Breaking and Shocking: తెలంగాణ వ్యాప్తంగా సింగిల్ థియేటర్ల మూసివేత.. కారణం ఏమిటంటే?
కరోనా వైరస్ పరిస్థితులు, ఓటీటీల ప్రభావంతో సినిమా పరిశ్రమకు తీరని నష్టం వాటిల్లుందనే వాదనలు గత కొద్దికాలంగా వినిపిస్తున్నాయి. ఓటీటీలో సినిమాలు చూసే సంఖ్య గణనీయంగా పెరగడంతోపాటు థియేటర్లకు వెళ్లి సినిమా చూసే ప్రేక్షకుల సంఖ్య గణనీయంగా తగ్గింది. ఇలాంటి క్రమంలో వేసవిలో సినిమా రిలీజ్‌లు కూడా భారీగా తగ్గిపోయాయి. దాంతో తెలంగాణలో థియేటర్ అసోసియేషన్ అనూహ్యమైన నిర్ణయం తీసుకొన్నది. ఈ వివరాల్లోకి వెళితే...
వాస్తవానికి వేసవి వచ్చిందంటే.. పెద్ద పెద్ద హీరోల సినిమాలు రిలీజ్‌కు సిద్దమవుతాయి. కానీ 2024 సమ్మర్ మాత్రం విపత్కర పరిస్థితి ఎదుర్కొంటున్నది. తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు రావడంతో చిత్రాల రిలీజ్‌లు వెనక్కి వెళ్లాయి. దాంతో సినిమా థియేటర్లన్నీ వెలవెల పోతున్నాయి. దాంతో వాటి మెయింటెన్స్ భారం తలకు మించిన వ్యవహారంగా మారింది.

అయితే మే నెలలో పెద్దగా సినిమాలు రిలీజ్ లేకపోవడంతో థియేటర్లన్నీ ఖాళీగా ఉంటూ కనిపిస్తున్నాయి. దాంతో రోజు వారీ మెయింటెనెన్స్, అలాగే సిబ్బంది జీతాలు చెల్లించడం కష్టంగా మారింది. దాంతో పది రోజుల పాటు సింగిల్ థియేటర్లు మూసి వేయాలని అసోసియేషన్ నిర్ణయం తీసుకొన్నది.
సినిమాల విడుదల లేకపోవడం వల్ల థియేటర్ల నిర్వహణ వ్యవహారం కష్టంగా మారింది. దాంతో 10 రోజులపాటు సింగిల్ థియేటర్లను మూసి వేయాలని నిర్ణయం తీసుకొన్నాం అని ది అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ థియేటర్స్ అసోసియేషన్ ఓ ప్రకటనలో తెలిపింది.


Click it and Unblock the Notifications











