Kushi: సమంతను లైన్‌లో పెట్టిన విజయ్.. అదిరిపోయే ఫొటో షేర్ చేసిన డైరెక్టర్
ఎలాంటి సపోర్ట్ లేకుండానే సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి.. చాలా తక్కువ సమయంలోనే స్టార్‌గా ఎదిగిపోయిన హీరో విజయ్ దేవరకొండ. 'పెళ్లి చూపులు' అనే చిత్రంతో హీరోగా పరిచయమైన అతడు.. కెరీర్ ఆరంభంలోనే ఎన్నో హిట్లను కూడా ఖాతాలో వేసుకున్నాడు. అప్పటి నుంచి ఏమాత్రం వెనక్కి తిరిగి చూడకుండా ముందుకు వెళ్తోన్నాడు. ఈ క్రమంలోనే గత ఏడాది విజయ్ దేవరకొండ 'లైగర్' అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. క్రేజీ కాంబినేషన్‌లో పాన్ ఇండియా రేంజ్‌లో వచ్చిన ఈ సినిమాకు ఆడియెన్స్ ఝలక్ ఇచ్చారు. దీంతో ఈ మూవీ డిజాస్టర్‌గా మిగిలిపోయింది.
టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం శివ నిర్వాణ దర్శకత్వంలో 'ఖుషి' అనే సినిమాను చేస్తున్నాడు. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ చాలా వరకు పూర్తైంది. ఇందులో స్టార్ హీరోయిన్ సమంత నటిస్తోంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్‌ను విడుదల చేశారు. దీనికి అన్ని వర్గాల వాళ్ల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కింది. అదే సమయంలో సినిమాపై అంచనాలు కూడా పెరిగాయి. కానీ, కొంత కాలంగా ఈ మూవీ షూటింగ్ నిలిచిపోయింది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ చిత్రంపై ఓ అదిరిపోయే అప్‌డేట్ వచ్చేసింది.

సమంత రూత్ ప్రభు అనారోగ్యం కారణంగా 'ఖుషి' మూవీ షూటింగ్ నిలిచిపోయిన విషయం తెలిసిందే. అయితే, ఆమె ఇప్పట్లో దీనికి డేట్స్ కేటాయించే పరిస్థితులు లేవని, దీంతో ఇది పున: ప్రారంభం అయ్యే ఛాన్స్ లేదని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా డైరెక్టర్ శివ నిర్వాణ విజయ్, మ్యూజిక్ డైరెక్టర్ హిషామ్ అబ్దుల్ వాహబ్‌తో కలిసి దిగిన ఫొటోను ట్విట్టర్‌లో షేర్ చేశాడు. అంతేకాదు, 'మళ్లీ మొదలెట్టేందుకు మొత్తం సెట్ అయింది. త్వరలోనే ఆసక్తికరమైన అప్‌డేట్లు రాబోతున్నాయి' అని చెప్పాడు. దీంతో సమంత దీనికి డేట్స్ ఇచ్చినట్లు పరోక్షంగా వెల్లడైపోయింది.
రొమాంటిక్ లవ్ స్టోరీతో రాబోతున్న 'ఖుషి' మూవీని మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యేర్నేని,రవిశంకర్ యలమంచిలి నిర్మిస్తున్నారు. దీనికి హిషామ్ అబ్దుల్ వాహబ్ సంగీతాన్ని అందిస్తున్నారు. జయరాం, సచిన్ ఖేడేకర్, మురళీ శర్మ, లక్ష్మీ, అలీ, రోహిణి, వెన్నెల కిషోర్, రాహుల్ రామకృష్ణ, శ్రీకాంత్ అయ్యంగార్, శరణ్య తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.


Click it and Unblock the Notifications











