పెళ్లి తరువాత నిహారిక కెరీర్ ముగిసినట్లే.. కాబోయే భర్త డిమాండ్ ఏమిటంటే?
సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా సక్సెస్ అవ్వడం అనేది చాలా కష్టమైన పని. ఎంత బ్యాక్ గ్రౌండ్ ఉన్నా కూడా వెండితెరపై ఆడియెన్స్ ని మెప్పించకపోతే కెరీర్ ముగిసినట్లే.. అయితే మెగా డాటర్ నిహారిక కెరీర్ పై కూడా గత కొంత కాలంగా అదే తరహాలో రూమర్స్ వస్తున్నాయి. ఇటీవల పెళ్లి చేసుకోవడానికి సిద్ధమైనట్లు నిహారిక ఎనౌన్స్ చేసిన విషయం తెలిసిందే.
Recommended Video

ఖాళీగా ఉండకుండా..
పెళ్లి తరువాత కూడా చాలా మంది సినిమా ఇండస్ట్రీలో నటీమణులుగా కొనసాగుతూనే ఉన్నారు. ఇక నిహారిక కూడా కొనసాగే ఛాన్స్ లేకపోలేదు. ఖాళీగా ఉండకుండా ఎదో ఒకటి చేయడం ఆమెకు ముందు నుంచి అలవాటే. వెబ్ సిరీస్, యాంకర్ అంటూ వివిధ రకాల యాంగిల్స్ లో హడావుడి చేసింది.

ఆ సినిమాలు ఫెయిల్ అవ్వడంతో..
నటనలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు దక్కించుకుంది గాని సరైన అవకాశాలు అందుకోలేకపోయింది. ఒక మనసు , హ్యాపీ వెడ్డింగ్, సూర్యకాంతం అంటూ మూడు సినిమాల్లో మెయిన్ లీడ్ లో నటించింది గాని ఆ సినిమాలు పెద్దగా క్లిక్ అవ్వలేదు. ఆ తరువాత చాలా వరకు నిహారిక సినిమాలు తగ్గిస్తూ వస్తోంది.

డిమాండ్ చేసిన చైతన్య..
ఇక ఫైనల్ గా పెళ్లి చేసుకోవడానికి సిద్దమైన నిహారిక నెక్స్ట్ సినిమాల్లో నటిస్తుందా లేదా అనేది హాట్ టాపిక్ గా మారింది. అయితే నిహారికకు కాబోయే భర్త చైతన్య VJ మాత్రం ఆమె కెరీర్ కు ఎలాంటి అడ్డు చెప్పలేదని తెలుస్తోంది. పెళ్లి తరువాత కూడా నీకు ఇష్టమైన లైఫ్ ని కొనసాగించవచ్చని ప్రేమతో ఒక డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది.

హీరో అయ్యే ఛాన్స్..
అర్థం చేసుకున్నవాడు దొరకడంతో నిహారిక చాలా సంతోషిస్తోంది. ఇక మెగా ఫ్యామిలీలో చైతన్య కూడా జాయిన్ కానున్నాడు కాబట్టి.. హీరోగా ట్రై చేసే ఛాన్స్ లేకపోలేదు. మంచి హైట్, ఫిట్నెస్ తో పాటు ఒక ఫ్రేమ్ మాస్ లుక్కులో కూడా కనిపిస్తున్నాడు. చూస్తుంటే కళ్యాణ్ దేవ్ తరహాలో చైతన్య కూడా హీరోగా ట్రై చేస్తాడనే టాక్ వస్తోంది. ఆ విషయంలో క్లారిటీ రావాలంటే వీరి పెళ్లి అయ్యేవరకు వేయిట్ చేయాల్సిందే.


Click it and Unblock the Notifications











