షాకింగ్: గాయపడిన విక్టరీ వెంకటేష్.. వెంటనే ఆసుపత్రికి తరలింపు
సీనియర్ నటుడు విక్టరీ వెంకటేష్ షూటింగ్‌లో భాగంగా గాయపడినట్లు సమాచారం అందింది. దీంతో వెంటనే అప్రమత్తమైన షూటింగ్ విభాగం ఆయన్ను దగ్గరలోని ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స చేయించారట. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట చర్చనీయాంశంగా మారింది. ఇంతకీ వెంకటేష్‌కి తగిలిన గాయం ఏంటి? అది పెద్దదా లేక చిన్నదేనా? వివరాల్లోకి పోతే..

వెంకీమామ షూటింగ్
రియల్ లైఫ్ మామా అల్లుళ్లు విక్టరీ వెంకటేష్, యువ సామ్రాట్ నాగ చైతన్య కలిసి 'వెంకీ మామ' సినిమాలో నటిస్తున్నారు. బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. చిత్రంలో వెంకటేష్ సరసన పాయల్ రాజ్‌పుత్ హీరోయిన్‌గా నటిస్తుండగా, నాగ చైతన్య సరసన రాశి ఖన్నా హీరోయిన్‌గా నటిస్తోంది. సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ సినిమాకు దగ్గుబాటి సురేష్ బాబు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నారు.

పాట చిత్రీకరిస్తుండగా గాయపడిన వెంకటేష్
ప్రస్తుతం వెంకీమామ షూటింగ్ రామోజీ ఫిలిం సిటీలో జరుగుతోంది. చిత్రీకరణలో భాగంగా ఓ పాట షూట్ చేస్తుండగా వెంకటేష్ స్వల్పంగా గాయపడ్డారు. డ్యాన్స్ చేస్తుండగా వెంకీ కాలు బెణికింది. దీంతో వెంటనే ఆయన్ను ఆసుపత్రికి తరలించారు షూటింగ్ సిబ్బంది. పెద్ద ప్రమాదం కాకపోయినప్పటికీ అందరూ కాస్త ఆందోళన చెందారని సమాచారం.

రెస్ట్ తీసుకోక తప్పదు.. షూటింగ్ వాయిదా
వెంకటేష్ కాలిగాయాన్ని పరిశీలించిన డాక్టర్లు కొన్ని రోజులు విశ్రాంతి తీసుకోమని చెప్పారట. కాలి మడిమకు తగిలిన దెబ్బ కావడంతో పరుగెత్తడం, ఫైటింగ్ చేయడం లాంటివి ఇప్పుడే చేయకూడదని డాక్టర్లు చెప్పినట్లు తెలిసింది. దీంతో 'వెంకీ మామ' షూటింగ్‌ని కొద్దిరోజులు నిలిపివేయాలని చిత్రయూనిట్ భావిస్తోందని సమాచారం. పాయల్ రాజ్ పుత్, వెంకటేష్ సాంగ్ షూట్‌లో ఈ ప్రమాదం జరిగింది.

అనుకున్న సమయానికి విడుదలయ్యేనా..?
ఇటీవలే వెంకీమామ మేకింగ్ వీడియో విడుదలైంది. ఈ వీడియోలో వెంకీ,నాగ్ చైతన్య స్టైలిష్ లుక్స్ చూస్తుంటే.. వెండితెరపై వీరిద్దరి హంగామా మామూలుగా ఉండదని తెలుస్తోంది. ఈ మల్టీస్టారర్ సినిమా పట్ల ప్రేక్షకుల్లో ఇప్పటికే మంచి క్రేజ్ నెలకొంది. అయితే వెంకీకి తగిలిన గాయం కారణంగా ఈ సినిమా అనుకున్న సమయానికి విడుదల కాకపోవచ్చని తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











