Prabhas: రెండు భాగాలుగా రాజా డీలక్స్.. ఇదిగో అసలైన క్లారిటీ
కొంత కాలంగా పాన్ ఇండియా రెబెల్ స్టార్ ప్రభాస్ వరుస పెట్టి సినిమాల మీద సినిమాలు చేస్తూ దూసుకుపోతోన్నాడు. ఇలా త్వరలోనే అతడు 'ఆదిపురుష్' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. అలాగే, ఇప్పుడు ఒకేసారి మూడు నాలుగు ప్రాజెక్టులతో ఫుల్ బిజీగా గడుపుతోన్నాడు. ఇప్పుడు ప్రభాస్ చేస్తోన్న సినిమాల్లో టాలెంటెడ్ డైరెక్టర్ మారుతి తెరకెక్కిస్తోన్న 'రాజా డీలక్స్' (టైటిల్ ఇంకా ఫైనల్ కాలేదు) ఒకటి. ఈ మూవీ హర్రర్ కామెడీ జోనర్‌లో రూపొందుతోన్న విషయం తెలిసిందే.
క్రేజీ కాంబినేషన్‌లో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ చాలా రోజుల క్రితమే సీక్రెట్‌గా స్టార్ట్ అయింది. అలా ఇప్పటి వరకూ దీనికి సంబంధించిన చాలా వరకూ టాకీ పార్టును పూర్తి చేసుకున్నారు. ఇందుకోసం హైదరాబాద్‌లోని ఓ ఫేమస్ స్టూడియోలో ఓ బంగ్లా సెట్‌ను కూడా నిర్మించారు. అలాగే, మిగిలిన పార్టును కూడా వీలైనంత త్వరగా కంప్లీట్ చేసుకునేలా ప్లాన్లు చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా ఈ చిత్రం గురించి ఓ న్యూస్ తెగ వైరల్ అవుతోంది.

యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ హీరోగా మారుతి రూపొందిస్తోన్న సినిమా రెండు భాగాలుగా విడుదల కాబోతుందని నిన్నటి నుంచి ఫిలిం నగర్ ప్రాంతంలో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా చిత్ర యూనిట్‌తో సన్నిహితంగా ఉన్న కొందరు దీనిపై క్లారిటీ ఇచ్చారు. ఈ సమాచారం ప్రకారం.. ఈ చిత్రం కేవలం ఒకే పార్టుగా వస్తుందట. అసలు దీన్ని రెండు భాగాలుగా విడుదల చేయాలన్న ఆలోచనలో అటు మారుతి కానీ, ఇటు ప్రభాస్ కానీ లేరని తెలిసింది. దీంతో ఇప్పుడు ప్రచారం అవుతోన్న వార్తలు ఫేక్ అని అర్థం అవుతోంది.
ప్రభాస్ - మారుతి కాంబినేషన్‌లో రాబోతున్న ఈ హర్రర్ కామెడీ మూవీలో నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిధిలు హీరోయిన్లుగా నటిస్తున్నట్లు ఇప్పటికే వార్తలు వచ్చాయి. అలాగే, బాలీవుడ్ స్టార్ యాక్టర్ సంజయ్ దత్ ఇందులో దెయ్యంగా నటిస్తున్నట్లు కూడా న్యూస్ లీకైంది. ఈ సినిమాను పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వ ప్రసాద్ నిర్మిస్తున్నారు. అలాగే, దీనికి థమన్ మ్యూజిక్ అందిస్తున్నట్లు ఇటీవలే ఓ వార్త కూడా వచ్చింది.


Click it and Unblock the Notifications











