twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘మా’ వివాదం: డ్రగ్స్, శ్రీరెడ్డి ఇష్యూపై నటి జీవితకు శివాజీ రాజా కౌంటర్

    |

    Recommended Video

    Shivaji Raja Press Meet : Shivaji Raja Controversial Comments On Jeevitha Rajasekhar | Filmibeat

    'మా' వివాదం రోజు రోజుకు ముదురుతోంది. శివాజీ రాజా, నరేష్ వర్గాలు ఎన్నికల ముందు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకున్న సంగతి తెలిసిందే. ఎన్నికల తర్వాత కూడా నరేష్ ప్యానల్ మీడియా సమావేశం ఏర్పాటు చేసి... శివాజీ రాజా ప్రెసిడెంట్ కుర్చీని పట్టుకుని వేలాడుతున్నారంటూ ఫైర్ అయ్యారు.

    'మా' ఎన్నికల్లో గెలుపొందిన నరేష్ ప్యానల్ మీడియా సమావేశం జరిగిన మూడు రోజులకు శివాజీ రాజా కౌంటర్ ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఓటమి తర్వాత తొలిసారి మీడియా ముందుకు వచ్చిన ఆయన తనపై వచ్చిన ఆరోపణలను తిప్పి కొట్టారు.

    అందుకే మూడు రోజులు వెయిట్ చేశాను

    అందుకే మూడు రోజులు వెయిట్ చేశాను

    వారు నా గురించి ప్రెస్ మీట్ ఏర్పాటు చేసిన వెంటనే కౌంటర్ ఇద్దామని అనుకున్నాను. ఇంకా ‘మా'ను రోడ్డు మీదకు లాగుతున్నామా? అనే చిన్న ఆలోచనతో ఆగాను. మాకు టిఎఫ్ఐ అని ఒక కమిటీ ఉంది. అందులో ‘ఎవరూ మా పర్మిషన్ లేకుండా ప్రెస్ మీట్లకు వెళ్లొద్దు' అని రూల్ పెట్టారు. వారు నరేష్ తదితరులకు క్లాస్ తీసుకుంటారేమో? హెచ్చరిస్తారేమో? అని ఎదురు చూశాను. ఈ మూడు రోజుల నుంచి టిఎఫ్ఐ ఏమీ స్పందించలేదు. అందుకే నేను ప్రెస్ ముందుకు వచ్చాను అని శివాజీ రాజా తెలిపారు.

    ఇన్సూరెన్స్ వివాదంపై

    ఇన్సూరెన్స్ వివాదంపై

    ఇన్సూరెన్స్ ఎక్స్‌పైర్ అయిపోయిందనే విషయం గురించి శివాజీ రాజా మాట్లాడుతూ... అవి డెత్ ఇన్సూరెన్స్ ఫైల్స్. దీన్ని 2 లక్షల నుంచి 3 లక్షలు చేద్దామని అనుకున్నాం. ఈ ప్రక్రియ జరిగేలోపే ఎలక్షన్ కోడ్ వచ్చింది కాబట్టి జరుగలేదు. దాని వల్ల ఏ ఇబ్బంది ఉండదు. చాలా మంది అది హెల్త్ ఇన్యూరెన్స్ అనుకున్నారు. అది వచ్చే నెల వరకు టైమ్ ఉందని శివాజీ రాజా స్పష్టం చేశారు.

    పదవి పట్టుకుని వేలాడటం లేదు, చిల్లరగా ప్రవర్తిచకండి: ‘మా'జీ అధ్యక్షుడు శివాజీ రాజాపదవి పట్టుకుని వేలాడటం లేదు, చిల్లరగా ప్రవర్తిచకండి: ‘మా'జీ అధ్యక్షుడు శివాజీ రాజా

