Kalki 2898 AD: కల్కి పార్ట్ 2 కథ మొత్తం లీక్.. కమల్ కోసం మైండ్ బ్లాకింగ్ ట్విస్ట్!

ఒక్క మన తెలుగు సినిమా మాత్రమే కాకుండా మొత్తం ఇండియన్ సినిమా గర్వించదగ్గ సినిమా మరో సినిమాగా ఈ ఏడాది వచ్చిన సెన్సేషనల్ ప్రాజెక్ట్ "కల్కి 2898 ఎడి" కూడా ఒకటి. మరి రెబల్ స్టార్ ప్రభాస్ లేకపోతే ఒక బాహుబలి లేదు, ఆదిపురుష్ లేదు, ఇప్పుడు కల్కి కూడా లేదు అనే రీతిలో ఈ భారీ సినిమా వచ్చి కాసుల వర్షాన్ని కురిపించి తెలుగులో చరిత్ర సృష్టించింది. టోటల్ ఇండియన్ సినిమా దగ్గర 1000 కోట్లు సినిమాలు మూడు ఉన్న ఇండస్ట్రీగా టాలీవుడ్ ని బాలీవుడ్ లో సమం చేసింది.

అయితే ఈ చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కించిన దర్శకుడు నాగశ్విన్ కి చాలానే క్రెడిట్ ఇవ్వాల్సిందే. సినిమా మొత్తాన్ని తాను తెరకెక్కించిన తీరు తన విజన్ తో రానున్న పలు సంవత్సరాల్లో తెలుగు సినిమా నుంచి ఒక మైండ్ బ్లోయింగ్ సినిమాటిక్ యూనివర్స్ ని ప్రామిస్ చేస్తుంది. అయ్యితే ఇప్పుడు బయటకొచ్చిన కొన్ని షాకింగ్ లీక్స్ తో అయితే అసలు కల్కి మొదటి పార్ట్ చాలా చిన్న భాగం మాత్రమే అని అర్ధం అవుతుంది.

shocking leaks on kalki part 2 and kamal haasan role in kalki universe

ఈ సినిమాకి వర్క్ చేసిన ప్రొడక్షన్ డిజైనర్ కం ఆర్ట్ డైరెక్టర్ నితిన్ జిహాని చౌదరి చేసిన కామెంట్స్ కాక రేపుతున్నాయి. తాను ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో మొత్తం కల్కి యూనివర్స్ ని లీక్ చేసేసాడు. మెయిన్ గా ఇందులో కమల్ హాసన్ పై చేసిన కామెంట్స్ అయితే మైండ్ బ్లాకింగ్ అని చెప్పాలి. అసలు కల్కి సినిమాలో కమల్ హాసన్ సుప్రీం యాస్కిన్ లా కనిపిస్తారు. మరి ఈ సుప్రీం యాస్కిన్ పై మనకి కాశీలో చూపించింది ఒక్క కాంప్లెక్స్ మాత్రమే కానీ ప్రపంచ వ్యాప్తంగా మొత్తం 7 కాంప్లెక్స్ లు ఏడుగురు యాస్కిన్ లు ఉంటారట.

అమెరికా, ఆఫ్రీకా ఇలా ఏడు ప్రాంతాల్లో ఈ కాంప్లెక్స్ లు ఉంటాయట. అయితే ఇక్కడ ప్రపంచంలో ఏడు ఖండాలుగా చెబుతారు అలా ఏడూ ఖండాల్లో ఏడు కాంప్లెక్స్ లు ఉంటాయా అనేది ఎగ్జైటింగ్ సస్పెన్స్ గా మారితే.. కమల్ పైనే ఇంకా కొన్ని లీకులు రివీల్ చేసాడు. సినిమాలో మెయిన్ విలన్ కమల్ కాదు కమల్ కేవలం కలి(మెయిన్ విలన్) కింద మాత్రమే పని చేస్తాడు అని తెలిపాడు. ఇది మరో మైండ్ బ్లాకింగ్ ట్విస్ట్ అని చెప్పాలి.

shocking leaks on kalki part 2 and kamal haasan role in kalki universe

అంటే కమల్ కంటే పెద్ద విలన్ రానున్న సినిమాల్లో కనిపించనున్నారా అనేది ఆసక్తిగా మారింది. ఇంకా కలి పై మాట్లాడుతు కలి అనే అతనికి ఒక రూపం అంటూ ఉండదు కలి యుగంలో దేవతలు యోధులు తన కిందే ఉండాలి అన్నట్టుగా తన ప్రపంచాన్ని పైన పెట్టుకొని కింద మిగతా అంతా ఉండాలి అన్నట్టుగా ప్లాన్ చేసుకున్నారు అని తెలిపాడు. అలాగే కమల్ చేసిన యాస్కిన్ రోల్ ని సినిమాలో కృష్ణుడు పాత్ర చూసినట్టు అయితే కొన్ని పోలికలు కనిపిస్తాయని షాకిచ్చాడు.

యాస్కిన్ పాత్ర కృష్ణుడి లోని చీకటి కోణం అంటూ తెలిపాడు. అందుకే వారి వేషధారణ చూస్తే ఇద్దరూ తెల్లని గుడ్డ లాంటి దానితో కనిపిస్తారు అని తెలిపాడు. ఇలా కల్కి రాబోయే సినిమా కోసం కమల్ హాసన్ పాత్ర కోసం అతను చేసిన కామెంట్స్ పెద్ద లీకులే అని చెప్పాలి. అలాగే వీటితో అయితే అసలు నాగ్ అశ్విన్ బుర్రలో ఇంత మేటర్ ఉందా అంటూ నెటిజన్స్ ఒక్కసారిగా అవాక్కవుతున్నారు.

మరి ఇవే తరహాలో కానీ సిన్మాలు వస్తే ఖచ్చితంగా పార్ట్ 1 కంటే పెద్ద హిట్స్ గా ఆ సినిమాలు నిలుస్తాయి అని చెప్పాలి. ఇప్పటికే పార్ట్ 1 ఎండింగ్ లో కమల్ రోల్ పవర్ఫుల్ గా మారగా ఈసారి యుద్ధం ప్రభాస్ కి కమల్ కి ఊహించని రేంజ్ లో ఉంటుంది అని టాక్ ఉంది. మరి చూడాలి ఈ యూనివర్స్ ఎలాంటి ట్రీట్ ని అందిస్తుంది అనేది.

More from Filmibeat

Read more about: prabhas kalki 2898 ad
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X