మంచు లక్ష్మీకి ప్రాణహాని.. నైజీరియా ముఠా బెదిరింపులు?

ఇటీవల టాలీవుడ్ కి చెందిన పలువురు ప్రముఖ సినీ తారలుపై పలు కాంట్రవర్సీలు ఏ రకంగా హైలైట్ అయ్యాయో అందరికీ తెలిసిందే. చిన్న హీరోలు నుంచి పెద్ద కుటుంబపు హీరోలు వరకు కూడా మంచి రసవత్తర పరిస్థితులే కనిపించాయి. కాగా ఇలా హైలైట్ అయ్యిన చాలా మందిలో మంచు వారి కుటుంబపు గొడవలు కూడా ఒకటి. ఒకప్పుడు క్రమశిక్షణకి మారు పేరుగా కనిపించిన మంచు కుటుంబం ఇపుడు చీలిపోయింది.

మంచు విష్ణు అంతా ఒకవైపు మంచు మనోజ్ అంతా ఒక వైపు ఉన్నారు. ఇక వీరిద్దరికీ అక్క అయినటువంటి మంచు లక్ష్మి మాత్రం వీరి గొడవల నడుమ ఎప్పుడు తల దూర్చినట్టు కనిపించలేదు. ఇక వీటితో పాటుగా మంచు లక్ష్మి మాత్రం కొంచెం భిన్నంగా తన పనులు మాత్రం తాను చేసుకుంటూ వెళ్ళిపోయింది. కాగా ఇవి పక్కన పెడితే మంచు లక్ష్మి ఆఫ్ లైన్ లో పలు ప్రోగ్రాం లలో కూడా పాల్గొంటుంది.

shocker manchu lakshmi in danger her accounts got hacked

మరి రీసెంట్ గానే తన తమ్ముడు మంచు మనోజ్ తో కలిసి కనిపించిన ఎమోషనల్ విజువల్స్ కొన్ని సోషల్ మీడియాలో కూడా ఓ రేంజ్ లో వైరల్ గా మారాయి. కానీ ఇపుడు షాకింగ్ గా మంచు లక్ష్మి ఊహించని న్యూస్ షేర్ చేసుకుంది. తనని ఎవరో టార్గెట్ చేసి బెదిరిస్తున్నట్టుగా ఆమె సోషల్ మీడియాలో ఆమె ఫోన్ స్క్రీన్ షాట్ లు పెట్టి చూపిస్తుంది.

కాగా కొన్నాళ్ల నుంచి ఆన్లైన్ లో పలు దేశాలకి చెందిన కొందరు మెయిన్ గా నైజీరియన్స్ ఇండియాలో అనేకమందిని ట్రాప్ చేస్తూ వారి పర్శనల్ డేటాలు దొంగలిస్తున్న వార్తలు వినిపించాయి. ఇపుడు ఇదే మంచు లక్ష్మికి కూడా జరుగున్నట్టుగా టాక్ వినిపిస్తుంది. ఆమె తన పోస్ట్ లో ఇప్పటికీ బెదిరింపులు కొనసాగుతున్నాయి అని వీళ్ళకి నా నెంబర్ కూడా దొరికేసింది అంటూ వారు పెట్టిన మెసేజ్ ని స్క్రీన్ షాట్ పెట్టి మరీ చూపించడం జరిగింది.

ఇంతేనా తన సోషల్ మీడియా ఇన్స్టాగ్రామ్ ఖాతా కూడా హ్యాక్ అయ్యినట్టుగా చెప్పుకొచ్చింది. వీటిని కూడా ఎక్స్ లో పోస్ట్ చేసి తన పట్ల జరుగుతున్న ఆర్ధిక లావాదేవీల మోసాన్ని ఆమె చూపిస్తూ అందరినీ అలర్ట్ చేస్తుంది. కాగా వాట్సాప్ లో అయితే సదరు కేటుగాళ్లు డైరెక్ట్ గా మెసేజ్ చేసి మరీ ఆమె కాల్స్ కూడా చేశారు.

మరి ఆ నెంబర్ లో కంట్రీ కోడ్ చూస్తే అది నిజంగానే నైజీరియన్స్ నుంచి ఆమెకి వచ్చిన బెదిరింపులు అని చెప్పవచ్చు. ఇలా మొత్తానికి మంచు కుటుంబంలో ఒకొక్కరు ఇపుడు ఒకో టెన్షన్ లో ఉన్నారని చెప్పాలి. మరి మంచు లక్ష్మి విషయంలో ఇది ఎప్పటికి తేలుతుందో చూడాలి. ఇక ప్రస్తుతం మంచు విష్ణు నటిస్తున్న భారీ చిత్రం కన్నప్ప విడుదలకి సిద్ధం అవుతుండగా మంచు మనోజ్ ఓ పక్క న్యాయ పోరాటం చేస్తూనే తన భైరవం సినిమా రిలీజ్ కి సిద్ధం చేస్తున్నాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X