Ayalaan శివకార్తీకేయన్ అయలాన్ రిలీజ్ వాయిదా.. అసలు సమస్య ఏమిటంటే?

తమిళనాడులో సంచలన విజయం సాధిస్తున్న అయలాన్ సినిమా తెలుగు వెర్షన్ విడుదల వాయిదా పడింది. సంక్రాంతి బరిలో తమిళనాడులో రిలీజైన ఈ సినిమా సుమారుగా 100 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఇక సంకాంత్రి బరిలో స్క్రీన్ల కేటాయింపు సమస్య ఏర్పడటంతో తెలుగు అయలాన్ వెర్షన్ వాయిదా పడింది.

అయితే ఈ సినిమాను జనవరి 26వ తేదీన రిలీజ్ చేయాలని నిర్మాత మహేశ్వర్ రెడ్డి ప్లాన్ చేశాడు. ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకెళ్లేలా భారీగా ప్రమోషన్స్ కార్యక్రమాలు, ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించి సినిమాపై భారీగా బజ్ క్రియేట్ చేశాడు.దాంతో తెలుగు అయలాన్‌ అడ్వాన్స్ బుకింగ్ భారీ రెస్పాన్స్ లభించింది. అయితే అనుకొన్న షెడ్యూల్ ప్రకారం విడుదల వాయిదా పడింది. ఈ రిలీజ్ వాయిదా వెనుక కారణాల్లోకి వెళితే..

Shiva Karthikeyans Ayalaan Telugu Release postponed? Here is the Reason

అయలాన్ తెలుగు రిలీజ్ విషయంలో తమిళ నిర్మాత కోటపాడి జే రాజా (కేజేఆర్)‌కు లీగల్ సమస్యలు తలెత్తాయి. ఆ సమస్యను పరిష్కరించుకోవడానికి సమయం పట్టడంతో తెలుగు రిలీజ్‌కు అడ్డంకిగా మారింది. దాంతో మార్నింగ్ షోలు వాయిదా పడ్డాయి. అయితే అయలాన్ సినిమాకు అడ్వాన్స్ బుకింగ్‌ టికెట్ అమ్మకాలు నమోదయ్యాయి. ఆ టికెట్ డబ్బులను వెనక్కి తిరిగి ఇస్తున్నారు.

Shiva Karthikeyans Ayalaan Telugu Release postponed? Here is the Reason

ఇదిలా ఉండగా, అయలాన్ సినిమా తెలుగు వెర్షన్‌ను త్వరలోనే ఆంధ్రా, నైజాంలో భారీగా రిలీజ్ చేసేందుకు నిర్మాత మహేశ్వర్ రెడ్డి ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్స్ భారీగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. త్వరలోనే రిలీజ్ డేట్‌ను ప్రకటించేందుకు నిర్మాత అధికారికంగా ప్రకటన చేయనున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X