Anasuya Bhardwaj కు శ్రద్దాదాస్‌ మద్దతు.. దారుణంగా ఆటాడుకొన్న నెటిజన్లు

ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒకటే టాపిక్ నడుస్తోంది. అదే అనసూయ గురించి. అనసూయను ఆంటీ అంటూ నెటిజన్లు దారుణంగా ఆడేసుకుంటున్నారు. ముందు అయితే మామూలుగా ఆంటీ అని పిలిచేవారు. ఇప్పుడు మాత్రం కావాలనే సెటైరికల్‌గానే ఆంటీ అని హ్యాష్ టాగ్‌ను ట్రెండ్ చేస్తున్నారు. అనసూయను ఇలా ట్రోల్ చేయడానికి కారణం ఏంటో అందరికీ తెలిసే ఉంటుంది. విజయ్ దేవరకొండ లైగర్ సినిమాకు డిజాస్టర్ టాక్ రావడంతో.. అనసూయ పరోక్షంగా వేసిన ట్వీట్.. ఇప్పుడు చిలికి చిలికి గాలివానలా మారింది.

నాటి విషయం..

నాటి విషయం..

అర్జున్ రెడ్డి సమయంలో విజయ్ దేవరకొండ వాడిన బూతు పదం, దాని మీద అనసూయ మీడియాకెక్కడం, ఇష్టమొచ్చిన వాగడం అందరికీ తెలిసిందే. అర్జున్ రెడ్డి వర్సెస్ అనసూయ అన్నట్టుగా చర్చలు జరిగాయి. అయితే ఇప్పుడు ఆ విషయాన్ని మళ్లీ తవ్వి తీసింది అనసూయ. లైగర్ సినిమాకు నెగెటివ్ టాక్ రావడంతో అనసూయ రెచ్చిపోయింది. అమ్మని అంటే ఉసురు ఊరికే పోదు.. కర్మ వదిలి పెట్టదు అని పరోక్షంగా విజయ్ మీద కౌంటర్లు వేసింది.

అభిమానుల ఆగ్రహం..

అభిమానుల ఆగ్రహం..


అసలే లైగర్ పోయిందన్న బాధలో విజయ్ అభిమానులున్నారు. దీంతో అనసూయ కాస్తా.. పుండు మీద కారం చల్లినట్టు వ్యవహరించింది. అనసూయ వేసిన ట్వీట్‌తో రౌడీ అభిమానులు దారుణంగా రియాక్ట్ అయ్యారు. అనసూయను విపరీతంగా ట్రోల్స్ చేసి పడేశారు. అందరూ ఆంటీ అని పిలిచి ఆమెకు పిచ్చెక్కించారు. దీంతో అనసూయకు చికాకు పుట్టినట్టుంది.

కేసులు పెడతానంటూ..

కేసులు పెడతానంటూ..


నన్ను ఆంటీ అని తిడతారా? అవమానిస్తారా? మీ సంగతి తేలుస్తాను.. అందరి స్క్రీన్ షాట్లు తీసుకున్నాను.. కేసులు పెడతాను.. నన్ను ఏజ్ షేమింగ్ చేస్తారా? ఎవ్వరినీ వదిలి పెట్టను అంటూ నానా హంగామా చేసింది. దీంతో ట్రోలర్స్‌కు మరింత చిర్రెత్తుకొచ్చినట్టుంది. నేషనల్ వైడ్‌గా ఆంటీ అనే హ్యాష్ ట్యాగ్‌ను ట్రెండ్ చేశారు. ఇప్పుడు ఆంటీ అనేది ఓ ట్రెండింగ్ పదంగా మారింది.

 మధ్యలోకి దూరిన శ్రద్దాదాస్..

మధ్యలోకి దూరిన శ్రద్దాదాస్..


ఆంటీ అన్నారని అనసూయ బాధపడటంతో మధ్యలోకి శ్రద్దా దాస్ దూరింది. అనసూయను పొగిడేసింది. నీ ఏజ్‌లో సగం ఏజ్ ఉన్న అమ్మాయిలా కనిపిస్తావ్.. అని నీ ఏజ్ కంటే డబుల్ ఏజ్ ఉండే అంకుల్స్ కన్నా ఎంతో అందంగా ఉన్నావ్.. అని ఇలా అనసూయ మీద తెగ ప్రేమను కురిపించింది శ్రద్దాదాస్. దీంతో ఆమెను దారుణంగా ఏకి పారేశారు

టైం వేస్ట్ చేసుకోకండి..

టైం వేస్ట్ చేసుకోకండి..


నన్ను తిడుతూ మీ టైంను, మీ శక్తిని వేస్ట్ చేసుకోకండి.. నేను బ్లాక్ చేస్తాను.. లేదా డిలీట్ చేస్తాను.. కాబట్టి మీ ప్రయత్నం అంతా కూడా వృథానే. అనసూయకు నేను మద్దతు ఇచ్చానని మీరు నన్ను ట్రోల్ చేయడంలో అర్థమే లేదు.. మీ అందరూ త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను అని శ్రద్దా దాస్ ట్వీట్ వేసింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X