సెన్సేషన్: రామ్ గోపాల్ వర్మకు కరోనా పాజిటివ్.. ఇది నా తప్పు కాదు! బయటపెట్టిన డైరెక్టర్

ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా వైరస్‌కి వీళ్ళు వాళ్ళు అనే తేడా లేదు. ఎంత పాపులారిటీ ఉన్న వ్యక్తులైనా, ఎంత క్యాష్ పార్టీ అయినా ఎవ్వరినీ వదలకుండా కాటేస్తోంది కరోనా. ఈ నేపథ్యంలోనే రామ్ గోపాల్ వర్మకు కరోనా పాజిటివ్ అనే విషయం తెలిసి అంతా షాక్ అయ్యారు. పైగా ఆ విషయాన్ని స్వయంగా వర్మనే చెప్పడం ఆశ్చర్యానికి గురిచేసింది. వివరాల్లోకి పోతే..

అందరూ ఇంటికే పరిమితం.. ఇలాంటి పరిస్థితులు!

అందరూ ఇంటికే పరిమితం.. ఇలాంటి పరిస్థితులు!

చిన్నా పెద్దా, పేద, బీద, శ్రీమంతులు అని తేడా లేకుండా అందర్నీ ఇంటికే పరమితం చేసింది కరోనా వైరస్. విద్యాసంస్థలు, పరిశ్రమలు, షూటింగ్స్ అన్నీ బంద్ అయ్యాయి. దేశమంతా లాక్ డౌన్ నడుస్తోంది. బయటకెళ్తే పోలీసులు వెంట బడుతున్నారు. ఇలాంటి పరిస్థితులు మరెన్నడూ చూడలేమేమో అనే ఫీలింగ్స్ కలుగుతున్నాయట కొందరిలో.

రామ్ గోపాల్ వర్మకు కరోనా పాజిటివ్

రామ్ గోపాల్ వర్మకు కరోనా పాజిటివ్

ఇంతలో కరోనా బాధితుల్లో సినీ ఇండస్ట్రీకి చెందినవారు కూడా ఉండటం మరింత కలవరపెడుతోంది. ఇప్పటికే సింగర్ కనికా సహా మరో సింగర్ కరోనా బారిన పడగా.. ఇద్దరు హాలీవుడ్ వ్యక్తులు కరోనా సోకి మరణించారు కూడా. ఈ నేపథ్యంలో రామ్ గోపాల్ వర్మకు కరోనా పాజిటివ్ అనే ట్వీట్ చూసి అంతా అవాక్కయ్యారు. ఏంటి? ఈ ఘోరం! అని ముక్కున వేలేసుకున్నారు.

అయ్యో! నీకు కూడా కరోనా సోకిందా?

అయ్యో! నీకు కూడా కరోనా సోకిందా?

పైగా ఈ ట్వీట్ వర్మనే స్వయంగా చేయడంతో ఒక్కసారిగా అందరూ సైలెంట్ అయిపోయారు. తన డాక్టర్ ఫోన్ చేసి.. నీకు కరోనా పాజిటివ్ వచ్చిందని తెలిపాడు అంటూ ట్వీట్ చేశాడు వర్మ. అయ్యో! నీకు కూడా కరోనా సోకిందా? అంటూ పెద్ద ఎత్తున రియాక్ట్ అయ్యారు. ఇంతలోనే మరో ట్వీట్ చేసి అసలు విషయం బయటపెట్టాడు వర్మ.

సారీ.. ఇది నా తప్పు కాదు ఆయనదే

సారీ.. ఇది నా తప్పు కాదు ఆయనదే

సారీ టు డిజప్పాయింట్.. నాకు కరోనా లేదంట, నా డాక్టర్ నన్ను ఎప్రిల్ ఫూల్ చేశాడంటూ బాంబ్ పేల్చాడు వర్మ. ఇది నా తప్పు కాదు ఆయనదే అంటూ మరో ట్వీట్ కూడా చేశాడు. పరిస్థితి ఎంత సీరియస్‌గా ఉన్నా దాన్ని కామెడీ చేయడానికి చూస్తుంటా. నా మీద నేనే జోక్ వేసుకున్నా కాబట్టి ఎలాంటి సమస్యా లేదు అని వర్మ పేర్కొన్నారు. అయినప్పటికీ ఇలాంటి సమయంలో జోకులేంటి? అంటూ వర్మపై విరుచుకుపడుతున్నారు జనం.

వణికిపోతున్న ప్రపంచం.. కేసుల సంఖ్య

వణికిపోతున్న ప్రపంచం.. కేసుల సంఖ్య

మరోవైపు కరోనా వైరస్ ధాటికి అగ్ర రాజ్యాలే అల్లల్లాడుతున్నాయి. మనదేశంలోనూ కరోనా శరవేగంగా వ్యాప్తి చెందుతోంది. దీని ప్రభావాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం ఎన్నో చర్యలు చేపడుతూనే ఉంది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా సుమారు 9 లక్షల కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడం అలజడి సృష్టిస్తోంది.

Recommended Video

RRR | Audience Blown Away By Jr NTR Voice Over
 నాలుగు ఆయుధాలు.. వర్మ మంత్రం

నాలుగు ఆయుధాలు.. వర్మ మంత్రం

ఈ పరిస్థితుల్లో వర్మ తన స్టైల్లో కరోనాను బండ బూతులు తిడుతూ సాంగ్ రిలీజ్ చేశాడు. నికృష్టమైన పురుగు, దరిద్రమైన పురుగు అంటూ దారుణంగా తిడుతూ తన గొంతుతోనే కరోనాను భయపెట్టేశాడు. చేతులు కడుక్కోండి, మాస్కులు పెట్టుకోండి, ఇంట్లోనే ఉండండి, దూరం పాటించండి అనే నాలుగు ఆయుధాలతో కరోనాను ఎదురించవచ్చని చెప్పాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X