ప్రభాస్‌ను టార్గెట్ చేసిన బాహుబలి నిర్మాత.. బన్నీ కూడా ఇరుక్కున్నాడే.. ఇక నెక్ట్స్ ఎవరో?

సందీప్ రెడ్డి వంగా మొదలుపెట్టిన ఓ ఛాలెంజ్‌కు విస్తృతమైన ప్రచారం వస్తోంది. కరోనా విజృంభిస్తున్న ఈ సమయంలో లాక్ డౌన్ విధించారు. ఈ లాక్ డౌన్‌లో అందరూ ఇంటి పట్టునే ఉండటంతో మహిళలపై పనిభారం పెరుగుతోంది. మగవారు కూడా ఇంటి పనులను చేయాలని, మహిళలకు సాయం చేయాలని #BeTheRealMan అనే ఓ ఛాలెంజ్‌ను ప్రారంభించాడు. ప్రస్తుతం ఇది టాలీవుడ్ దాటి కోలీవుడ్ వరకు వెళ్తోంది. సినిమా రంగం నుంచి రాజకీయ రంగంలోకి ఈ ఛాలెంజ్ పయనించేలా కనిపిస్తోంది.

దర్శకధీరుడికి సవాల్..

దర్శకధీరుడికి సవాల్..

నిజమైన మనిషి అంటూ అర్జున్ రెడ్డి దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ఈ ఛాలెంజ్‌ను మొదలుపెట్టి.. రాజమౌళిపై తదుపరి బాధ్యతను పెట్టాడు. రాజమౌళి ఆ సవాల్‌ను స్వీకరించి ఇంటి పనులను చేశాడు. అక్కడి నుంచి ఎన్టీఆర్, రామ్ చరణ్, సుకుమార్ మళ్లీ అక్కడి నుంచి ఎన్టీఆర్ ద్వారా చిరంజీవి, వెంకటేష్, నాగార్జున, బాలయ్య వంటి హీరోలకు చేరింది. దర్శకుల్లో రాజమౌళి సుకుమార్‌కు, ఎన్టీఆర్ కొరటాలకు, సుకుమార్ వంశీ పైడి పల్లి, దిల్ రాజు, దేవీ శ్రీ ప్రసాద్‌లకు ఇలా సవాళ్లు విసిరారు.

నేడు చిరు మరికొందరికీ..

అలా జూనియర్ ఎన్టీఆర్ నుంచి వచ్చిన ఛాలెంజ్‌ను నేడు చిరంజీవి పూర్తి చేశాడు. అమ్మకు ప్రేమతో వేసిన దోశ, చేసిన విధానం నెటిజన్ల మనసును ఆకట్టుకుంది. ఆపై చిరు రజినీ, మణిరత్నం, కేటీఆర్‌లకు సవాల్ విసిరాడు.

వెంకీమామ సైతం..

జూనియర్ ఎన్టీఆర్ సీనియర్ హీరోలందరికీ ఛాలెంజ్ విసిరాడు. చిరంజీవి, బాలయ్య, వెంకటేష్, నాగార్జున వంటివారందిరిని సవాల్ చేశాడు. తాజాగా వెంకీమామ స్పందిస్తూ.. ఇంట్లో పని చేస్తున్న వీడియోను షేర్ చేశాడు. ఇలా తనవంతుగా పూర్తి చేసి.. మహేష బాబు, వరుణ్ తేజ్, అనిల్ రావిపూడిలకు తదుపరి బాధ్యతను అప్పగించాడు.

Recommended Video

#BeTheRealMan : Megastar Chiranjeevi Accepts Young Tiger NTR Challenges
లేటుగా స్పందించిన శోభు యార్లగడ్డ..

లేటుగా స్పందించిన శోభు యార్లగడ్డ..

రాజమౌళి విసిరిన ఛాలెంజ్‌కు లేటుగా స్పందించిన బాహుబలి నిర్మాత శోభు యార్లగడ్డ అసలుసిసలైన హీరోలకే గురి పెట్టాడు. బట్టలు ఉతకడం, ఆరబెట్టడం వంటి పనులు చేసిన శోభు యార్లగడ్డ.. ప్రభాస్, అల్లు అర్జున్, అడివి శేష్ వంటి హీరోలకు తదుపరి ఛాలెంజ్‌ను విసిరాడు. మరి ఇక ఈ గొలుసు ఎంతవరకు వెళ్తుందో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X