శివన్ ట్రైలర్: నాలుగు ముద్దులు.. రెండు బూతులు.. పిచ్చెక్కించే బోల్డ్ సీన్స్
తెలుగు సినీ ఇండస్ట్రీలో అడల్ట్ కంటెంట్ సినిమాలు కుప్పలు తెప్పలుగా వచ్చేస్తున్నాయి. 'అర్జున్ రెడ్డి', 'RX100' చిత్రాలను ఆదర్శంగా తీసుకుంటున్నారో ఏమో గానీ వీటి సంఖ్య క్రమక్రమంగా పెరిగిపోతోంది. ఒక అందమైన లవ్ స్టోరీ దాని చుట్టూ లిప్ లాక్‌లు, బూతులు, బోల్డ్ సీన్స్ ఇదే ఫార్మాట్‌లో సినిమాను రూపొందిస్తున్నారు. అయితే, దీనిని తమకు నచ్చిన జోనర్‌లో తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే ఈ తరహా చిత్రాలు తెలుగు చిత్ర సీమను పలకరించి వెళ్లిపోయాయి. ఇప్పుడు అలాంటి జోనర్‌లో మరో సినిమా వస్తోంది. అదే.. 'శివన్'.
కల్వకోట సాయి తేజ, తరణీ సింగ్ జంటగా నటిస్తున్న ఈ చిత్రాన్ని శివన్ అనే దర్శకుడు తెరకెక్కించాడు. సంతోష్ రెడ్డి దీన్ని నిర్మించాడు. ఈ సినిమాకు సిద్దార్థ్ సదాశివుని సంగీతం అందిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. ఈ నేపథ్యంలోనే 'శివన్' ట్రైలర్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది.

ఈ ట్రైలర్‌లో హీరో.. చిన్నతనంలోనే తన తల్లిని కోల్పోతాడు. ఆ తర్వాత ఓ అమ్మాయిని ప్రేమిస్తాడు. వీళ్ల ప్రేమకథ సాఫీగా సాగిపోతుందనుకుంటున్న సమయంలో హీరోయిన్ హత్యకు గురవుతుంది. ఇంతకీ ఆ అమ్మాయిని ఎవరు చంపేశారు..? ఎందుకు చంపేశారు..? అనే కోణంలో ఈ సినిమా తెరకెక్కింది. పూర్తి సస్పెన్స్ థ్రిల్లర్‌గా వస్తున్న 'శివన్'లో యూత్‌ను ఆకర్షించే సీన్స్ కూడా ఉన్నాయి. అది ట్రైలర్ చూస్తేనే అర్థం అవుతోంది. లిప్ లాక్‌లు, బూతు మాటలు, బోల్డ్ సీన్స్ ఇందులో కనిపించాయి.
గతంలో కూడా ఇలా కొన్ని సినిమాలు వచ్చినప్పటికీ సెన్సార్ బోర్డు దగ్గరే ఆగిపోయాయి. టీజర్, ట్రైలర్ విడుదల చేసి సినిమాపై ఆసక్తిని పెంచడంలో మాత్రం సక్సెస్ అయిన 'శివన్'.. సెన్సార్‌ను అధిగమిస్తుందేమో చూడాలి. ఎంతో ఆసక్తిని రేకెత్తిస్తున్న ఈ ట్రైలర్‌పై మీరూ ఓ లుక్కేయండి.


Click it and Unblock the Notifications











