Shivam Bhaje First Review: శివం భజే ఫస్ట్ రివ్యూ.. సెన్సార్ షాకింగ్ రిపోర్ట్!
భారతీయ పురాణాలను ఆధారంగా చేసుకొని ప్రస్తుత సామాజిక పరిస్థితులకు అన్వయించి చేస్తున్న సినిమాలకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన, ఆదరణ లభిస్తున్నది. అలాంటి కోవలో వస్తున్న చిత్రాల్లో శివం భజే ఒకటి. శివ తత్వం ఆధారంగా భారతీయ, చైనా దేశాల మధ్య ఓ క్రిటికల్ పాయింట్‌తో వస్తున్న చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ ఆదరణ లభిస్తున్నది. ఈ సినిమా వివరాల్లోకి వెళితే..
శివం భజే సినిమా ట్రైలర్ విడుదల తర్వాత అశ్విన్ బాబు హీరోగా, బాలీవుడ్ నటుడు అర్బాజ్ ఖాన్, యువ హీరోయిన్ దిగంగన సూర్యవంశీ నటించిన ఈ సినిమాపై భారీ అంచనాల నెలకొన్నాయి. అఫ్సర్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాను ఇటీవల సెన్సార్ బోర్డు అధికారులు వీక్షించారు.

సర్వం సర్వేశ్వరుడు ఆడించే ఆటే శివం భజే చిత్రంగా రూపొందింది. ఈ సినిమాను రూపొందించి తీరును అధికారులు ప్రశంసించినట్టు తెలిసింది. ఈ సినిమాలోని పాయింట్‌ను చర్చించిన విధానాన్ని ఆకట్టుకొనే విధంగా రూపొందించిన విధానాన్ని మెచ్చుకొన్నట్టు తెలిసింది.
శివం భజే సినిమాలోని సన్నివేశాలపై, కథ, కథనాలపై సెన్సార్ బోర్డు అధికారులు సంతృప్తి చెందారు. ఈ సినిమా రివ్యూ చేసిన తర్వాత నిబంధనలు అనుసరించి ఈ సినిమాకు U/A సర్టిఫికెట్‌ను అందించారు. గంగా ఎంటర్టైన్మంట్స్ 'శివం భజే' చిత్రం 2 గంటల 6 నిమిషాల నిడివితో నేడు సెన్సార్ పూర్తి చేసుకుని యు/ఎ సర్టిఫికెట్ అందుకుం ఈ సినిమా ఆగస్టు 1న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నది.



Click it and Unblock the Notifications











