అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి .. షాకింగ్ విజువల్స్.. చేసింది ఎవరంటే?
గత కొన్ని రోజులు నుంచి కూడా ఊహించని విధమైన నెగిటివిటీని టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ ఎదుర్కొంటున్న సంగతి అందరికీ తెలిసిందే. బన్నీ హీరోగా నటించిన భారీ సినిమా పుష్ప 2 రిలీజ్ ఏమో కానీ ఆ సినిమా మాత్రం తనని ఊహించని నెగిటివిటీ లోకి నెట్టేసింది. కాగా అల్లు అర్జున్ నుంచి ఎంతో కాలం తర్వాత ఈ సినిమా రిలీజ్ కి రాగా ఈ సినిమా ఒకరోజు ముందే ప్రీమియర్స్ ని సెట్ చేసుకుంది.
మరి తెలంగాణ సంధ్య థియేటర్ దగ్గర విషాద ఘటనపై తనని ఒక్కసారిగా హీరో నుంచి విలన్‌గా మార్చేసేలా అయ్యింది. అయితే ఈ సెన్సిటివ్ అంశంలో చాలా కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఒక పక్క అల్లు అర్జున్ వైపు తప్పులు ఉన్నాయని టాక్ వినిపిస్తోంది. అలాగే ఇంకో పక్క తన సైడ్ కొంచెం పాజిటివ్ కూడా ఉంది . కానీ కొన్ని కారణాలు, అల్లు అర్జున్ కామెంట్స్ మూలాన ఇది ఉండగా ఉండగా తీవ్ర రూపం దాలుస్తుంది.

కాగా ఇది పక్కన పెడితే లేటెస్ట్‌గా సీఎం రేవంత్ రెడ్డి కూడా రంగంలో దిగి అల్లు అర్జున్ పై డైరెక్ట్ కామెంట్స్ చేయడం దానికి కౌంటర్‌గా బన్నీ ప్రెస్ మీట్ పెట్టడంతో పరిస్థితులు మరింత హీట్ గా మారాయి. అలాగే అల్లు అర్జున్ కూడా సోషల్ మీడియాలో జరుగుతున్న వాగ్వాదాల్లో తన అభిమానులకి సైతం స్మూత్ వార్నింగ్ ఇచ్చి దీనితో పాటుగా తన అభిమానుల ముసుగులో ఉన్న ఫేక్ ఐడి యూజర్స్ పై కూడా చర్యలు తీసుకుంటానని తెలిపారు.
ఈ హాట్ వాతావరణంలో అల్లు అర్జున్ ఇంటి మీద రాళ్ల దాడులు జరిగిన షాకింగ్ ఘటనలు ఊహించని విధంగా మారాయి. జూబ్లీహిల్స్‌లోని ఇంటి దగ్గరకి వచ్చిన కొందరు తన ఫెన్సింగ్ దాటి మరీ లోపలకి వెళ్లే ప్రయత్నం చేశారు. అలాగే అల్లు అర్జున్ ఇంటి ముందు ఉన్న మొక్కల కుండీలు బద్దలుకొట్టి నానా యాగీ చేశారు. సంధ్య థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాటలో రేవతి మరణానికి కారణం అల్లు అర్జునే అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
అయితే రాళ్ల దాడికి పాల్పడిన వారు ఉస్మానియా యూనివర్సిటీకి చెందిన జాయింట్ యాక్షన్ కమిటీకి చెందిన వారిగా వార్తలు వస్తున్నాయి. అల్లు అర్జున్ ఇంటిపై దాడి ఘటన సినీ వర్గాల్లో చర్చనీయాంశమైంది. కొందరు సినీ ప్రముఖులు కూడా ఇలాంటి చర్యలని ఖండిస్తున్నామని తెలుపుతున్నారు. ఈ పరిణామాలతో వివాదం మరింత పెరిగేలా కనిపిస్తుంది అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరి చూడాలి అల్లు అర్జున్ విషయంలో ఈ రచ్చ ఎక్కడ ఆగుతుంది అనేది.


Click it and Unblock the Notifications











