SAINDHAV: వెంకటేష్‌తో నాని హీరోయిన్.. ఇది మామూలు ట్విస్ట్ కాదుగా!
దాదాపు నాలుగు దశాబ్దాలుగా తెలుగు సినీ ఇండస్ట్రీలో హవాను చూపిస్తూ.. హిట్లు ఫ్లాపులతో సంబంధం లేకుండా సినిమాలు చేస్తూ దూసుకుపోతోన్నారు సీనియర్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్. సుదీర్ఘ కాలంగా ఫ్యామిలీ చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తోన్న ఆయన.. ఈ మధ్య వరుసగా ప్రయోగాలు చేస్తోన్నారు. గత ఏడాది 'ఎఫ్3' చిత్రంతో వచ్చి అదిరిపోయే కామెడీని పండించిన వెంకటేష్.. ఇటీవలే 'రానా నాయుడు' వెబ్ సిరీస్‌తో తనలోని కొత్త యాంగిల్‌ను చూపించారు. ఈ క్రమంలోనే ఈ సీనియర్ హీరో ఇప్పుడు అదిరిపోయే పాన్ ఇండియా మూవీ చేస్తున్నారు.
కొంత కాలం పాటు సినిమాలకు గ్యాప్ ఇచ్చిన విక్టరీ వెంకటేష్.. ఇప్పుడు 'హిట్' ఫ్రాంచైజీ డైరెక్టర్ శైలేష్ కొలనుతో 'సైంధవ్' అనే సినిమా చేస్తున్నారు. కొద్ది రోజుల క్రితమే ఈ సినిమాకు సంబంధించిన గ్లింప్స్ వీడియోను కూడా విడుదల చేశారు. ఇందులో ఒక బయో డ్రగ్‌ను చూపించి ఆరంభంలోనే అంచనాలు తారాస్థాయిలో ఏర్పరిచారు. ఇక, ఇటీవలే ఈ సినిమా రెగ్యూలర్ షూటింగ్‌ను కూడా మొదలు పెట్టారు. అంతేకాదు, ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ షెడ్యూల్‌ను కూడా పూర్తి చేసుకున్నారు. ఇదంతా ఎంతో బాగా వచ్చిందనే టాక్ వినిపిస్తోంది.

సైంటిఫిక్ క్రైమ్ థ్రిల్లర్‌గా రూపొందుతోన్న 'సైంధవ్' మూవీని పాన్ ఇండియా రేంజ్‌లో తెలుగు, తమిళం, కన్నడం, మలయాళం, హిందీ భాషల్లో తెరకెక్కిస్తున్నారు. అందుకు అనుగుణంగానే ఈ చిత్రం కోసం ఎన్నో ఇండస్ట్రీల నటీనటులను తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఇందులో టాలెంటెడ్ బ్యూటీ శ్రద్దా శ్రీనాథ్‌ను ఎంపిక చేశారు. తాజాగా ఆమె రోల్ పేరు 'మనోజ్ఞ' అని రివీల్ చేయడంతో పాటు ఫస్ట్ లుక్‌ను కూడా విడుదల చేశారు. ఇందులో ఆమె ఓ ట్యాక్సీలో కూర్చుని అన్నం తింటూ కనిపించింది. ఇక, ఈ చిత్రం కోసం ఎంతో మంది హీరోయిన్ల పేర్లు వినిపించినా.. చిత్ర యూనిట్ మాత్రం శ్రద్దాను తీసుకుని ట్విస్ట్ ఇచ్చింది.
ఇక, వెంకటేష్ - శైలేష్ కొలను కలయికలో రాబోతున్న 'సైంధవ్' మూవీకి సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నారు. అలాగే, నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై వెంకట్ బోయినపల్లి దీన్ని నిర్మిస్తున్నారు. ఇందులో బాలీవుడ్ స్టార్ నవాజుద్దీన్ సిద్దిఖీ కీలక పాత్రను చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











