Game Changer: అక్కడ "గేమ్ ఛేంజర్" షోస్ క్యాన్సిల్.. కారణమిదే
గత ఏడాదిలో తెలుగు సినిమా నుంచి పలు భారీ పాన్ ఇండియా సినిమాలు వచ్చిన సంగతి తెలిసిందే. కాగా ఈ చిత్రాల్లో ఏడాది ఎండింగ్ కి బ్లాస్ట్ లా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన సెన్సేషనల్ హిట్ చిత్రం పుష్ప 2 కూడా ఒకటి. ఇక ఈ సినిమా ఇండియన్ సినిమా రికార్డులు తిరగ రాయగా ఈ సినిమా తర్వాత టాలీవుడ్ నుంచి ఈ కొత్త ఏడాదికి మొదటి పాన్ ఇండియా సినిమాగా వస్తున్న చిత్రమే "గేమ్ ఛేంజర్".
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన ఈ సినిమాని ప్రముఖ పాన్ ఇండియా దర్శకుడు శంకర్ తెరకెక్కించారు. కాగా ఈ సినిమా విషయంలో అనౌన్స్ చేసినప్పుడు ఉన్న ఆసక్తి హైప్ కానీ ఇపుడు లేవని చెప్పక తప్పదు. ఎందుకంటే అప్పటికే చరణ్ గ్లోబల్ ఫేమ్ అందుకున్నాడు ఇక శంకర్ లాంటి దర్శకునితో సినిమా అంటే చాలా అంచనాలు అప్పుడు వచ్చాయి.

కానీ ఈ సినిమా షూటింగ్ అలా వాయిదా వేస్తూ రిలీజ్ పై ఒక క్లారిటి లేకుండా ప్లానింగ్ లు చేయడం మొదటికే మోసం వచ్చే చేసింది. కాగా ఫైనల్ గా రిలీజ్ కి తీసుకొస్తున్న సమయంలో కూడా నిర్మాత దిల్ రాజు ఇంకా బయట ఆడియెన్స్ లో కూడా ఎక్కడో బెరుకు కూడా ఉంది. ఇక ఇవి చాలవు అన్నట్టుగా తెలుగులో బుకింగ్స్ పై కూడా ఒక క్లారిటీ లేదు.
ఇలా చాలా అంశాల్లో సస్పెన్స్ గానే గేమ్ ఛేంజర్ ఉంటే ఇపుడు ఊహించని రకంగా ఈ సినిమా షోస్ క్యాన్సిల్ కావడం షాకింగ్ గా మారింది. అయితే ఇది మన దగ్గర కాదు యూఎస్ మార్కెట్ లో అట. యూఎస్ లో ఎప్పుడో గేమ్ ఛేంజర్ కి బుకింగ్స్ ఓపెన్ చేశారు. కానీ ఇంకొన్ని గంటల్లో ప్రీమియర్ షోస్ పడుతున్నాయి అనే సమయంలో చాలా చోట్ల షోస్ క్యాన్సిల్ అయ్యిన వార్తలు వైరల్ గా మారాయి.

కాగా ఇందుకు కారణం జనం లేక కాదట. సినిమాకి సరైన ప్లానింగ్ లేకుండా చేయడం మూలాన అని తెలుస్తుంది. కాగా నార్త్ అమెరికాలో ఇప్పటికీ కంటెంట్ అందకపోవడంతో ఆ షోస్ అన్నీ రద్దయ్యాయట. ఇక వీటితో పాటుగా మేకర్స్ ఐమ్యాక్స్ వెర్షన్ రిలీజ్ ని కూడా ప్రకటించారు కానీ ఆ వెర్షన్ లో కూడా సరైన సదుపాయాలు కల్పించలేదని తెలుస్తుంది.
దీనితో యూఎస్ ఆడియెన్స్ కి గేమ్ ఛేంజర్ సినిమా మాత్రం ఒక ప్రాపర్ రిలీజ్ గా వెళ్లలేకపోయింది అని చెప్పి తీరాలి. ఇక ఈ షోస్ క్యాన్సిల్ కావడంతో మెగా అభిమానులు సినిమా నిర్మాణ సంస్థ ప్లానింగ్ లపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే యూఎస్ లో రిలీజ్ కి వరస్ట్ ప్లానింగ్ లు చేసారని దానికి తోడు ఇపుడు ఇలాంటి ఇబ్బందులు అంటూ వాపోతున్నారు. ఇది మాత్రం యూఎస్ లో మెగా అభిమానులకి ఊహించని దెబ్బే అని చెప్పాలి.


Click it and Unblock the Notifications











