WWW movie review థ్రిల్లింగ్‌గా కేవీ గుహన్ టేకింగ్, డైరెక్షన్

సురేష్ ప్రొడ‌క్ష‌న్స్ స‌మ‌ర్ప‌ణ‌లో ప్ర‌ముఖ‌ సినిమాటోగ్రాఫ‌ర్ కేవి గుహన్ ద‌ర్శ‌కత్వంలో అదిత్‌ అరుణ్, శివాని రాజశేఖర్‌ హీరో హీరోయిన్లుగా రామంత్ర క్రియేష‌న్స్ పతాకంపై డా. రవి ప్రసాద్ రాజు దాట్ల నిర్మించిన థ్రిల్ల‌ర్ మూవీ "WWW"(ఎవ‌రు, ఎక్క‌డ‌, ఎందుకు). ఈ చిత్రం సోని లివ్ ఓటీటీలో రిలీజైంది. భారీ అంచనాల మధ్య రిలీజైన ఈ చిత్రం ఎలాంటి అనుభూతిని కలిగించిందంటే..

Shivani Rajashekhars WWW movie review and Rating

సాఫ్ట్‌వేర్ ప్రొఫెషనల్స్‌గా విశ్వ (అదిత్ అరుణ్), అష్రఫ్ (ప్రియదర్శి), సదా (సత్యం రాజేష్), చిష్ట్రీ (దివ్య శ్రీపాద) బెస్ట్ ఫ్రెండ్స్. వేర్వేరు నగరాల్లో ఉండే ఈ నలుగురు ఫ్రెండ్స్ వీడియో కాలింగ్‌తో నిత్యం టచ్‌లో ఉంటారు. చిష్ట్రికి ఫ్రెండ్ మిత్ర (శివాని రాజశేఖర్)ను తొలి చూపులోనే విశ్వ ప్రేమిస్తాడు. బెంగళూరులోని మిత్రను వీడియో కాలింగ్ చాట్ బాక్స్‌తో విశ్వ టచ్‌లో ఉంటాడు. వారిద్దరూ పీకల్లోతు ప్రేమలో ఉండి.. నేరుగా కలుసుకోవాలని అనుకొంటున్న సమయంలో దేశంలో లాక్‌డౌన్‌ విధిస్తాడు. ఆ సమయంలో మిత్ర, చిష్ట్రీ ఇంటిలోకి అగంతకుడు (సందీప్) ప్రవేశిస్తాడు. చిష్ట్రీని కత్తితో పొడిచి.. మిత్రను కూడా చంపేస్తానని చెప్పి విశ్వను బ్లాక్ మెయిల్ చేస్తాడు.

మిత్ర, చిష్ట్రీ ఇంటిలోకి అగంతకుడు ఎందుకు ప్రవేశించాడు? చిష్ట్రీని ఎందుకు కత్తితో పొడుస్తాడు? విశ్వను ఎందుకు బ్లాక్ మెయిల్ చేస్తాడు? చివరకు అగంతకుడి చేతిలో మిత్ర పరిస్థితి ఏమౌంది? కత్తి పోట్లకు గురైన చిష్ట్రీ పరిస్థితి ఏంటి? విశ్వను సూసైడ్ చేసుకోమని అగంతకుడు డిమాండ్ చేశాడు. విశ్వకు అగంతకుడికి మధ్య ఉన్న లింకేమిటి? మిత్రనే అగంతకుడు ఎందుకు టార్గెట్ చేశాడు అనే ప్రశ్నలకు సమాధానమే WWW మూవీ కథ.

అనైతికంగా, చట్టవ్యతిరేకంగా జరిపే హ్యాకింగ్ కథాంశంతో WWW తెరకెక్కింది. టెక్నాలజీకి తోడుగా లవ్, హారర్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ కలిపి ఈ సినిమాను దర్శకుడు, సినిమాటోగ్రఫర్ కేవీ గుహన్ తెరకెక్కించారు. లవ్, ఎమోషన్స్ సినిమాకు బలంగా మారాయి. శివానీ, అదిత్ అరుణ్, సందీప్ పెర్ఫార్మెన్స్ సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్. అయితే ఒకే పాయింట్‌ను సాగదీసి కథ చెప్పిన ఫీలింగ్ కలుగుతుంది.

