నాని అంటే ప్రేమ.. అదే ఎన్టీఆర్‌ని చూస్తే.. 'దొరసాని' మాటలు చూడండి

Recommended Video

Shivathmika Interesting Comments On Jr NTR & Nani || Filmibeat Telugu

'దొరసాని' గా తెలుగు ప్రేక్షకులకు పరిచయం కాబోతోంది జీవితరాజశేఖర్ కూతురు శివాత్మిక. విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండతో ఈ సినిమాలో జోడీ కట్టింది. అటు శివాత్మిక, ఇటు ఆనంద్ ఎవరకొండ ఇద్దరికీ ఇదే తొలి సినిమా కావడం విశేషం. మరికొద్ది రోజుల్లోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలు వేగవంతం చేశారు యూనిట్ సభ్యులు. ఇందులో భాగంగా తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో హీరో ఆనంద్ దేవరకొండ, హీరోయిన్ శివాత్మిక ఆసక్తికరంగా స్పందించారు. వివరాల్లోకి పోతే..

ఎవరి ఇష్టాయిష్టాలు వారివి.. క్రష్ అనేది కామన్

ఎవరి ఇష్టాయిష్టాలు వారివి.. క్రష్ అనేది కామన్

సాధారణంగా ఎవరి ఇష్టాయిష్టాలు వారికుంటాయి. పైగా ఈ రోజుల్లో ప్రేమ, క్రష్ అనేది కామన్ అయిపోయింది. ఈ అంశాన్నే ఫోకస్ చేస్తూ ఆనంద్ దేవరకొండ, శివాత్మికలను క్రష్ గురించి చెప్పమని అడిగారు మీడియా ప్రతినిధులు. అయితే దీనిపై రియాక్ట్ అయిన ఆనంద్ దేవరకొండ తనకు బాలీవుడ్ భామ దీపిక పదుకొనే అంటే క్రష్ అని ఓపెన్‌గా చెప్పేశాడు.

నాని అంటే లవ్.. శివాత్మిక

నాని అంటే లవ్.. శివాత్మిక

ఇక ఇదే విషయమై శివాత్మిక స్పందిస్తూ చాలా మంది హీరోల పేర్లు చెప్పి ఆశ్చర్యపరిచింది. తనకు రణబీర్ కపూర్, విక్కీ కౌశల్, రణవీర్ సింగ్, ఆదిత్య కపూర్ లాంటి బాలీవుడ్ హీరోలతో పాటు టాలీవుడ్ హీరోల్లో నాని అంటే లవ్ అని చెప్పింది. లవ్ అంటే నానిపై క్రష్ అనుకోకండి.. నాని నటనపై ప్రేమ అని చెప్పింది శివాత్మిక.

ఎన్టీఆర్‌ని చూస్తే..

ఎన్టీఆర్‌ని చూస్తే..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటనా ప్రతిభ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలా! డాన్స్, డైలాగ్స్ అన్నింటా ఎన్టీఆర్ కింగే. అదే విషయాన్నీ స్పష్టం చేసింది దొరసాని. ఎన్టీఆర్ యాక్టింగ్ చూస్తే మతిపోతుంది అని ఈ సందర్బంగా శివాత్మిక పేర్కొంది.

 'దొరసాని' చిత్రం

'దొరసాని' చిత్రం

కేవీఆర్‌ మహేంద్ర దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'దొరసాని' చిత్రంలో ఆనంద్ దేవరకొండ, శివాత్మిక జంటగా నటిస్తున్నారు. చాలా ఏళ్ల క్రిందటి నిజ జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాను యశ్‌ రంగినేని, మధురా శ్రీధర్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. చిత్రానికి దగ్గుబాటి సురేశ్‌బాబు సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. ప్రశాంత్‌ ఆర్‌ విహారి సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్, టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకొని 'దొరసాని' పై అంచనాలు పెంచేశాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X