లక్ష్యం కుదిరింది... ఫస్ట్ లుక్ లో సిక్స్ ప్యాక్స్ అదిరింది...
లవర్ బాయ్ ఇమేజ్ నుంచి బయటకు రావాలన్నదే ఏకైక లక్ష్యంగా ఒక్కో సినిమానూ ఎంపిక చేసుకుంటోన్న నాగశౌర్య, చూడబోతే ఈసారి టార్గెట్ ను కరెక్ట్ గానే రీచ్ అయ్యేలా కనిపిస్తున్నాడు. శౌర్య నటిస్తున్న 20వ సినిమా ఫస్ట్ లుక్ ఈరోజే రిలీజ్ అయింది. ఇక రిలీజ్ అవ్వడమే ఆలస్యం, వైరల్ గానూ మారిపోయింది. దీనికి కారణం, అబ్బాయి చొక్క విప్పడమేనట.
అశ్వద్థామ సినిమాతో మాస్ హీరోగా నిలదొక్కుకున్న నాగశౌర్య, ఇప్పుడు ఆ ఇమేజ్ ను మరో లెవెల్ కు తీసుకువెళ్లిపోయాడు. ఫస్ట్ లుక్ లో సిక్స్ ప్యాక్స్ బాడీతో ఇరగదీశాడు. ఇక అబ్బాయి విల్లుని వంచి లక్ష్యానికి గురిపెడితే, అచ్చంగా ఆధునిక రాముడిలాగానే ఉన్నాడు అని అనడంలో అతిశయోక్తే లేదు.

క్రీడా నేపథ్యంలో సాగే ఈ చిత్రం కోసం కొంతకాలంగా శౌర్య బాడీ బిల్డింగ్ పై దృష్టిపెట్టి అద్భుతమైన ఫలితాలనే సాధించాడని చెప్పాలి. ఇక మంచి డిస్ట్రిబ్యూటర్ గా పేరుగాంచిన సునీల్ నారంగ్ ఈ చిత్ర నిర్మాణ బాధ్యతలు భూజానికెత్తుకోగా, సంతోష్ జాగర్లమూడి ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవ్వబోతున్నాడు. మరి ఫస్ట్ లుక్ తోనే సెగలు పుట్టిస్తున్న శౌర్య, సినిమాలో ఏ రేంజ్ లో అలరిస్తాడో చూడాలి.


Click it and Unblock the Notifications











