Adipurush Free Ticket ఖమ్మం జిల్లా వాసులకు ఉచితంగా ఆదిపురుష్ టికెట్లు.. శ్రేయాస్ మీడియా సంచలన నిర్ణయం

ప్రపంచవ్యాప్తంగా భారతీయ సినిమా ప్రేక్షకులు ఎదురు చూస్తున్న చిత్రం ఆదిపురుష్. దర్శకుడు ఓం రావత్ దర్శకత్వంలో ప్రభాస్, కృతిసనన్, సైఫ్ ఆలీ ఖాన్ నటించిన ఈ చిత్రం ఇప్పటికే వరల్డ్ వైడ్‌గా ట్రెండింగ్‌లో ఉంది. టీ సిరీస్ మరియు యూవీ క్రియేషన్స్ నిర్మించిన ఈ సినిమాను తెలుగు ప్రేక్షకుల వద్దకు తీసుకొస్తున్నారు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ. అత్యంత భారీ టెక్నాలజీతో తెరకెక్కిన ఈ చిత్రం జూన్ 9వ తేదీన రిలీజ్ కానున్నది. రాముడిగా ప్రభాస్, సీతగా కృతిసనన్, రావణుడిగా సైఫ్ ఆలీ ఖాన్ నటించారు. ఇప్పటికే టీజర్లు, ట్రైలర్లు భారీ హైప్‌ను క్రియేట్ చేశాయి. రామాయణం కథగా వెండితెర రూపం దాల్చిన ఈ చిత్రానికి ఉచితంగా టికెట్లు అందిస్తూ ప్రేక్షకులను ఈ సినిమాకు దగ్గరగా చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆ వివరాల్లోకి వెళితే..

ఇప్పటికే ప్రముఖ నిర్మాత అభిషేక్ అగర్వాల్ ఈ సినిమా కోసం 10 వేల టికెట్లను ఉచితంగా అందజేయనున్నారు. తెలంగాణలోని వికలాంగులకు, వృద్దాశ్రమంలో ఉండే వృద్ధులు, ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ఈ సినిమాను ఉచితంగా చూపించేందుకు ఏర్పాట్లు చేశారు. అభిషేక్ అగర్వాల్‌తో పాటు ఈ సినిమాను ఖమ్మం జిల్లాలో ప్రతీ గ్రామంలో 100 మందికిపైగా ప్రేక్షకులకు ఉచితంగా సినిమాను చూపించాలని శ్రేయాస్ మీడియా అధినేత గండ్ర శ్రీనివాస్ నిర్ణయం తీసుకొన్నారు.

Shreyas Media to distribute free Tickets of Prabhas Adipurush for Khammam Districts people

శ్రేయస్ మీడియా తెలిపిన ప్రకారం.. ఖమ్మం జిల్లాలోని ప్రతి గ్రామంలోని ప్రతి రామాలయానికి 100+1 (1 టికెట్ హనుమాన్‌కు) టికెట్లు ఉచితంగా ఇవ్వదలుచుకున్నాం. శ్రేయస్ మీడియా అధినేత శ్రీనివాస్ తన సొంత డబ్బులతో ఈ టికెట్లు అందజేస్తారు. దేశంలోనే నెంబర్ వన్ మూవీ ఈవెంట్ ప్రొమోషన్ కంపెనీ శ్రేయాస్ కంపెనీ ఈ సినిమాను ప్రేక్షకులకు చేరువ చేయాలని నిర్ణయం తీసుకొన్నది అని ఓ ప్రకటనలో తెలిపారు. ఖమ్మం జిల్లాలోని ఆయా రామాలయాల నుంచి ఎవరైనా ఒకరు కింద తెలియజేసిన ఫోన్ నెంబర్‌ను సంప్రదించడం ద్వారా టిక్కెట్లను ఉచితంగా పొందవచ్చని ప్రకటనలో తెలిపారు. ఉచితంగా టికెట్లు పొందడానికి 8466012345 అనే ఫోన్ నంబర్ ద్వారా సంప్రదించి టికెట్లు పొందాలని సూచించారు.

శ్రీరాముడు, సీతామాత జీవితం అందరికీ ఆదర్శం. రాముడి దివ్యమైన చరిత్రే ఆదిపురుష్ సినిమా. ఆ ఆదర్శవంతమైన దివ్య మంగళ చరిత్ర ప్రతి ఒక్కరికీ చూపించాలనే సంకల్పంతో ఈ నిర్ణయం తీసుకున్నామని శ్రేయస్ మీడియా ప్రకటనలో పేర్కొన్నారు. ఆదిపురుష్ సినిమాను ప్రోత్సాహించడంపై శ్రేయాస్ మీడియాను అభినందిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X