నిహారిక పెళ్లిలో వరుణ్ తేజ్ కాబోయే భార్య.. ఇది మరీ టూ మచ్!
2020లో టాలీవుడ్ లో పెళ్లిళ్లు చాలానే జరిగాయి. ఇక చివరగా ఈ ఏడాది కాస్త గ్రాండ్ గా పెళ్లి చేసుకున్న సెలబ్రెటీ మాత్రం నిహారిక అనే చెప్పాలి. మెగా ఫ్యామిలి మొత్తం ఒక చోట చేరి అంగరంగ వైభవంగా నిహారిక, చైతన్య పెళ్లిని నిర్వహించారు. ఉదయ్ పూర్ లో జరిగిన ఈ వివాహ వేడుకకు టాలీవుడ్ కి సంబంధించిన సెలబ్రెటీలు పెద్దగా ఎవరు రాలేదు. కొంతమంది హీరోయిన్స్ వచ్చినట్లు టాక్ మాత్రం వస్తోంది. అందులో ఇద్దరు ఫొటోలు కూడా షేర్ చేశారు. అయితే పెళ్లి వేడుకకు వరుణ్ తేజ్ కాబోయే భార్య కూడా వచ్చినట్లు కొన్ని రూమర్స్ వైరల్ అవుతున్నాయి.

వరుణ్ తేజ్ ప్రేమలో ఉన్నాడా?
నిహారిక మ్యారేజ్ జరిగి ఒకరోజు అయ్యిందో లేదో అప్పుడే ఆమె అన్న పెళ్లికి సంబంధించిన గాసిప్స్ ఒక రేంజ్ లో వైరల్ అవుతున్నాయి. వరుణ్ రేజ్ వయసు ప్రస్తుతం 30ఏళ్లు. గతంలోనే పెళ్లిపై కొన్ని రూమర్స్ వచ్చినప్పటికీ వరుణ్ తేజ్ కొట్టి పారేశాడు. ఒక హీరోయిన్ తో ప్రేమలో ఉన్నట్లు కూడా కథనాలు వెలువడ్డాయి. ఇక కాబోయే భార్యను వరుణ్ చెల్లి పెళ్లికి పిలిచినట్లుగా టాక్ వస్తోంది.

మెగా ఫ్యామిలీలో ఆ ఇద్దరి పెళ్లి తరువాతే..
నాగబాబు ఒక ఇంటర్వ్యూలో అయితే వరుణ్ తేజ్ కు కూడా వీలైనంత త్వరగా పెళ్లి చేయడానికి రెడీగా ఉన్నట్లు ఒక క్లారిటీ అయితే ఇచ్చాడు. అయితే మెగా ఫ్యామిలీలో వరుణ్ కంటే పెద్దవాళ్ళు ఇద్దరు ఉన్నారు. అల్లు శిరీష్, మెగా హీరో సాయి ధరమ్ తేజ్ ఇద్దరికి కూడా మూడు పదుల వయసు దాటి మూడేళ్లవుతోంది. ఇక శిరీష్ సంగతి పక్కన పెడితే సాయి ధరమ్ తేజ్ పెళ్లి తరువాత వరుణ్ చేసుకుంటాడని తెలుస్తోంది.

నిహారిక పెళ్లిలో వరుణ్ కాబోయే భార్య
ఇక నిహారిక పెళ్లికి వరుణ్ తేజ్ కాబోయే భార్య వచ్చినట్లు కొన్ని వెబ్ మీడియాల కథనాలు వెలువడుతున్నాయి. ఆమె మరెవరో కాదు లావణ్య త్రిపాఠి అంటూ డైరెక్ట్ గా ప్రచారాలు చేస్తున్నారు. మిస్టర్, అంతరిక్షం సినిమాల్లో ఈ ఇద్దరు కలిసి నటించిన విషయన్ తెలిసిందే. అయితే అప్పుడే బాగా దగ్గరైన వీరు ప్రేమలో మునిగి తెలుతున్నట్లు కూడా సోషల్ మీడియాలో టాక్ వస్తోంది. కానీ అందులో నిజం లేదు.
Recommended Video

లావణ్య త్రిపాఠి ఎందుకు వచ్చిందంటే..
లావణ్య త్రిపాఠితో పాటు పెళ్లి చూపులు ఫేమ్ రీతూ వర్మ కూడా పెళ్లికి వచ్చింది. వీరిద్దరు ఉదయ్ పూర్ రావడానికి ముఖ్య కారణం నిహారిక. ఎందుకంటే ఈ ముగ్గురు జిమ్ మెంట్స్. గత కొంతకాలంగా నిహారిక వారుద్దరికి చాలా క్లోజ్ అయ్యింది. కొన్నిసార్లు ముగ్గురు కలిసి టూర్లకు కూడా వెళ్లారు. నిహారిక క్లోజ్ కావడం వలన లావణ్య పెళ్లికి వచ్చింది. అంతే గాని వరుణ్ తేజ్ కారణంగా కాదని తెలుస్తోంది. మరి ఈ రూమర్స్ పై లావణ్య ఏమైనా క్లారిటీ ఇస్తుందో లేదో చూడాలి.


Click it and Unblock the Notifications











