ఎన్టీఆర్ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ: ఒకేసారి ఇద్దరు స్టార్ హీరోయిన్లతో యంగ్ టైగర్
వరుసగా ఐదు భారీ విజయాలను అందుకుని ఫుల్ జోష్‌లో ఉన్నాడు నందమూరి హీరో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్. ఈ క్రమంలోనే దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తోన్న RRRలో నటిస్తున్నాడు. ఈ సినిమా కోసం దాదాపు మూడేళ్ల పాటు మరో ప్రాజెక్టులో నటించలేదు ఈ స్టార్ హీరో. దీని వల్ల వచ్చిన గ్యాప్‌ను తీర్చాలని భావిస్తోన్న అతడు.. ఇకపై వీలైనన్ని ఎక్కువ సినిమాలు చేయాలని డిసైడ్ అయ్యాడు. ఇందులో భాగంగానే 'అరవింద సమేత.. వీరరాఘవ' వంటి సూపర్ డూపర్ హిట్ ఇచ్చిన మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో కలిశాడు.
జూనియర్ ఎన్టీఆర్ - త్రివిక్రమ్ కాంబినేషన్‌లో రెండో సినిమా రాబోతున్నట్లు చాలా రోజుల క్రితమే ప్రకటించిన విషయం తెలిసిందే. అనివార్య కారణాల వల్ల RRR షూటింగ్ వాయిదా పడడంతో.. ఈ చిత్రం కూడా ప్రారంభం కాలేదు. ఇలాంటి పరిస్థితుల్లో దీన్ని సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని.. జనవరి 14న అధికారికంగా ప్రారంభించబోతున్నారని తెలుస్తోంది. అయితే, రెగ్యూలర్ షూటింగ్ మాత్రం ఎన్టీఆర్ ఖాళీ అయిన తర్వాతనే మొదలయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ మూవీ గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటకు వచ్చింది.

తాజా సమాచారం ప్రకారం.. ఈ సినిమాలో తారక్‌కు జోడీగా 'సాహో' హీరోయిన్ శ్రద్దా కపూర్‌ను తీసుకుంటున్నారట. ఇప్పటికే ఓ హీరోయిన్‌గా కన్నడ పిల్ల రష్మిక మందన్నాను ఫిక్స్ చేసిన చిత్ర యూనిట్.. మరో పాత్ర కోసం ఆమెతో సంప్రదింపులు జరిపిందని తెలిసింది. వాస్తవానికి ఈ రోల్ కోసం శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్‌ను అనుకున్నా.. ఆమె డేట్స్ ఖాళీ లేని కారణంగా దీనికి ఒప్పుకోలేదని అంటున్నారు. దీంతో శ్రద్దాను ఫైనల్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. మరోవైపు, ఈ సినిమాకు 'అయిననూ పోయి రావలె హస్తినకు' బదులుగా 'చౌడప్ప నాయుడు' అనే టైటిల్ పెడుతున్నట్లు తాజాగా మరో న్యూస్ లీకైన విషయం తెలిసిందే.


Click it and Unblock the Notifications











