రెండేళ్ల వరకు శ్రద్ధా కపూర్ ఫుల్ బిజీ, ఐదేళ్ల వరకు నో పెళ్లి!

'సాహో' హీరోయిన్ శ్రద్ధా కపూర్ లవ్ ఎఫైర్, పెళ్లి వార్తలపై ఆమె తండ్రి, బాలీవుడ్ సినీయర్ నటుడు శక్తి కపూర్ సీరియస్ అయ్యారు. ఇప్పట్లో తన కూతురు పెళ్లి జరుగదు అని, మరో ఐదేళ్ల వరకు ఆమె పెళ్లి చేసుకునే అవకాశమే లేదని స్పష్టం చేశారు. 32 ఏళ్ల శ్రద్దా కపూర్ కొంతకాలంగా ఫోటోగ్రాఫర్ రోహన్‌ శ్రేష్ఠ్‌తో ప్రేమలో మునిగి తేలుతోందని, ఆమె వయసు ముదిరిపోతుండటంతో ఇద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారనే రూమర్స్ బాలీవుడ్ సర్కిల్‌లో గుప్పుమన్నాయి. ఈ విషయమై శక్తి కపూర్ రియాక్ట్ అయ్యారు.

బాలీవుడ్ మీడియా ఇంటర్వ్యూలో తన కూతురు పెళ్లి వార్తలపై శక్తి కపూర్ స్పందిస్తూ.. 'ఆ వార్తలన్నీ బుల్ షిట్... అందులో ఏమాత్రం నిజం లేదు. మరో నాలుగైదేళ్ల వరకు శ్రద్ధాకు పెళ్లి చేసుకునే ఆలోచన లేదు. ప్రస్తుతం ఆమె వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉంది, మరో రెండేళ్ల వరకు డేట్స్ కూడా ఖాళీగా లేవు.' అన్నారు.

గతంలో శ్రద్ధా కపూర్‌కు చాలా మంది యాక్టర్లతో లింకు పెట్టా గాసిప్స్ ప్రచారం చేశారు. సినిమా ఇండస్ట్రీలో ఇద్దరు కలిసి మాట్లాడుకున్నా లింకు పెట్టేస్తారు. ఇవన్నీ సర్వసాధారణం. అందుకే తాము ఈ వార్తలను పెద్దగా పట్టించుకోబోము అని శక్తి కపూర్ తెలిపారు.

Shraddha Kapoor has no plans of marrying anyone for coming 5 years

రోహన్ శ్రేష్ఠ్ తండ్రి రాకేష్ నాకు బాగా తెలుసు. ఆయన మా ఫ్యామిలీ ఫ్రెండ్. నా కూతురు తన జీవితంలో జరిగే అన్ని విషయాలు నాతో పంచుకుంటుంది. తల్లిదండ్రుల అనుమతి లేకుండా పెళ్లి చేసుకోదు... అని శక్తి కపూర్ స్పష్టం చేశారు.

శ్రద్ధా కపూర్ సినిమాల విషయానికొస్తే... తెలుగులో ప్రభాస్ మూవీ 'సాహో'తో పాటు బాలీవుడ్లో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌తో కలిసి 'చిచ్చోరే' అనే చిత్రంలో నటిస్తోంది. దీంతో పాటు స్ట్రీట్ డాన్సర్ అనే మరో చిత్రం చేస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X