సోనూ సూద్ సహాయాల వెనక రాజకీయ ముసుగు.. దుమ్మెత్తిపోస్తున్న జనాలు!

ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై సోనూ సూద్ ఒక విలన్ గానే ఎక్కువగా క్రేజ్ అందుకున్నాడు. నార్త్ లోనే కాకుండా సౌత్ సినిమాల్లో కూడా సోనూ సూద్ కి మంచి క్రేజ్ ఉంది. అయితే ఇటీవల అతనికున్న క్రేజ్ మరింత పెరిగిందనే చెప్పాలి. సినిమా విలన్ ని ఒక హీరోలా జనాలు ఆకాశానికి ఎత్తేశారు. అయితే సడన్ గా అతనిపై పొలిటికల్ కామెంట్స్ రావడం వైరల్ గా మారింది.

అండగా నిలిచిన యాక్టర్..

అండగా నిలిచిన యాక్టర్..

సోనూ సూద్ మునుపెన్నడు లేని విదంగా ఈ మధ్య కాలంలో తన అసలైన మంచి తనాన్ని చాటుకున్నాడు. లాక్ డౌన్ కారణంగా పేద ప్రజలు సొంత ఇళ్లకు చేరుకోలేని పరిస్థితి ఏర్పడింది. చాలా మంది వందల కీలమీటర్లు రోడ్డు మీద నడుస్తుంటే వారికి సోనూ సూద్ అండగా నిలిచాడు. బస్సులను ఏర్పాటు చేసి తీరాలకు చేర్చాడు.

 దేశవ్యాప్తంగా..

దేశవ్యాప్తంగా..

ముంబై పరిసర ప్రాంతాల నుంచి ఎక్కువగా సొంత ఊళ్లకు రోడ్డు బాట పట్టిన పేదలను వారి స్వస్థలాలకు పంపేందుకు సోనూ సొంత ఖర్చులతో వందలాది బస్సులను ఏర్పాటు చేశాడు. అతను చేసిన పనికి దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు దక్కింది. అయితే అతను చేసిన సహాయంపై కానీ కొన్ని రాజకీయ వాదనలు వినిపిస్తుండడం గమనార్హం.

సోనూ సూద్ పాలిటిక్స్?

సోనూ సూద్ పాలిటిక్స్?

సోనూ సూద్ త్వరలోనే రాజకీయాల్లోకి రాబోతున్నారని ప్రధాని మోడీని కలుసుకొని బీజేపీ కండువ కప్పుకునే ఛాన్స్ ఉన్నట్లు నార్త్ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. ఇక రీసెంట్ గా ఒక పొలిటీషియన్ కూడా సోనూ సూద్ పై ఆ విధంగా స్పందించడం హాట్ టాపిక్ గా మారింది. నిజంగా సోనూ సూద్ వెనుక ఒక రాజకీయ వ్యూహం ఉందని చెప్పడం వైరల్ గా మారింది.

దుమ్మెత్తిపోస్తున్నారు..

దుమ్మెత్తిపోస్తున్నారు..

శివసేన నాయకుడు సంజయ్ రౌత్.. సోనూ సూద్ మంచి పనులు చేశాడు అంటూనే మరోవైపు సెటైర్లు వేయడం హాట్ టాపిక్ గా మారింది. ఈ లాక్ డౌన్ లో సోనూ సూద్ ఎప్పుడు చేయని విధంగా సహాయం చేశాడు. అయితే దాని వెనక ఒక రాజకీయ దర్శకుడు ఉండవచ్చని ఆయన కామెంట్ చేశారు. దీంతో సోషల్ మీడియాలో సంజయ్ విమర్శలకు కౌంటర్లు పడుతున్నాయి. ఓ విదంగా సోనూ సూద్ నుంచి సహాయం పొందిన వారు సంజయ్ రౌత్ పై దుమ్మెత్తిపోస్తున్నారు.

Recommended Video

Music Composer Wajid Khan Of Sajid-Wajid Passes Away Due To COVID-19
రాజకీయాల్లోకి వచ్చినా తప్పు లేదు..

రాజకీయాల్లోకి వచ్చినా తప్పు లేదు..

రాజకీయ నాయకులు చేయలేని పని సోనూ సూద్ చేశాడు. అలాంటి మంచి మనిషి రాజకీయాల్లోకి వచ్చినా తప్పు లేదని పలువురు కామెంట్ చేస్తున్నారు. ఇక ఇటీవల ముంబై నుంచి డెహ్రాడూన్ కి 173 మంది వలసధారులను స్పెషల్ చార్టెడ్ ఫ్లైట్ లో పంపించాడు. సొంత ఖర్చులతో పేదలను సొంత ఇళ్లకు పంపడానికి సోనూ సూద్ చేస్తున్న కృషికి మరోసారి నెటీజన్స్ అతనిపై ప్రశంసలు కురిపిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X