RRR షాకింగ్ అప్‌డేట్.. రాజమౌళి సైతం బిత్తరపోయేలా గూగుల్ మెసేజ్

బాహుబలి లాంటి భారీ సినిమా తర్వాత RRR రూపంలో మరో భారీ ప్రాజెక్టు చేపట్టారు రాజమౌళి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ప్రేక్షకులందరి కళ్ళు ఈ సినిమాపైనే ఉన్నాయి. బడా హీరోలు ఎన్టీఆర్, రామ్ చరణ్ నటిస్తుండటం, రాజమౌళి రూపొందిస్తుండటం కారణంగా భారీ హైప్ క్రియేట్ అయింది. ఈ పరిస్థితుల్లో గూగుల్ తల్లి రాజమౌళి సైతం బిత్తరపోయేలా మెసేజ్ ఇస్తుండటం హాట్ టాపిక్ అయింది. ఇంతకీ ఏంటా మెసేజ్? వివరాల్లోకి పోతే..

భారీ ప్రాజెక్టు.. ఎన్టీఆర్, రామ్ చరణ్ రోల్

భారీ ప్రాజెక్టు.. ఎన్టీఆర్, రామ్ చరణ్ రోల్

దాదాపు 350 కోట్ల భారీ బడ్జెట్ కేటాయించి ప్రతిష్టాత్మకంగా ఈ సినిమా రూపొందిస్తున్నారు జక్కన్న అండ్ టీమ్. ఈ చిత్రంలో ఎన్టీఆర్ కొమురం భీం రోల్ పోషిస్తుండగా, రామ్ చరణ్ అల్లు సీతారామరాజుగా నటిస్తున్నారు. ఇప్పటికే మేజర్ పార్ట్ షూటింగ్ ఫినిష్ అయింది.

 బాలీవుడ్ తారాగణం.. భారీ అంచనాలు

బాలీవుడ్ తారాగణం.. భారీ అంచనాలు

ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టులో బాలీవుడ్ తారలు అజయ్ దేవగన్, ఆలియా భట్ భాగం అవుతున్నారు. అలాగే ఎన్టీఆర్ సరసన హాలీవుడ్ బ్యూటీ ఒలీవియా మోరిస్ నటిస్తోంది. ఇలా భారీ తారాగణం ఇన్వాల్ కావడంతో RRR సినిమాపై ఓ రేంజ్ హైప్ క్రియేట్ అయింది. ఎక్కడ చూసినా ఈ సినిమా గురించే చర్చించుకుంటున్నారు.

షాకిచ్చిన గూగుల్.. అంతా అయోమయం

షాకిచ్చిన గూగుల్.. అంతా అయోమయం

ఈ తరుణంలో గూగుల్‌లో ‘RRR' డైరెక్టర్ అని టైప్ చేస్తే రాజమౌళితో పాటు సంజయ్ పాటిల్ పేరు కూడా కనిపిస్తుండంతో అంతా షాకయ్యారు. అసలు ఎవరీయన అని ఆరా తీస్తే బిజేపీ ఎమ్మెల్యే అని చూపిస్తుంది. ఆయన్ని తీసుకొచ్చి రాజమౌళి పక్కన పెట్టింది గూగుల్ తల్లి. దీంతో ఈ ఇష్యూ వైరల్ అవుతోంది. గూగుల్ ఎందుకిలా చూపిస్తోందంటూ ఫ్యాన్స్ అయోమయానికి గురవుతున్నారు.

Recommended Video

RRR First Look : The Best Fan Made Posters | RRR Poster Review | JR NTR | Ram Charan
‘RRR' రిలీజ్ డేట్

‘RRR' రిలీజ్ డేట్

పీరియాడికల్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమా బడా నిర్మాత డీవీవీ దానయ్య నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. నిజానికి ఈ చిత్రాన్ని ఈ ఏడాది జులై నెలాఖరులో విడుదల చేస్తానని ప్రకటించిన రాజమౌళి.. ఇటీవలే దాన్ని వాయిదా వేస్తూ 2021 జనవరి 8న పది భాషల్లో విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X