రీమేక్‌పై కన్నేసిన బాహుబలి నిర్మాతలు.. కేరాఫ్ కంచరపాలెం దర్శకుడికి బాధ్యతలు

టాలీవుడ్‌ను ప్రపంచ స్థాయిలో నిలబెట్టిన బాహుబలి నిర్మాతలు శోభు యార్ల‌గ‌డ్డ‌, ప్ర‌సాద్ దేవినేని. అంతటి గొప్ప చరిత్ర లిఖించిన చిత్రాన్ని తెరకెక్కించినా.. వెను వెంటనే ప్రాజెక్ట్‌లను ఓకే చేసి డబ్బులు సంపాదించుకోవాలని ప్రయత్నించలేదు. అంత‌ర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన చిత్రం బాహుబ‌లి. తెలుగు సినిమా ప్రేక్ష‌కులు గ‌ర్వ‌ప‌డే ఈ గొప్ప చిత్రాన్ని అందించిన నిర్మాత‌లు కేవలం క్వాలిటీ సినిమాల నిర్మాణంపైనే ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది.

ఓ రీమేక్‌పై కన్ను..

ఓ రీమేక్‌పై కన్ను..

ఆర్కా మీడియా వ‌ర్క్స్, మ‌హాయాణ మోష‌న్ పిక్చ‌ర్స్ బ్యాన‌ర్స్‌పై శోభు యార్ల‌గ‌డ్డ‌, ప్ర‌సాద్ దేవినేని, విజ‌య ప్ర‌వీణ ప‌రుచూరి నిర్మాత‌లుగా `కేరాఫ్ కంచ‌పాలెం` ఫేమ్ వెంక‌టేశ్ మ‌హ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమాను రూపొందిస్తున్నారు. మ‌ల‌యాళ హీరో ఫాహ‌ద్ ఫాజిల్ హీరోగా న‌టించిన హిట్ చిత్రం ‘మ‌హేశింతే ప్ర‌తీకార‌మ్‌' చిత్రానికి తెలుగులో రీమేక్ చేస్తున్నారు.

ఉమామ‌హేశ్వ‌ర ఉగ్ర‌రూపశ్య‌

ఈ రీమేక్‌ బాధ్యతలను కేరాఫ్ కంచరపాలెం దర్శకుడు వెంకటేష్ మ‌హ తీసుకున్నాడు. ఈ చిత్రానికి తెలుగులో `ఉమామ‌హేశ్వ‌ర ఉగ్ర‌రూపాశ్య‌` అనే టైటిల్‌ను ఖ‌రారు చేశారు. ఈ సినిమా వీడియో అనౌన్స్‌మెంట్‌ను బుధ‌వారం చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది. జి.ఒ.డి వెబ్ సిరీస్ స‌క్సెస్, బ్రోచెవారెవ‌రురా సినిమాల్లో న‌టించి మెప్పించిన న‌టుడు స‌త్య‌దేవ్ కంచ‌ర‌న ఇందులో హీరోగా న‌టిస్తున్నాడు.

 తెలుగు ప్రేక్ష‌కులు మెచ్చేలా..

తెలుగు ప్రేక్ష‌కులు మెచ్చేలా..

ఈ సంద‌ర్భంగా నిర్మాత‌ శోభు యార్ల‌గ‌డ్డ మాట్లాడుతూ .. వెంక‌టేశ్ మ‌హ మ‌న తెలుగు నెటివిటీకి త‌గ్గ‌ట్టు సినిమాను సెన్సిబుల్‌గా తెర‌కెక్కించ‌గ‌ల ద‌ర్శ‌కుడు అని తెలిపాడు. మల‌యాళంలో విజ‌య‌వంతమైన `మ‌హేశింతే ప్ర‌తీకార‌మ్` చిత్రాన్ని తెలుగు ప్రేక్ష‌కులు మెచ్చేలా త‌ను తెర‌కెక్కించ‌గ‌ల‌డ‌ని న‌మ్మ‌కంతో సినిమాను స్టార్ట్ చేశామని అన్నారు.

 ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్..

ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్..

వెంక‌టేశ్ మ‌హ అరకు వ్యాలీలో 36 రోజుల్లోనే సినిమా షూటింగ్‌ను పూర్తి చేశారు. ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలుజ‌రుగుతున్నాయి. అన్ని కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసి సినిమాను ఏప్రిల్ 17, 2020 విడుల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రానికి జాతీయ అవార్డు గ్ర‌హీతలు బిజ్‌బ‌ల్ సంగీతాన్ని, అప్పు ప్ర‌భాక‌ర్ సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు. స‌త్య‌దేవ్ కంచ‌ర‌న, న‌రేష్‌, సుహాస్‌, జ‌బ‌ర్‌ద‌స్త్ రాంప్ర‌సాద్‌, కరుణాకరణ్, టి.ఎన్‌.ఆర్‌, ర‌వీంద్ర విజ‌య్‌, కె.రాఘ‌వ‌న్ త‌దిత‌రులు

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X