    అబద్దాలు చెబుతున్నారు, అడ్డు పడలేదు

    అబద్దాలు చెబుతున్నారు, అడ్డు పడలేదు

    నేను వారు ప్రమాణ స్వీకారం చేసుకోకుండా అడ్డు పడుతున్నాను అనే విషయంలో నిజం లేదు. వారు అబద్దాలు చెబుతున్నారు. ‘మా' చట్టంలో ఉన్న నిబంధనల ప్రకారం 31 వరకు నేను పదవిలో ఉండొచ్చు. ఆ విషయం వారికి చెప్పానే తప్ప అడ్డు పడలేదు. అడ్డు పడితే నాకు వచ్చేదేముంది? బ్యాడ్ నేమ్ తప్ప, అడ్డు పడాల్సిన అవసరం నాకు లేదని శివాజీ రాజా తెలిపారు.

    కోర్టుకు వెళతాను అనలేదు

    కోర్టుకు వెళతాను అనలేదు

    లాయర్ నాకు ఫోన్ చేసి ఇలా మార్చి 22న వారు ప్రమాణ స్వీకారం పెట్టుకుంటున్నారు అంటే... సార్ బై లా చూశారా? మేము గతంలో ఎన్నికలు జరిగినపుడు 25 రోజులు ఆగామని చెప్పాను. పంతులుగారు మంచి రోజు అని చెప్పారట... ఏప్రిల్ 1 వరకు ఆగరట అంటే... సార్ గతంలో ఇలానే కొందరు కోర్టుకు వెళ్లారు, ఈ సారి అలా జరుగుతుందేమో? అన్నానే తప్ప, అడ్డుపడలేదు. అంతకు మించి ఏమీ లేదని శివాజీ రాజా స్పష్టం చేశారు.

    జీవిత సోదరుడు డ్రగ్స్ అమ్ముతున్నట్లు పేపర్లో రాశారు

    జీవిత సోదరుడు డ్రగ్స్ అమ్ముతున్నట్లు పేపర్లో రాశారు

    నా మీద జీవిత వ్యక్తిగతంగా ఆరోపణలు చేయడానికి కారణం ఉంది. నాకు జీవితగారు ఒకసారి ఫోన్ చేసి శ్రీరెడ్డి విషయంలో, డ్రగ్స్ విషయంలో సరిగా స్పందించలేదు అన్నారు. డ్రగ్స్ విషయంలో నేను స్పందించినట్లు ఏ ప్రెసిడెంట్ స్పందించలేదు. కావాలంటే యూట్యూబ్ వీడియోలు చూసుకోండి. వాళ్ల బ్రదరే డ్రగ్స్ అమ్ముతుంటే పట్టుకున్నారని టీవీల్లో, పేపర్లలో చూశాను. నేను స్వయంగా చూడలేదు. లేని వ్యక్తి గురించి నేను అలా మాట్లాడకూడదు.. కానీ మీరు అడిగారు కాబట్టి పేపర్లో వచ్చిన విషయం గుర్తు చేస్తున్నాను. దానిపై నేనేమి మాట్లాడగలను? అని శివాజీ రాజా వ్యాఖ్యానించారు.

    శ్రీరెడ్డి ఇష్యూపై

    శ్రీరెడ్డి ఇష్యూపై

    ఇక శ్రీరెడ్డి విషయానికొస్తే... మెంబర్ షిప్ ఇవ్వొద్దు, కామ్‌గా ఉండాలని జనరల్ సెక్రటరీగారే చెప్పారు. అందుకే ఇవ్వొద్దు అనుకున్నాం. ఇస్తే రాజీనామా చేస్తామని ఒకరు చెబుతారు, ఇవ్వకపోతే ఊరుకోమని ఇంకొకరు చెబుతారు.. ఆ అమ్మాయి అలా చేసినపుడు ఏం చేయాలో అర్థం కాక అందరం అపుడు కన్‌ఫ్యూజన్లో ఉన్నాం.... అందుకే అపుడు సరిగా స్పందించలేక పోయామని శివాజీ రాజా స్పష్టం చేశారు.

    English summary
    Maa Ex President Shivaji Raja Press Meet On Maa New President Naresh, general secretary Jeevitha Controversy Comments.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X