బాహుబలి ఫార్మాట్ లోనే పుష్ప.. రెండు భాగాలుగా సుకుమార్ ప్లానింగ్.. నిజమెంత?

టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం ప్రేక్షకులకు ఎక్కువగా ఎదురుచూస్తున్న సినిమాల్లో పుష్ప ఒకటి. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ పాన్ ఇండియా సినిమాలో అల్లు అర్జున్ నెవర్ బిఫోర్ అనే పాత్రలో కనిపిస్తున్న విషయం తెలిసిందే. అయితే సినిమాకు సంబంధించిన ఒక రూమర్ వైరల్ గా మారింది. రెండు భాగాలుగా తెరకెక్కించే ఛాన్స్ ఉన్నట్లు టాక్ వస్తోంది.

Recommended Video

Pushpa అంత పెద్ద రిస్క్ చేస్తుందా ? | Allu Arjun | Pushpa Raj || Filmibeat Telugu

సాక్షి అగర్వాల్.. అమ్మాయి నడుమంటే ఇలా ఉండాలి

టీజర్ తో న్యూ రికార్డ్

టీజర్ తో న్యూ రికార్డ్

క్రియేటివ్ గా ఆలోచించే టాలెంటెడ్ డైరెక్టర్ సుకుమార్ మొదటిసారి కంప్లీట్ మాస్ యాక్షన్ సినిమాపై ఫోకస్ పెట్టాడు. అలాగే తన మార్క్ స్క్రీన్ ప్లే కూడా మిస్సవ్వకుండా మ్యాజిక్ క్రియేట్ చేయబోతున్నాడు. ఇప్పటికే టీజర్ 60మిలియన్లకు పైగా వ్యూవ్స్ అందుకొని నెంబర్ వన్ స్థానంలో చోటు దక్కించుకుంది.

బాహుబలి తరహాలోనే.. రెండు భాగాలుగా

బాహుబలి తరహాలోనే.. రెండు భాగాలుగా

ఇక అసలు మ్యాటర్ లోకి వస్తే పుష్ప సినిమాను కూడా రెండు భాగాలుగా తెరకెక్కించే ఛాన్స్ ఉందని రూమర్స్ వస్తున్నాయి. బాహుబలి తరహాలోనే ప్లాన్ చేస్తున్నట్లు ఉదయం నుంచి కొన్ని కథనాలు అభిమానులను కన్ఫ్యూజన్ కు గురి చేస్తున్నాయి. ఇది నమ్మలా వద్దా? అనే కామెంట్స్ ఎన్నో వస్తున్నాయి.

అఫీషియల్ గా ఎవరు చెప్పలేదు

అఫీషియల్ గా ఎవరు చెప్పలేదు

ఇంత వరకు చిత్ర యూనిట్ రెండు భాగాలుగా ప్లాన్ చేస్తున్నట్లు అఫీషియల్ గా ఎనౌన్స్మెంట్ అయితే రాలేదు. ఎవరు కూడా ఎక్కడా వివరణ ఇవ్వలేదు. ఇక కొన్ని వెబ్ సైట్లలో అలాగే సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ అవుతుండడంతో నిజంగానే బాహుబలి రికార్డులను బద్దలు కొట్టడానికి పుష్ప రెండు భాగాలుగా రాబోతోందని ఓ వర్గం అభిమానులు ఆనంద పడుతున్నారు.

 అది నిజం కాదు..

అది నిజం కాదు..

అయితే అందులో ఇప్పటివరకు ఎలాంటి నిజం లేదని తెలుస్తోంది. దర్శకుడు సుకుమార్ అంత పెద్దగా కథను రాసుకోలేదట. ఇప్పుడు సడన్ గా రెండు భాగాలు అంటే మళ్ళీ స్క్రిప్ట్ పై కొన్ని నెలలు కూర్చోవాలి. బహుశా లాక్ డౌన్ వలన సుక్కు కొత్తగా ఏమైనా ఆలోచించాడేమో అనే రూమర్స్ కూడా వస్తున్నాయి. ఈ కన్ఫ్యూజన్ క్లియర్ అవ్వాలి అంటే చిత్ర యూనిట్ క్లారిటీ ఇచ్చే వరకు వేయిట్ చేయాల్సిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X