twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఆర్థిక ఇబ్బందుల్లో సీనియర్ హీరోయిన్ రాశి.. ఒక్క మాటతో రూమర్స్‌కి కౌంటర్

    |

    టాలీవుడ్ ఇండస్ట్రీలో ఆల్ టైమ్ టాప్ తెలుగు హీరోయిన్స్ లిస్ట్ తీస్తే.. అందులో తప్పకుండా అందాల నటి రాశి ఉంటుందనే చెప్పాలి. స్వచ్ఛమైన నవ్వుతోనే ఎంతో మంది కుర్రాళ్లను ఆకట్టుకున్న ఈ సీనియర్ హీరోయిన్ ఇండస్ట్రీలో ఉన్నన్ని రోజులు తనకంటూ ఒక స్పెషల్ క్రేజ్ దక్కించుకుంది. తమిళ్ కన్నడ మలయాళంతో పాటు హిందీ భాషలో కూడా పలు సినిమాల్లో నటించింది. మ్యారేజ్ అనంతరం చాలా వరకు సినిమాలు చేయడం తగ్గించేసింది.

     అప్పటి వరకు బిజీ బిజీగా..

    అప్పటి వరకు బిజీ బిజీగా..

    మొదట చైల్డ్ ఆర్టిస్ట్ గా సిల్వర్ స్క్రీన్ కి పరిచయమైన రాశి ఆ తరువాత 1997 నుంచి కథానాయికగా గా సౌత్ లో బిజీ బిజీగా కొనసాగింది. ఎంట్రి ఇచ్చిన మొదట్లోనే 10 సినిమాలు చేసిన ఈ తెలుగమ్మాయి తమిళ్ లో మంచి బాక్సాఫీస్ హిట్స్ ని అందుకుంది. అయితే ఈ సీనియర్ నటి ఎక్కువ కాలం తన క్రేజ్ ని నిలబెట్టుకోలేకపోయింది. ఐదేళ్ల తరువాత మెల్లమెల్లగా డౌన్ అయ్యింది.

    నిజం సినిమా క్యారెక్టర్..

    నిజం సినిమా క్యారెక్టర్..

    2003లో తేజ దర్శకత్వంలో వచ్చిన నిజం సినిమాలో రాశి చేసిన పాత్ర అప్పట్లో ఒక సెన్సేషన్ ని క్రియేట్ చేసింది. అంతకుముందు వరకు పక్కింటి అమ్మాయిలా హోమ్లీగా కనిపించిన రాశి ఆ పాత్రలో బోల్డ్ గా కనిపించి అందరికి షాక్ ఇచ్చింది. హాట్ నెస్ డోస్ పెంచి అందరికి షాకిచ్చిన రాశి ఎందుకు ఇలాంటి పాత్రలు చేసింది అనే కామెంట్స్ వచ్చాయి.

    ఆర్థిక ఇబ్బందుల వల్లే..

    ఆర్థిక ఇబ్బందుల వల్లే..

    నిజం సినిమాలో రాశి అలాంటి పాత్ర చేయడానికి కారణం ఆర్థిక ఇబ్బందుకు వల్లే అంటూ అప్పట్లో కొన్ని రూమర్స్ వచ్చాయి. లాక్ డౌన్ ముందు వరకు కూడా అలాంటి రూమర్స్ రావడం అందరిని షాక్ కి గురి చేసింది. అయితే ఇటీవల ఆమె ఆ రూమర్స్ పై స్పందించకుండానే తన లైఫ్ గురించి వివరణ ఇచ్చింది.

    Recommended Video

    Vijay Devarakonda And Rashi Khanna Longest Kiss Ever In Tollywood || Filmibeat Telugu
    యూ ట్యూబ్ చానల్..

    యూ ట్యూబ్ చానల్..

    రాశి కూడా సొంతంగా యూ ట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసింది. లాక్ డౌన్ లో వంటలతో పాటు తను సొంతంగా చేసుకునే కస్యూమ్స్ గురించి రకరకాల వీడియోలు పోస్ట్ చేస్తోంది. తన లైఫ్ గురించి చెప్పిన రాశి తనకు ఎలాంటి ఇబ్బందులు లేవని తన ఫ్యామిలీతో ఇలా సింపుల్ గా హ్యాపీగా బ్రతికేస్తున్నా అని వివరణ ఇచ్చింది. ఇక లైఫ్ లో ప్రతి ఒక్కరికి సమస్యలు వస్తాయని నేను మాత్రం ప్రస్తుతం బాగానే ఉన్నానని ఒక్క మాటతో ఈ సీనియర్ నటి రూమర్స్ కి కౌంటర్ ఇచ్చింది.

    English summary
    Raasi, Nijam (2003) movie charecter was a sensation in that time. Earlier, Rashi, who looked like a girl next door, looked bold in the role. There were comments about why the hot-ness dose increased the appearance of the character, which was a shock to everyone.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X