సాగర తీరాన నడుమును తిప్పుతూ.. వయ్యారాలను ఒలకబోస్తోన్న శ్రియ
ఇష్టం సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇచ్చిన శ్రియా..అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్‌గా మారిపోయింది. సీనియర్ హీరోలతో నటిస్తూనే.. కుర్ర హీరోలతోనూ జత కట్టి ఫుల్ స్పీడ్‌లో దూసుకుపోయింది. టాలీవుడ్ టాప్ హీరోలైన చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ లాంటి హీరోలతోనే కాకుండా అప్పటి యంగ్ హీరోలైన మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్ వంటి హీరోలతోనూ నటించింది. ఇక ఈ మధ్యే పెళ్లి చేసుకోవడంతో సినిమాలకు కాస్త దూరంగా ఉంటోంది.

భర్తతో చెట్టాపట్టాల్..
లేటు వయసులో ఇటీవలే పెళ్లి చేసుకున్న శ్రీయ.. భర్త ఆండ్రీ కోస్చీవ్‌తో ప్రతీక్షణం ఎంజాయ్ చేస్తోంది. ఆయనతో కలిసి షికార్లు కొడుతూ బీచ్ ఒడ్డున, పబ్లిక్ ప్రదేశాల్లో పొట్టి పొట్టి దుస్తులు వేసుకొని డాన్సులేస్తూ ఫుల్ ఖుషీ చేస్తోంది. వీటికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
విపత్కర పరిస్థితిని ఎదుర్కొన్న శ్రియా..
లండన్ ఎయిర్ పోర్టు పరిసరాల్లో షూటింగ్ జరుగుతుండగా..అనుకోకుండా హై సెక్యూరిటీ జోన్‌లోకి శ్రియ ప్రవేశించిందట. దీంతో వెంటనే అప్రమత్తమైన లండన్ పోలీసులు ఆమెను చుట్టుముట్టి తుపాకీ గురిపెట్టి.. ప్రశ్నల వర్షం కురిపిస్తుండడంతో శ్రీయ షాకయ్యిందట. చివరకు చిత్ర యూనిట్ సభ్యులు వచ్చి తగిన అనుమతి పత్రాలు, ఆధారాలు చూపించడంతో లండన్ పోలీసులు ఆమెను వేదిలేశారు.

వయ్యారాలతో ఊపేస్తోన్న శ్రియా..
న్యూయార్క్ నడివీధుల్లో మ్యూజిక్ బ్యాండ్ దరువులకు శ్రియా కాలు కదిపింది. తన నడుమును వయ్యారంగా తిప్పుతూ తెగ మెలికలు తిరిగింది. సాగర తీరాన శ్రియా అలా వయ్యారాలను వొలకబోస్తుంటే చూసిన వారికి మతి పోయేలా ఉంది. దీనికి సంబంధించిన వీడియోను శ్రియా తన ఇన్‌స్టాలో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తోంది.


Click it and Unblock the Notifications











