రాజమౌళి వదిలితే చాలు, రామ్ చరణ్ 'తగ్గేదే లే'.. అంతకుమించి అనేలా ఆ సినిమాకు సీక్వెల్..

దర్శకధీరుడు రాజమౌళి ఒక సినిమాను సెట్స్ పైకి తెచ్చాడు అంటే అది ఎంత చిన్న సినిమా అయినా కూడా తెలియకుండానే ఏడాది కంటే ఎక్కువ సమయమే పడుతుంది. ఇక స్టార్ హీరోలతో ఎంత పక్కాగా ప్లాన్ చేసుకున్నా కూడా జక్కన్న డెడికేషన్ వలన ఏళ్ళు గడుస్తాయని స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఇక RRR నుంచి హీరోలను బయటకు వదిలితే చాలు పక్కా ప్లాన్ తో ఒకే ఏడాదిలో రెండు సినిమాలను ఫినిష్ చేసేందుకు సిద్ధంగా ఉన్నారు.

స్టార్ యాక్టర్స్ ఎవరైనా సరే..

స్టార్ యాక్టర్స్ ఎవరైనా సరే..

రాజమౌళి తెరకెక్కిస్తున్న RRR సినిమా బిగెస్ట్ పాన్ ఇండియా సినిమాగా రూపొందుతున్న విషయం తెలిసిందే. స్టార్ యాక్టర్స్ ఎవరైనా సరే జక్కన్నతో సినిమా అంటే వీలైనంత వరకు కాస్త ఎక్కువ డేట్స్ ను అందుబాటులో ఉంచుకుంటారు. హీరోలైతే మరొక పని కూడా పెట్టుకోరు. ఆయన ఎన్ని రీ టేక్స్ చెప్పినా కూడా నిరుత్సాహ పడకుండా చేస్తారు.

రెండు సినిమాలను ఒకేసారి

రెండు సినిమాలను ఒకేసారి

రాజమౌళి ప్రతిభ గురించి అందరికి తెలిసిందే కాబట్టి హీరోల నుంచి పెద్దగా అభ్యంతరాలు ఏమి ఉండవు. ఇక ఆయన RRR షూటింగ్ పూర్తవ్వాలని మెగా నందమూరి అభిమానులు చాలా బలంగా కోరుకుంటున్నారు. ఆయన వదిలితే తారక్ , చరణ్ తదుపరి రెండు సినిమాలను ఒకేసారి సెట్స్ పైకి తేవాలని చూస్తున్నారు.

రామ్ చరణ్.. ఇంట్రెస్టింగ్ గాసిప్

రామ్ చరణ్.. ఇంట్రెస్టింగ్ గాసిప్

ఈ ఇద్దరు హీరోలు నెక్స్ట్ ఎవరెవరితో వర్క్ చేయబోతున్నారో అభిమానులకు ఇప్పటికే ఒక క్లారిటీ వచ్చేసింది. అయితే రామ్ చరణ్ అభిమానులకు తెలియని ఒక ఇంట్రెస్టింగ్ గాసిప్ ప్రస్తుతం ఫిల్మ్ నగర్ లో వైరల్ గా మారుతోంది. చరణ్ కెరీర్ బెస్ట్ మూవీకి సీక్వెల్ తెరకెక్కబోతున్నట్లు తెలుస్తోంది.

2023లో సీక్వెల్..?

2023లో సీక్వెల్..?

సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన రంగస్థలం సినిమా చరణ్ కెరీర్ బెస్ట్ మూవీగా నికిచిన విషయం తెలిసిందే. అదే ఫార్మాట్ లో సుకుమార్ మరో కొత్త కథను రాసుకునే ఆలోచనలో ఉన్నారట. రంగస్థలం సీక్వెల్ అనే టాక్ కూడా వస్తోంది గాని ఇంకా ఆ విషయంలో ఎలాంటి సమాచారం అందలేదు. ఇక పుష్ప అనంతరం సుక్కు విజయ్ దేవరకొండ ప్రాజెక్టును లైన్ లో పెట్టనున్నాడు. ఇక రామ్ చరణ్ తో 2023లో కొత్త సినిమాను స్టార్ట్ చేయవచ్చని సమాచారం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X