బెదిరించలేదు.. ముంబైని కించపరిస్తే సహించం.. కంగన వివాదంపై సంజయ్ రౌత్
ముంబైకి రావొద్దంటూ కొందరు నేతలు తనను బెదిరిస్తున్నారంటూ కంగన రనౌత్ చేసిన కామెంట్లపై శివ సేన ఎంపీ సంజయ్ రౌత్ స్పందించారు. జాతీయ మీడియాతో సంజయ్ రౌత్ మాట్లాడుతూ.. కంగనతో వివాదంపై క్లారిటీ ఇచ్చేందుకు ప్రయత్నించారు.
కంగనను కానీ, మరెవ్వరినీ మేము బెదిరించలేదు. ఎవరైనా హద్దు మీరితే చర్యలు తీసుకొనే విధానాన్ని పాటిస్తాం. పాక్ ఆక్రమిత కాశ్మీర్ అంటూ ముంబైను పోల్చిన వారి కామెంట్లను తీవ్రంగా పరిగణిస్తున్నాం. పీవోకే గురించి అయితే మాకు ఏమీ తెలియదు. ముంబైని గానీ, మహారాష్ట్రను గానీ కించపరిచే విధంగా మాట్లాడితే మాత్రం ఎవరిని సహించం అని సంజయ్ రౌత్ అన్నారు.

1992 బాంబు పేలుళ్లు, ముంబైపై 26/11 దాడులు గానీ, ఇతర సంఘటనలు జరిగినప్పుడు ముంబై పోలీసులు తమ ప్రాణాలు పణంగా పెట్టి నగరాన్ని రక్షించారు. చాలా మంది పోలీసులు తమ ప్రాణాలను అర్పించారు. కరోనా సమయంలో కూడా ప్రాణాల తెగించి సేవలందించారు అని సంజయ్ రౌత్ చెప్పారు.
అలాంటి ప్రతిష్ట ఉన్న ముంబై పోలీసులను తక్కువ చేసి మాట్లాడటం, వారి సేవలను, వారి ప్రతిభను చులకన చేయడం మాకు ఇబ్బంది కలిగింది అని సంజయ్ రౌత్ అన్నారు. అందుకే ఎవరైనా ముంబై పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించం అని అన్నారు.


Click it and Unblock the Notifications











