లాస్ట్ మినిట్స్ లో "పుష్ప 2" బిగ్ ట్విస్ట్.. ఆ ఇద్దరినీ తీస్కొని డీఎస్పీని అవమానించారా..

చాలా కాలం తర్వాత ఒక పాన్ ఇండియా సినిమా అందులోని ఓ సీక్వెల్ సినిమా కోసం ఆడియెన్స్ ఎంతగానో చూస్తున్న సినిమా ఏదన్నా ఉంది అంటే అది ఖచ్చితంగా సెన్సేషనల్ హిట్ చిత్రం "పుష్ప 2 ది రూల్" అనే చెప్పాలి. నిజానికి ఒక బాహుబలి, కేజీయఫ్ రేంజ్ ల తరహాలో ఒక ఎగ్జైటింగ్ క్లైమాక్స్ లేనప్పటికీ పుష్ప 2 పై మాత్రం ఎనలేని హైప్ సెట్ అయ్యింది.

మరి దీనికి కారణం కూడా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ స్వాగ్ తన క్రేజ్ మూలాన అని చెప్పడంలో డౌట్ లేదు. కాగా ఈ చిత్రం ఇది వరకే రిలీజ్ కావాల్సి ఉంది కానీ పలు కారణాలు చేత అలా వాయిదా పడుతూ వస్తుంది. పైగా మొదటి భాగం ఎప్పుడో 2021 ఏడాది చివరలో వస్తే మళ్ళీ ఇపుడు పార్ట్ 2 రావడానికి ఇపుడు 2024 ఏడాది చివర వరకు ఆగాల్సి వచ్చింది.

shocking twists for pushpa 2 in release before with devi sri prasad

కాగా ఇలా వాయిదా పడినా కూడా పుష్ప మేనియా ఎక్కువగానే కనిపిస్తుంది. దీనితో ఈ బిగ్ ప్రాజెక్ట్ దగ్గరకి వస్తున్న సమయంలో ఊహించని ట్విస్ట్ లు ఇపుడు ఎక్కువ అయ్యాయి అని చెప్పాలి. మామూలుగానే మన తెలుగు సినిమా దగ్గర కొన్ని సెన్సేషనల్ మ్యూజిక్ కాంబినేషన్ లలో దేవిశ్రీ ప్రసాద్, సుకుమార్ అల్లు అర్జున్ త్రయంకి ఒక సెపరేట్ లీగ్ ఉంది.

వీరి నుంచి వచ్చిన అన్ని సినిమాల పాటలు కూడా దశాబ్దాలు పాటుగా చార్ట్ బస్టర్స్ గా కొనసాగ్గుతున్నాయి. అలాంటి దేవిశ్రీ ప్రసాద్ కి పుష్ప 2 విషయంలో అన్యాయం అవమానం రెండూ జరిగుతున్నాయా అనిపిస్తుంది. కాగా పుష్ప పార్ట్ 1 కి చార్ట్ బస్టర్ సాంగ్స్ తో పాటుగా మైండ్ బ్లాకింగ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా హైలైట్ అయ్యింది. అలాగే పుష్ప 2 కూడా వచ్చిన రెండు టీజర్ లలో మంచి సంగీతాన్ని దేవీ తన మార్క్ అప్ గ్రేడ్ తో దంచికొట్టాడు.

కానీ ఇలాంటిది ఇంకా సినిమా విడుదలకి ఒక్క నెల కూడా లేని సమయంలో ఊహించని రూమర్స్ వైరల్ అవుతున్నాయి. పుష్ప పార్ట్ 2 కి కేవలం పాటల వరకే దేవీ అని మిగతా బ్యాక్గ్రౌండ్ స్కోర్ అంతా ఇంకో ఇద్దరు సంగీత దర్శకులు చేస్తున్నారు అంటూ షాకింగ్ ట్విస్ట్ ఫ్యాన్స్ ను ఇబ్బంది పెడుతుంది.

shocking twists for pushpa 2 in release before with devi sri prasad

కాగా ఈ సినిమాకి ఫస్టాఫ్ కోసం థమన్ ని సెకండాఫ్ కోసం కాంతార, మంగళవారం లాంటి సినిమాలకి వర్క్ చేసిన సంగీత దర్శకుడు అజనీష్ లోకనాథ్ అందించనున్నట్టుగా ఇపుడు పుకార్లు ఊపందుకున్నాయి. అయితే ఇది వేరే ఏ సినిమాకి అయినా బెస్ట్ ఛాయిస్ అనుకోవచ్చు కానీ ఆల్రెడీ ఒక స్టార్ అయినటువంటి దేవిశ్రీ ప్రసాద్ ని కాదని ఇలా చేయడం మాత్రం తనకి తన ఫ్యాన్స్ కి కూడా ఒక రకంగా అవమానమే అనుకోక తప్పదు. మరి ఇంతలా వైరల్ అవుతున్న ఈ వార్తలపై ఒక సరైన క్లారిటీ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X