Don't Miss!
- News భారత్‌లో పెట్టుబడులపై ఎలాన్ మస్క్ యూటర్న్?
- Finance Ola Cabs IPO: త్వరలో ఓలా క్యాబ్స్ ఐపీఓ..
- Technology ధర రూ.14999 కే 6000mAh బ్యాటరీ, 50MP కెమెరా శాంసంగ్ స్మార్ట్‌ఫోన్ కొత్త వేరియంట్ విడుదల..!!
- Sports అందుకే ధోనీ ముందుగా బ్యాటింగ్‌కు రావట్లేదు- CSK కోచ్
- Automobiles మరింత తక్కువ ధరలో బజాజ్ చేతక్ ఇ స్కూటర్.. త్వరలో లాంచ్.!!
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
తల్లి కాబోతున్న ఫేమస్ సింగర్: బేబీ శ్రేయాదిత్య కమింగ్ అంటూ సోషల్ మీడియాలో పోస్ట్
సినీ ఇండస్ట్రీలోకి ఎంతో మంది సింగర్లుగా వస్తుంటారు. అయితే, వారిలో కొందరు మాత్రమే ఊహించని రీతిలో సక్సెస్ అవుతుంటారు. అలాంటి వారిలో ఫీమేల్ లీడ్ సింగర్ శ్రేయా ఘోషల్ ఒకరు. తనదైన శైలి గాత్రంతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న ఆమె.. దేశ వ్యాప్తంగా ఉన్న అన్ని ఇండస్ట్రీలో పని చేసి మంచి పేరును సంపాదించుకుంది. సుదీర్ఘమైన కెరీర్లో కొన్ని వేల పాటలను ఆలపించిన ఈ టాప్ సింగర్.. లెక్కలేనన్ని అవార్డులను తన ఖాతాలో వేసుకుంది. కెరీర్ పరంగా ఫుల్ బిజీగా ఉండే శ్రేయా.. తాజాగా ఓ వ్యక్తిగత శుభవార్తను ఫ్యాన్స్‌తో పంచుకుంది.
Recommended Video
ప్రముఖ సింగర్ శ్రేయా ఘోషల్ శుభవార్త చెప్పింది. తాను గర్భవతిగా ఉన్నట్లు గురువారం ఉదయం స్వయంగా ప్రకటించింది. తన సోషల్ మీడియా ఖాతాల ద్వారా ఈ విషయాన్ని వెల్లడించింది. ఈ మేరకు కడుపుతో ఉన్న ఓ ఫొటోను షేర్ చేసిన ఈ టాప్ సింగర్.. 'బేబీ శ్రేయాదిత్య కమింగ్. మా జీవితంలో ఈ సరికొత్త అధ్యాయాన్ని పంచుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఈ శుభ సమయంలో అందరి ప్రేమ, ఆశీస్సులు కావాలి' అంటూ కోరింది. దీంతో ఆమెకు సినీ ప్రముఖులతో పాటు సామాన్య నెటిజన్ల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.
ఇదిలా ఉండగా.. శ్రేయా ఘోషల్ తన మిత్రుడైన శైలాదిత్య ముఖోపాధ్యాయను 2015లో పెద్దల సాక్షిగా వివాహం చేసుకుంది. అప్పటి నుంచి తన భర్తతో కలిసున్న ఎన్నో విషయాలను సోషల్ మీడియా ద్వారా వెల్లడిస్తోంది. మరోవైపు హిందీ, తెలుగు, కన్నడ, తమిళం, బెంగాలీ, పంజాబీ, మరాఠీ, మళయాళం, అస్సామీ సహా దేశంలోని ఎన్నో భాషల్లో పాటలను ఆలపిస్తూ తిరుగులేని సింగర్‌గా వెలుగొందుతోంది శ్రేయా ఘోషల్. ఆయా భాషల్లో ఇచ్చే ప్రతిష్టాత్మక అవార్డులతో పాటు జాతీయ పురస్కారాలను సైతం అందుకుందామె.