Breakup: ప్రియుడితో తమన్నా బ్రేకప్? కారణం అదేనా?
సౌత్ సినిమా దగ్గర ఓ రేంజ్ లో స్టార్డంని చూసిన టాప్ మోస్ట్ హీరోయిన్స్ చాలా మందే కనిపిస్తారు. కాగా ఇలా తెలుగులో సహా తమిళ్ సినిమాలో కూడా మంచి ఫేమ్ ని అందుకున్న టాప్ బ్యూటీస్ లో మిల్కీ బ్యూటీ తమన్నా కూడా ఒకరు. కాగా తమన్నా హీరోయిన్ గా సౌత్ లో చాలానే చూసేసి ఫైనల్ గా తన నార్త్ కే వెళ్లి సెటిల్ అయ్యింది.
కాగా ఇక ఈ తర్వాత తమన్నా ఎప్పుడు లేనిది ప్రేమాయణం కూడా మొదలు పెట్టింది. హిందీలో ఆమె నటించిన అడల్ట్ సినిమా లస్ట్ స్టోరీస్ పార్ట్ 2లో ఊహించని బోల్డ్ రోల్ చేసి అందరికీ షాకిచ్చింది. తెలుగులో ఎన్నో సినిమాలు చేసింది కానీ హిందీ ఎంట్రీ ఇచ్చాక మాత్రం ఇంత మార్పా అని చాలా మంది మాట్లాడుకున్నారు.

ఇక ఇదిలా ఉండగా ఆ హిందీ సినిమాలో ఆమె రొమాన్స్ చేసిన నటుడు విజయ్ వెర్మతోనే ఈమె ప్రేమాయణం కూడా స్టార్ట్ చేసింది. ఆ సినిమాలో ఇంటిమేట్ సీన్స్ కూడా గట్టిగానే చేసేసింది. దీనితో అక్కడ స్టార్ట్ అయ్యిన వీరి పరిచయం కాస్తా ప్రేమగా మరి ఈ రెండు మూడేళ్లు కూడా ఇప్పుడు వరకు సాగింది. ఇంతేనా ఓపెన్ గానే ఇద్దరు కూడా కలిసే బయట చాలా సార్లు కనిపించడం జరిగింది.
ఒకరిపై ఒకరు ఆసక్తికర కామెంట్స్ చేసుకోవడమే కాకుండా ఎన్నెన్నో ఇంట్రెస్టింగ్ అంశాలు కూడా షేర్ చేసుకున్నారు. ఇక విజయ్ కూడా తమ ఇద్దరివీ ప్రైవేట్ ఫోటోలు 5 వేలుకి పైగా ఉన్నాయని కూడా చెప్పాడు. ఇలా ఇన్నాళ్ల పాటు గాఢంగా ప్రేమించుకున్న ఈ ఇద్దరూ ఖచ్చితంగా పెళ్లి కూడా చేసుకుంటారు అని టాక్ కూడా నడిచింది. దీనితో ఇద్దరు కుటుంబాలు కూడా వీరి పెళ్లి కోసం చాలా ఆసక్తిగా చూసారు.
తమన్నాకి కూడా ఏజ్ అయిపోతుంది అని తొందర కూడా పెట్టారు. కానీ ఇపుడు ఊహించని విధంగా ఈ ఇద్దరూ విడిపోతున్నట్టుగా కాదు విడిపోయారని రూమర్స్ వినిపిస్తున్నాయి. ఇది కూడా కొన్ని వారాలు కితమే విడిపోయారట. కాగా వీరి బ్రేకప్ కి కారణం ఏంటి అనేది ఇంకా బయటకి రాలేదు కానీ ఇద్దరూ మాత్రం తమ నడుమ ఒక అండర్ స్టాండింగ్ తోనే విడిపోయినట్టుగా రూమర్స్ వినిపిస్తున్నాయి.

ఇద్దరూ విడిపోయి ఇక ఎవరి లైఫ్ వారు చూసుకోవాలని డిసైడ్ అయ్యారట. ఇది ఒకింత షాకింగ్ గానే ఉంది దీనితో అభిమానులు కూడా మరింత షాక్ అవుతున్నారు. మరి వీరు ఎందుకు విడిపోయారు అనేది మాత్రం ఇపుడు ఇంకా తెలియాల్సి ఉంది.
ఇక ప్రస్తుతం తమన్నా తెలుగులో అవైటెడ్ సినిమా ఓదెల పార్ట్ 2 లో నటిస్తుండగా ఈ సినిమా నుంచి రీసెంట్ గా వచ్చిన టీజర్ మంచి రెస్పాన్స్ ని కూడా అందుకుంది. అలాగే ఈ సినిమాతో తమన్నా మళ్ళీ ఫామ్ లోకి వస్తుంది అనే టాక్ కూడా సినీ వర్గాల్లో ఉంది. ఈ చిత్రం పాన్ ఇండియా లెవెల్లో ప్లాన్ చేస్తున్నారు. ఇక తన ఎక్స్ బాయ్ ఫ్రెండ్ విజయ్ వెర్మ తెలుగులో నానితో "ఎంసిఏ" సినిమాలో విలన్ గా నటించిన సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications











