For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  KGF Chapter 2 Trailer: కేజీఎఫ్ కోసం మరో స్టార్ హీరో.. ట్రైలర్ కూడా భారీగానే!

  |

  కన్నడ చిత్ర పరిశ్రమ నుంచి వచ్చి భారీ విజయాన్ని సొంతం చేసుకున్న చిత్రం 'కేజీఎఫ్ చాప్టర్ 1'. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో స్టైలిష్ హీరో యశ్ నటించిన ఈ సినిమా పాన్ ఇండియా రేంజ్‌లో కన్నడం, తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో విడుదలైంది. ఎన్నో అంచనాలతో వచ్చిన ఈ చిత్రం అన్ని చోట్లా సూపర్ డూపర్ హిట్ అయింది. మరీ ముఖ్యంగా ఉత్తరాదిలో ఇది భారీ కలెక్షన్లను రాబట్టింది. దీంతో 'బాహుబలి' తర్వాత సౌతిండియన్ సినిమాల స్టామినాను మరోసారి చాటి చెప్పింది. అంతేకాదు, దీనికి పలు విభాగాల్లో జాతీయ అవార్డులు సైతం దక్కిన విషయం తెలిసిందే.

  జిప్ తీసేసి రెచ్చిపోయిన అనన్య నాగళ్ల: క్లీవేజ్ షోతో తెలుగు పిల్ల అరాచకం

  ఎంతో ప్రతిష్టాత్మకంగా వచ్చిన 'కేజీఎఫ్ చాప్టర్ 1' సూపర్ డూపర్ హిట్ అవడంతో దీనికి సీక్వెల్‌ను తీయాలని చిత్ర యూనిట్ అప్పుడే డిసైడ్ అయింది. అందుకు అనుగుణంగానే 'కేజీఎఫ్ చాప్టర్ 2' పేరిట దీన్ని మొదలు పెట్టేశారు. పక్కా ప్లాన్‌తో కేజీఎఫ్ మొత్తాన్ని తన వశం చేసుకున్న రాఖీ భాయ్‌కు అధీరా రూపంలో ప్రధాన ప్రత్యర్థి రావడంతో ఈ కథ నడుస్తుందని తెలుస్తోంది. వాళ్లిద్దరి మధ్య పోరాటం జరిగే తీరుతోనే సినిమా తెరకెక్కిందట. అంతేకాదు, ఇందులో యశ్ హీరోయిజాన్ని మరింత ఎలివేట్ చేసి చూపిస్తారని అంటున్నారు. ఆరంభం నుంచే ఈ చిత్రంపైన కూడా అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. దీన్ని దృష్టిలో ఉంచుకునే ఈ మూవీని మరింత ప్రతిష్టాత్మకంగా రూపొందించారు.

  Shiva Rajkumar Chief Guest for KGF Chapter 2 Trailer Event

  వాస్తవానికి 'కేజీఎఫ్ చాప్టర్ 2' మూవీ షూటింగ్ ప్రారంభమై చాలా రోజులే అయినా.. అనివార్య కారణాలతో అనుకున్న సమయానికి పూర్తి చేయలేదు. ఇలాంటి పరిస్థితుల్లో గత ఏడాది చివర్లో దీన్ని కంప్లీట్ చేసేశారు. ఆ వెంటనే పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా మొదలు పెట్టారు. వీటికి సంబంధించిన అన్ని రకాల వర్క్స్‌ను ఇప్పటికే దాదాపుగా పూర్తి చేశారు. దీంతో ఈ సినిమాను గత ఏడాదే డిసెంబర్‌లోనే విడుదల చేస్తారని ప్రచారం జరిగింది. కానీ, కోవిడ్ సెకెండ్ వేవ్ కారణంగా అది సాధ్యం కాలేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ చిత్రాన్ని 2022, ఏప్రిల్ 14న రిలీజ్ చేస్తామని చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది.

  బెడ్‌పై బట్టల్లేకుండా హీరోయిన్: హాట్ వీడియో షేర్ చేసిన రాంగోపాల్ వర్మ

  'కేజీఎఫ్ చాప్టర్ 2' రిలీజ్‌కు టైం సమీపిస్తోన్న నేపథ్యంలో.. ఈ మూవీ ట్రైలర్‌ను మార్చి 27వ తేదీన సాయంత్రం 6.40 గంటలకు విడుదల చేయబోతున్నట్లు చిత్ర యూనిట్ ఇటీవలే వెల్లడించింది. ఈ నేపథ్యంలో దీని కోసం ఓ ఈవెంట్‌ను కూడా ప్లాన్ చేశారు. దీన్ని ఎంతో గ్రాండ్‌గా నిర్వహించబోతున్నారు. ఇక, దీనికి కన్నడ స్టార్ హీరో శివ రాజ్‌కుమార్ ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నట్లు తాజాగా ప్రకటన వెలువడింది. అంతేకాదు, పాన్ ఇండియా చిత్రం కావడంతో బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ కరణ్ జోహార్ కూడా దీనికి హాజరు కాబోతున్నాడట. దీంతో ఈ ఈవెంట్ ఎంతో స్పెషల్‌గా జరగబోతుంది.

  క్రేజీ కాంబినేషన్‌లో రూపొందుతోన్న 'కేజీఎఫ్ చాప్టర్ 2' మూవీ టీజర్ నేషనల్ రికార్డులను క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. దీంతో సినిమాపై ఉన్న అంచనాలు రెట్టింపు అయ్యాయి. ఇక, ఈ చిత్రాన్ని హొంబళే ఫిల్మ్స్ సంస్థ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది. శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా చేస్తోంది. వీళ్లతో పాటు పలు పరిశ్రమలకు చెందిన ఎంతో మంది నటీనటులు కీలక పాత్రలు చేస్తున్నారు. రవి బస్రూర్ సంగీతం సమకూర్చాడు.

  English summary
  K.G.F: Chapter 2 is Kannada High Budget Film. This Movie Release on 14th April 2022. Shiva Rajkumar Chief Guest for This Movie Trailer Event.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X