పవన్ కళ్యాణ్ బుగ్గ గిల్లి ముద్దు పెట్టేశాడు... అందుకే అంత అభిమానం: సీనియర్ కొరియోగ్రాఫర్ కామెంట్స్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో ఎవరైనా స్నేహం చేస్తే వారితో చాలా తొందరగా కలిసి పోతారని స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఎలాంటి సినిమా చేసినా కూడానా దాదాపు ఆ సినిమాతో వర్క్ చేసిన వారంతా కూడా పవన్ ను ఒక స్టార్ లా కాకుండా చాలా స్నేహ బావంతోనే చూస్తారు. ఆ విధంగా పవన్ తన స్టార్ స్టేటస్ ను దూరం పెడుతుంటాడు. ఇక ఇటీవల ఒక సీనియర్ కొరియోగ్రాఫర్ పవన్ గురించి చెప్పిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

స్టార్ ఇమేజ్ ఎంత పెరిగినా..
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మొదటి సినిమా నుంచి కూడా తోటి నటీనటులతో పాటు టెక్నీషియన్స్ తో కూడా ఎంతో స్నేహంగా ఉండడం అలవాటుగా వస్తున్నదే. పవర్ స్టార్ ఇమేజ్ పెరిగుతున్నా కూడా నేలమిదే కూర్చోవడానికి ఇష్టపడతారు. సెట్స్ లో అయినా కూడా హడావుడి చేయకుండా తన పని తనే చేసుకుంటూ ఉంటాడు.

ఎవరైనా ఒక్కసారి మాట్లాడితే
పవన్ కళ్యాణ్ తో ఎవరైనా ఒక్కసారి మాట్లాడితే ఆయనకు మొదటి మాటలోనే అభిమానులు అవుతుంటారని చాలామంది సెలబ్రేటీలు చెబుతుంటారు. ఇక ఇటీవల ఒక సీనియర్ కొరియోగ్రాఫర్ కూడా పవన్ కళ్యాణ్ తో వర్క్ చేసినప్పుడు ఆయన చూపించిన ఆప్యాయత సాన్నిహిత్యం ఎంతగానో ఆకట్టుకున్నట్లు చెప్పారు.

ఆ కాలం నుంచి.. ఇప్పటివరకు..
ఆ సీనియర్ కొరియోగ్రాఫర్ మరెవరో కాదు. సీనియర్ మోస్ట్ డ్యాన్స్ మాస్టర్ శివ శంకర్. ఎన్టీఆర్, ఏఎన్నార్ కాలం నుంచి నేటితరం ప్రభాస్, నాగశౌర్య, వంటి హీరోలతో కూడా వర్క్ చేస్తూ వస్తున్నారు. ఇక చాలా కాలం తరువాత ఆయన అత్తారింటికి దారేది సినిమాలోని దేవ దేవం.. పాటకు కొరియోగ్రఫీ చేశారు.

బుగ్గ గిల్లి స్నేహంగా ముద్దు కూడా..
శివశంకర్ మాట్లాడుతూ.. అయితే సాంగ్ కంపోజిషన్స్ చూసిన పవన్ మొదట చాలా రోజుల తరువాత చూశానని ఆప్యాయంగా హద్దుకున్నారు. ఇక ఆ తరువాత ఎంత బాగా చేస్తున్నారు అంటూ బుగ్గ గిల్లి స్నేహంగా ముద్దు కూడా పెట్టుకున్నారు. అంత పెద్ద స్టార్ నాతో అంత సన్నిహితంగా ఉండడం నేను ఎన్నటికీ మరచిపోలేను. పవన్ కళ్యాణ్ ఒక యాక్టర్ గా కంటే కూడా నాకు వ్యక్తిగతంగా చాలా ఇష్టం. నలుగురికి సహాయం చేయాలని అనుకునే అతని మంచి గుణం నన్ను ఎంతగానో ఆకట్టుకుంది.. అని వివరణ ఇచ్చారు.


Click it and Unblock the Notifications











