ప్రభాస్ ఫ్యాన్స్ మ్యాడ్‌నెస్, థియేటర్లో రచ్చ... వీడియో చూసి షాకైన శ్రద్దా కపూర్!
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన 'సాహో' టీజర్‌కు అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. తెలుగు, తమిళం, హిందీ, మలయాళంలో విడుదలైన ఈ టీజర్ సినిమా ప్రమోషన్లో భాగంగా దేశ వ్యాప్తంగా ఉన్న అన్ని థియేటర్లలో విడుదల చేశారు. తెలుగు రాష్ట్రాల్లో ప్రభాస్ అభిమానుల హడావుడి మామూలుగా లేదు, థియేటర్లో 'సాహో' టీజర్ పడగానే రచ్చ రచ్చ చేస్తున్నారు.
'సాహో' టీజర్ ప్రదర్శన సందర్భంగా ఓ థియేటర్లో డప్పులు మ్రోగిస్తూ డాన్స్ చేస్తూ అభిమానులు సందడి చేశారు. ప్రభాస్ క్రేజ్ ఈ స్థాయిలో ఉంటుందనే విషయం తెలియని హీరోయిన్ శ్రద్దా కపూర్ ఫ్యాన్స్ వీడియో చూసి షాకైంది. దాన్ని తన ఇన్‌స్టాగ్రామ్ పేజీ ద్వారా షేర్ చేసింది.

''ప్రభాస్‌ను ఇంత పిచ్చిగా అభిమానిస్తారని తెలియదు. ఆయనతో పని చేయాలనే నా డ్రీమ్ నెరవేరింది. దర్శకుడు సుజీత్‌తో పాటు 'సాహో' మూవీకి 2 సంవత్సరాలు కష్టపడి పని చేసిన టీం మొత్తానికి ధన్యవాదాలు. టీజర్‌కు వచ్చిన అద్భుతమైన స్పందన చూస్తుంటే మనసు పులకించిపోతోందని శ్రద్ధా కపూర్ తెలిపారు.
కాగా.. 4 భాషల్లో విడుదలైన 'సాహో' టీజర్‌కు 24 గంటల్లో 60 మిలియన్(6 కోట్లు) వ్యూస్ వచ్చాయి. రూ. 300 కోట్ల బడ్జెట్‌తో యూవి క్రియేషన్స్ సంస్థ 'సాహో' చిత్రాన్ని నిర్మించింది. 'బాహుబలి' తర్వాత ప్రభాస్ నెక్ట్స్ మూవీపై భారీ అంచనాలు నెలకొన్న నేపథ్యంలో ఆ అంచనాలను అందుకునే విధంగా, ప్యాన్ ఇండియా స్థాయిలో, క్వాలిటీ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.
టీజర్ విడుదలతో 'సాహో' మూవీ ప్రమోషన్స్ ఊపందుకున్నాయి. ప్రభాస్‌తో పాటు చిత్ర బృందం ప్రచార కార్యక్రమాల్లో సందడి చేయబోతున్నారు. ప్రభాస్ సరసన శ్రద్ధా కపూర్ హీరోయిన్‌గా నటిస్తుండగా... నీల్ నితిన్ ముఖేష్, అరుణ్ విజయ్, జాకీ ష్రాఫ్, మందిరా బేడీ, వెన్నెల కిషోర్, ఎవలీన్ శర్మ, మురళీ శర్మ, ఆదిత్య శ్రీవాస్తవ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.


Click it and Unblock the Notifications











