twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    RRR బెన్ఫిట్ షోలపై అభిమానుల ఆశలు.. నిర్మాతల చర్చలు.. మరో షాక్ ఇచ్చిన ఏపీ!

    |

    సాధారణంగా ఏ సినిమా ఇండస్ట్రీలో అయినా సరే పెద్ద సినిమాలు విడుదల అవుతున్నాయి అంటే అభిమానుల్లో ఒక భీభత్సమైన ఉత్సాహం నెలకొంటుంది. అగ్ర హీరోల ఫ్యాన్స్ అయితే బెనిఫిట్ షో ల కోసం థియేటర్ల ముందు ఎగబడుతూ కనిపిస్తారు. తప్పకుండా ఫస్ట్ డే ఫస్ట్ షో చూడాలి అనడకంటే కూడా అంతకంటే ముందుగానే సినిమాలు చూడాలని కోరుకునే అభిమానుల సంఖ్య రోజురోజుకు ఎక్కువవుతోంది. అయితే RRR విషయంలో దాదాపు సినీ ప్రేమికుల అందరిలో కూడా అదే ఆలోచన ఉంది. ఇక సినిమాకు సంబంధించిన బెనిఫిట్ షో లపై నిర్మాతలు కూడా చర్చలు జరుపుతున్నారు. కానీ ఈ సమయంలోనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరొక షాక్ ఇచ్చింది.

    రాజమౌళి ఫ్యాన్స్ కూడా

    రాజమౌళి ఫ్యాన్స్ కూడా

    రామ్ చరణ్ జూనియర్ ఎన్టీఆర్ మొదటి సారి కలిసి నటిస్తున్న బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీ RRR కోసం ప్రేక్షకులు ఏ స్థాయిలో ఎదురుచూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కేవలం మెగా నందమూరి అభిమానులు మాత్రమే కాకుండా బాహుబలి తర్వాత రాజమౌళి నుంచి వస్తుంది సినిమా కాబట్టి ఆయన అభిమానులు కూడా ఈ సినిమా కోసం ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. తప్పకుండా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను క్రియేట్ చేస్తుందని తెలుస్తోంది.

    బెనిఫిట్ షోల సంగతేంటి?

    బెనిఫిట్ షోల సంగతేంటి?

    RRR సినిమాకు సంబంధించిన ప్రతి అంశం కూడా సోషల్ మీడియాలో భారీ స్థాయిలో వైరల్ అవుతొంది. అయితే ఇటీవల ప్రెస్ మీట్ నిర్వహించిన ఈ చిత్ర యూనిట్ సభ్యులు అనేక విషయాలపై మీడియాకు క్లారిటీ ఇచ్చారు. అయితే ప్రస్తుతం బెనిఫిట్ షోలు కూడా ఉంటాయా లేదా అనే విషయంలో అనేక రకాల సందేహాలు నెలకొన్న సమయంలో ఆ చిత్ర యూనిట్ సభ్యులు కూడా ఆ విషయంపై ఆలోచిస్తామని చెప్పారు.

    చర్చలు జరపాలని..

    చర్చలు జరపాలని..

    ఇక నిర్మాత డి.వి.వి.దానయ్య కూడా ఆంధ్రప్రదేశ్ లో సినిమా టిక్కెట్ల ధరల పై మరొకసారి చర్చలు జరిపే అవకాశం ఉన్నట్లు క్లారిటీ ఇచ్చాడు. ప్రస్తుతం ఉన్న రేట్లతో థియేటర్స్ ను కొనసాగించాలి అంటే ఏమాత్రం న్యాయం కాదు అని నిర్మాతలు డిస్ట్రిబ్యూటర్లు చాలావరకు నష్టపోయే అవకాశం ఉన్నట్లు విచారం వ్యక్తం చేశారు. ప్రభుత్వంతో మరొకసారి చర్చలు జరిపే అవకాశం ఉన్నట్లు కూడా వివరణ ఇవ్వడంతో తప్పకుండా ఆ విషయంలో క్లారిటీ వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

    షాక్ ఇచ్చిన మంత్రి

    షాక్ ఇచ్చిన మంత్రి

    అయితే రీసెంట్ గా ఆంధ్ర ప్రదేశ్ మంత్రి పేర్ని నాని మరోసారి ఆ విషయంలో షాక్ ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో ఇప్పట్లో అయితే బెనిఫిట్ షో లకు అవకాశం లేదు అని పేర్ని నాని వివరణ ఇచ్చారు. అంటే పుష్ప సినిమాకు మాత్రమే కాకుండా RRR సినిమాకు కూడా ఫ్యాన్స్ షోలు ఉండే అవకాశం లేదు. అంతే కాకుండా టికెట్ల ధరలు కూడా అదే తరహాలో కొనసాగే అవకాశం ఉందట. ఇక అలా జరిగితే సినిమాలు అనుకున్నంత స్థాయిలో కలెక్షన్స్ కూడా రాకపోవచ్చని తెలుస్తోంది.

    Recommended Video

    RGV Goes Gaga Over Pushpa | Allu Arjun Believed In Guts || Filmibeat Telugu
    రిస్క్ చేయకుండా ఉండాలని..

    రిస్క్ చేయకుండా ఉండాలని..

    ఇప్పటికే అఖండ సినిమాకు భారీ స్థాయిలో వసూలు తక్కువగా వచ్చాయి. ఒకవేళ ఆంధ్రప్రదేశ్ లో టిక్కెట్ల ధరలు అనుకున్నట్లుగా ఉంటే ఆ సినిమా మరో 15 కోట్లకు పైగా లాభాలను అందుకునే అవకాశం ఉండేది. కానీ ప్రస్తుత పరిస్థితులలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రం రిస్క్ తీసుకోవడానికి ఏమాత్రం ఇష్టపడడం లేదు. కానీ తెలంగాణలో మాత్రం ఎప్పటిలానే పెద్ద సినిమాలకు అనుకూలంగా టికెట్ల ధరలను అందుబాటులో ఉంచుతున్నారు.

    English summary
    Shocking twist in upcoming big projects benefit shows and rrr movie.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X