రాజు గారి గదిలో రెండు గంటలే.. కానీ ఆ కొద్ది సమయంలోనే!
డిఫెరెంట్ జానర్‌లో 'రాజు గారి గది' సిరీస్ ద్వారా హారర్ చిత్రాలను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్న ఓంకార్.. అక్టోబర్ 18వ తేదీన ఈ సిరీస్ నుంచి రాజు గారి గది 3 సినిమానూ విడుదల చేస్తున్నాడు. ఇటీవలే విడుదలైన ఈ సినిమా టీజర్, ట్రైలర్ విశేష ఆదరణ తెచ్చుకోవడంతో సినిమాపై హైప్ క్రియేట్ అయింది. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ వేగంగా జరుగుతున్నాయి. కాగా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా యు/ఏ సర్టిఫికేట్ పొందింది.
అయితే ఈ సినిమా నిడివి కేవలం రెండు గంటలు మాత్రమే ఉండటం విశేషం. హారర్ కామెడీ థ్రిల్లర్ సినిమాగా ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమా కేవలం ఈ రెండు గంటల్లోనే పూర్తి ఎంటర్‌టైన్ చేస్తుందట. చిత్రంలో అవికా గోర్, శ్శివిం బాబు, ఓంకార్ కీలక పాత్రలు పోషించారు. ఓంకార్ సొంత ప్రొడక్షన్స్ ఓక్ ఎంటర్టైన్మెంట్స్ నిర్మించిన ఈ చిత్రానికి చోటా కె నాయుడు , గౌతమ్ రాజు , సాయి మాధవ్ బుర్ర వంటి టాప్ టెక్నీషియన్స్ పనిచేశారు.

ఇక ఓవర్సీస్ లో ఈ చిత్రాన్ని ఫార్స్ ఫిలిమ్స్ విడుదల చేస్తుండండం విశేషం. ఇంతకుముందు ఈ సంస్థ సాహో, సైరా లాంటి పెద్ద సినిమాలను అక్కడ రిలీజ్ చేసింది కాబట్టి రాజు గారి గది 3 పై ఓవర్సీస్ జనాల్లో ఆసక్తి నెలకొంది. రాజుగారి గది సిరీస్ నుంచి వచ్చిన గత సినిమా 'రాజుగారి గది 2' మంచి రెస్పాన్స్ తెచ్చుకున్నప్పటికీ, ఆశించిన ఫలితం రాబట్టలేక పోయింది. దీంతో ఆ లోటు పూడ్చేలా 'రాజు గారి గది 3' సినిమా రూపొందించారు ఓంకార్.


Click it and Unblock the Notifications











