For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  సమంతను టార్గెట్ చేసిన కొత్త హీరోయిన్.. ఆమెకే ఎసరు పెట్టేసింది.. చివరకు చేసేది లేక సామ్!

  |

  రోజు రోజుకు మీడియా రంగంలో వస్తున్న పెను మార్పులు ఎప్పటికప్పుడు వార్తలను ప్రజలముంగిట ఉంచడటంలో బాగా ఉపయోగపడుతున్నాయి. మరోవైపు సోషల్ మీడియా హంగామా కూడా బాగా పెరిగిపోవడంతో ప్రపంచంలో ఎక్కడేం జరిగినా క్షణాల్లో తెలుసుకుంటున్నారు జనం. ఇక హీరో హీరోయిన్స్ ముచ్చట్ల గురించి ప్రత్యేకంగా చెప్పాలా? ఎప్పుడు ఏ హీరోయిన్ ఏం మాట్లాడింది? ఎలా మాట్లాడింది? ప్రతీ ఒక్కటి రికార్డ్ చేసుకొని గుర్తుపెట్టుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఇటీవల కన్నడ భామ శ్రద్ద శ్రీనాథ్.. సమంత యూ టర్న్ సినిమాపై చేసిన కామెంట్ మరోసారి తెరపైకి వచ్చింది. సమంతను టార్గెట్ చేసిన ఈ భామ సమంతను పక్కకునెట్టి ఆమె ప్లేస్ ఆక్రమించడం ప్రస్తుతం హాట్ టాపిక్ అవుతోంది. ఇంతకీ విషయమేమిటంటారా..?

   శ్రద్ద శ్రీనాథ్

  శ్రద్ద శ్రీనాథ్

  జెర్సీ సినిమాతో కన్నడ భామ శ్రద్ద శ్రీనాథ్ అన్నివర్గాల ప్రేక్షకులకు దగ్గరైంది. తెలుగు ఈమెకు మొదటి సినిమానే మంచి బ్రేక్ తెచ్చిపెట్టింది. గ్లామర్, రొమాన్స్, ఇంటి ఇల్లాలు ఇలా ఏ పాత్రలోనైనా తాను ఒదిగిపోగలనని కేవలం ఈ ఒక్క సినిమాతోనే రుజువు చేసింది శ్రద్ద.

  కెరీర్ ప్రారంభంలో..

  కెరీర్ ప్రారంభంలో..

  తెలుగు తెరకు పరిచయం కాకముందే శ్రద్ద శ్రీనాథ్ తన సొంత భాష కన్నడలో యూ టర్న్, తమిళంలో విక్రమ్ వేద సినిమాల్లో నటించి విమర్శకుల ప్రశంసలందుకుంది. తనకిచ్చిన క్యారెక్టర్‌లో ఒదిగిపోయి నటించడంతో ఆమెకు క్రేజ్ పెరిగింది. అయితే కన్నడలో రూపొందిన యూ టర్న్ సినిమాను తెలుగులో సమంతను లీడ్ రోల్‌లో పెట్టి రీమేక్ చేశారు.

  సమంతపై కామెంట్

  సమంతపై కామెంట్

  కన్నడలో రూపొందిన యూ టర్న్ చిత్రంలో శ్రద్ద లీడ్ రోల్‌లో నటించగా.. అదే సినిమా తెలుగు రీమేక్‌లో సమంత లీడ్ రోల్ పోషించింది. అయితే జెర్సీ సక్సెస్ తర్వాత ఓ కార్యక్రమంలో మాట్లాడిన శ్రద్ద శ్రీనాథ్.. సీనియర్ హీరోయిన్ అయిన సమంతను కామెంట్ చేయడం అప్పట్లో సెన్సేషన్ అయింది. సమంత యూ టర్న్ జస్ట్ అరగంటే చూశానని, అప్పటికే బోర్ కొట్టేసిందని చెప్పింది. ఇందులో సమంత అభినయం కంటే ఒరిజినల్ వర్షన్‌లో తనదే బెస్ట్ పెర్ఫామెన్స్ అంటూ ఆమె చేసిన నెగెటివ్ కామెంట్ ఇండస్ట్రీ వర్గాల్లో చర్చనీయాంశం అయింది. కానీ దీనిపై సమంత స్పందించలేదు.

   వెనక్కి తగ్గిన సమంత

  వెనక్కి తగ్గిన సమంత

  పెళ్లి తర్వాత మంచి జోష్‌లో ఉన్న సమంత గతేడాది సూపర్ డూపర్ హిట్స్ తన ఖాతాలో వేసుకుంది. తమిళంలో ఆమె నటించిన ఇరుంబు తిరై చిత్రం భారీ సక్సెస్ పొందింది. విశాల్ సరసన నటించిన సామ్ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది. దీంతో ఈ సినిమాకు సీక్వెల్ రూపొందించాలని ప్లాన్ చేశారు. ఇందుకోసమే సమంతను సంప్రదించగా తనకు వీలు కాదని ముఖం చాటేసిందట.

  శ్రద్ద శ్రీనాథే కరెక్ట్..

  శ్రద్ద శ్రీనాథే కరెక్ట్..

  సమంత నో చెప్పడంతో ఇరుంబు తిరై సీక్వల్‌లో శ్రద్ద శ్రీనాథ్‌ని హీరోయిన్‌గా తీసుకోవాలని భావించారట దర్శకనిర్మాతలు. సమంతను రీ ప్లేస్ చేయాలంటే ఈ కన్నడ భామనే కరెక్ట్ అని ఫైనల్ అయ్యారట. విశాల్ సరసన ఇందులో నటించడానికి శ్రద్ద కూడా సై అనేయడంతో ఇక సినిమాను పట్టాలెక్కించే పనిలో పడ్డారు యూనిట్ సభ్యులు. అతి త్వరలో ఈ సినిమా షూటింగ్ మొదలు కానుంది.

  తెలుగులో సమంతకు పోటీ కానుందా?

  తెలుగులో సమంతకు పోటీ కానుందా?

  సమంతను కామెంట్ చేసిన శ్రద్ద.. ఎలాగోలా తమిళంలో సమంత ఛాన్సునే పట్టేయడం చెప్పుకోదగ్గ విషయమే. అయితే ఇప్పటికే తెలుగులో జెర్సీతో ఫుల్ జోష్‌లో ఉన్న శ్రద్ద శ్రీనాథ్.. ఇక్కడ కూడా సమంత అవకాశాలు తన్నుకుపోతుందా ఏంటి? అనే సందేహం తలెత్తుతోంది ప్రేక్షకుల్లో.

   సమంత, శ్రద్ద శ్రీనాథ్

  సమంత, శ్రద్ద శ్రీనాథ్

  పెళ్లి తర్వాత మొదటిసారి మజిలీ చిత్రంతో భర్త నాగచైతన్యతో వెండితెర రొమాన్స్ రుచి చూపించిన సమంత.. మరోసారి ఇది రిపీట్ చేయనుంది. చైతు- సమంత కలిసి మరో సినిమాలో నటించబోతున్నారు. అదేవిదంగా మామ నాగార్జునతో కూడా మన్మథుడు 2 లో నటిస్తోంది సామ్. ఇక శ్రద్ద విషయానికొస్తే.. నానితో రొమాన్స్ చేసిన తర్వాత అజిత్‌తో కలిసి పింక్ రీమేక్ లో, ఇరుంబు తిరై-2 లో విశాల్‌తో రొమాన్స్‌కి రెడీ అవుతోంది.

  English summary
  Shraddha Srinath replaced samantha in Irumbu Thirai 2 movie. Looks she will be big star in telugu cinema industry also.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X