవి ఫిల్మ్ కార్పొరేషన్ లో ప్రొడక్షన్ నంబర్ 1 గా చేతక్ శీను సినిమా క్రిస్మస్, ముక్కోటి ఏకాదశి రోజున ప్రారంభం కావడం చాలా సంతోషంగా ఉంది. రాజ్ కాంత్ సూపర్బ్ స్టోరీ ఇచ్చారని తెలిపారు.

Shiva Kandukuris Chetak Srinu movie launched on christmas day

ప్రముఖ నిర్మాత రాజ్ కందుకూరి మాట్లాడుతూ.. ఇటీవల కాలంలో నాకు బాగా నచ్చిన కథ ఇధి. జనరల్‌గా థ్రిల్లర్స్ ఎంగేజింగ్‌గా ఉంటాయి. చేతక్ శీను కథ, కథనాలు ప్రేక్షకులకు థ్రిల్లింగ్ కలిగిస్తాయి. శివ ఎప్పటినుండో థ్రిల్లర్ మూవీ చేయాలను కుంటున్నాడు. చేతక్ శ్రీను అతనికి నాలుగవ సినిమా. చాలా కాన్ఫిడెంట్ గా వున్నాడు. రాజేష్ మంచి డైరెక్టర్. రవి, ప్రతిమ కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.. ఇవాళ మంచి రోజు కాబట్టి పూజ చేశారు. ఫిబ్రవరి 18 నుండి షూటింగ్ ప్రారంభిస్తారు.. టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్ అన్నారు.

శివ కందుకూరి సరసన ఓ ప్రముఖ హీరోయిన్ నటించనున్న ఈ చిత్రంలో ప్రముఖ తారాగణం నటిస్తున్నారు. ఈ చిత్రానికి

కథ: రాజ్ కాంత్ తోటి
మ్యూజిక్: అనూప్ రూబెన్స్
డివోపి: సతీష్ ముత్యాల,
ఎడిటింగ్: యమ్ఆర్ వర్మ
నిర్మాతలు: రవి చరణ్ మెరుపో, ప్రతిమ,
దర్శకత్వం: కథనం ఫేం రాజేష్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X