దర్శకుడు కేవీ గుహన్ ఎంచుకొన్న పాయింట్ థ్రిల్లింగ్‌గా ఉంటుంది. హ్యకింగ్ వల్ల యువత పెడదారులు పడుతున్నది. దాని వల్ల ఫ్యామిలీలు ఎలా రోడ్డున పడుతున్నాయనే అంశాలతో ఈ సినిమాను తక్కువ బడ్జెట్, పరిమితమైన లొకేషన్లలో తెరకెక్కించిన తీరును అభినందించాల్సిందే. రెండు గదులు, నాలుగు కంప్యూటర్స్‌తో తెర మీద మ్యాజిక్ చేశారు. కథ, సన్నివేశాలు పరంగా మరింత దృష్టిపెట్టాల్సింది. అదిత్ అరుణ్‌ను మరింత బెటర్‌గా ప్రజెంట్ చేయాల్సింది. ఫస్టాఫ్‌ థ్రిల్లింగ్ అంశాలుంటే.. సెకండాఫ్‌లో కొన్ని సీన్లు నాసిరకంగా ఉంటాయి. కాకపోతే ఓవరాల్‌గా సినిమా ఆసక్తికరంగా సాగుతుంది.

నటీనటులు విషయానికి వస్తే.. ముఖ్యంగా శివానీ రాజశేఖర్, అదిత్ అరుణ్, సందీప్ గురించి చెప్పుకోవాలి. శివానీ గ్లామరపరంగా ఆకట్టుకొన్నది. అయితే పాత్రకు ఉన్న కొన్ని పరిమితుల కారణంగా ఆమె మరింతగా తన ప్రతిభను చాటుకోలేకపోయింది. కాని కొన్ని సన్నివేశాల్లో ఆమె నటన చాలా బాగుంది. ఇక అదిత్ అరుణ్ కొత్తగా విభిన్నమైన పాత్రలో కనిపించాడు. ఒకే గదిలో సాగే కథలో రకరకాల ఎమోషన్స్ పలికించాడు. సందీప్ చాలా క్రూరంగా తెరమీద కనిపించాడు. సాఫీగా సాగుతున్న కథను అల్లకల్లోలం చేసినట్టు కనిపిస్తాడు. మిగితా పాత్రలను పోషించిన నటీనటులు పర్వాలేదనిపించారు.

సాంకేతిక అంశాల్లో సైమన్ కే కింగ్ అందించిన మ్యూజిక్ బాగుంది. ముఖ్యంగా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ పలు సన్నివేశాలను ఎలివేట్ చేసింది. తమ్మిరాజు ఎడిటింగ్ బాగుంది. దర్శకుడు కేవీ గుహన్ అందించిన సినిమాటోగ్రఫి కూడా ఆకట్టుకొన్నేలా ఉంది. నిర్మాత రవి ప్రసాద్ రాజు దాట్ల అనుసరించిన ప్రొడక్షన్ వ్యాల్యూస్ అద్భుతంగా ఉన్నాయి. క్రైమ్, హారర్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌ నేపథ్యంగా వచ్చే సినిమాలను ఆదరించే వారికి ఈ సినిమా తప్పకుండా నచ్చుతుంది. ఇంట్లోనే హ్యాపీగా చూస్తూ.. సినిమాను ఎంజాయ్ చేయడానికి పుష్కలంగా అంశాలు ఉన్నాయి.

నటీనటులు: అదిత్ అరుణ్, శివాని రాజశేఖర్, ప్రియదర్శి, సత్యం రాజేశ్, దివ్య శ్రీపాద తదితరులు
కథ, స్క్రీన్‌ ప్లే, సినిమాటోగ్రఫి, దర్శకత్వం: కె వి గుహన్
నిర్మాత: డా. రవి ప్రసాద్ రాజు దాట్ల
కో-ప్రొడ్యూసర్‌: విజయ్‌ ధరణ్‌ దాట్ల
సంగీతం: సైమన్‌ కె. కింగ్
ఎడిటింగ్‌: తమ్మిరాజు
ఆర్ట్‌: నిఖిల్‌ హాసన్
డైలాగ్స్‌: మిర్చి కిరణ్
లిరిక్స్‌: రామజోగయ్యశాస్త్రి, అనంత శ్రీరామ్, రోల్‌రైడా
కొరియోగ్రఫి: ప్రేమ్‌ రక్షిత్
స్టంట్స్‌: రియల్‌ సతీష్
కాస్ట్యూమ్‌ డిజైనర్‌: పొన్మని గుహన్
ప్రొడక్షన్‌ కంట్రోలర్‌: కె. రవి కుమార్
స‌మ‌ర్ఫ‌ణ‌: సురేష్ ప్రొడ‌క్ష‌న్స్‌
బ్యానర్‌: రామంత్ర క్రియేషన్స్
రిలీజ్: 2021-12-21

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X