RRR మూవీ ఇంట్రెస్టింగ్ అప్‌డేట్.. ఆయనకు జోడిగా ఆ హీరోయిన్

బాహుబలి సినిమాతో దేశ వ్యాప్తంగానే గుర్తింపు తెచ్చుకున్నాడు రాజమౌళి. అంతర్జాతీయ స్థాయిలో తెలుగు సినిమా సత్తాను చాటాడు దర్శకధీరుడు. ఆయన ప్రస్తుతం తెరకెక్కిస్తున్న అత్యంత భారీ మల్టీ స్టారర్ చిత్రం RRR. యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాంబినేషన్‌లో తెరకెక్కిస్తున్న ఈ మూవీకి సంబంధించి ఇప్పటికే ఓ రేంజ్ హైప్ క్రియేట్ అయింది. తాజాగా ఈ మూవీ మరోసారి వార్తల్లో నిలిచింది.

వికారాబాద్ అడవుల్లో..

వికారాబాద్ అడవుల్లో..

ఆర్ఆర్ఆర్ మూవీ షూటింగ్‌లో బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగణ్ జాయిన్ అయ్యాడు. ఈ మేరకు నిర్మాతలు ఓ ప్రకటన చేశారు. ప్రస్తుతం ఈ మూవీ హైద్రాబాద్ పరిసర ప్రాంతాల్లోనే షూటింగ్ జరుపుకుంటోంది. వికారాబాద్ అడువుల్లో ఎన్టీఆర్, అజయ్ దేవగణ్‌లకు సంబంధించిన కీలకమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నట్టు తెలుస్తోంది.

ఎన్టీఆర్‌పై అదిరిపోయే సన్నివేశాలు..

ఎన్టీఆర్‌పై అదిరిపోయే సన్నివేశాలు..

ఈ షెడ్యూల్‌లో ఎన్టీఆర్‌పై అదిరిపోయే సీన్స్ తెరకెక్కించబోతోన్నట్టు సమాచారం. అయితే ఆర్ఆర్ఆర్‌కు సంబంధించిన ముఖ్యమైన ప్రతీ సీన్స్ లీకవ్వడం పరిపాటిగా మారిపోయింది. ఈ క్రమంలో వీటిని ఎంత గుట్టుగా ఉంచాలనుకుంటే అంత రచ్చగా తయారవుతోంది. విశాఖ అడువుల్లో తెరకెక్కించిన ఎన్టీఆర్ సీన్స్‌ లీకై పెద్ద దుమారమే రేగింది. తాజాగా అలాంటి సీనే ఒకటి జరిగింది. ఈ మూవీలో యంగ్ టైగర్ ఓ పులితో తలపడనున్నట్లు తెలుస్తోంది. టార్జన్ లుక్‌లో ఎన్టీఆర్ లీకైన ఫోటో సోషల్ మీడియాలో రచ్చ చేస్తోంది.

ఇప్పటికే ఇద్దరు ఖరారు..

ఇప్పటికే ఇద్దరు ఖరారు..

ఈ సినిమాలో హీరోలుగా నటిస్తున్న రామ్ చరణ్ సరసన బాలీవుడ్ హీరోయిన్ అలియాభట్ నటిస్తుండగా, మరో హీరో ఎన్టీఆర్ సరసన హాలీవుడ్ హీరోయిన్ ఒలీవియో మోరిస్ నటిస్తోంది. అంతకు ముందు ఎన్టీఆర్‌కు జోడిగా ఓ భామను అనుకున్నా.. ఆమె తప్పుకోవడంతో ఒలీవియాను పట్టుకొచ్చారు.

Recommended Video

Megastar Chiranjeevi Sweet Warning To Ram Charan
అజయ్ దేవగణ్ సరసన..

అజయ్ దేవగణ్ సరసన..

అయితే ఈ మూవీలో ఓ ముఖ్య పాత్రను పోషిస్తున్న అజయ్ దేవగణ్‌కు కూడా ఓ హీరోయిన్ అవసరం ఉంటుందట. ఆమె క్యారెక్టర్‌కి కూడా ఇంపార్టెన్స్ ఉంటుందని టాక్. అందుకే అజయ్ సరసన శ్రియాను తీసుకున్నట్టు టాక్. ఇంతకుముందే వీరిద్దరు దృశ్యం బాలీవుడ్ రీమేక్‌లో కలిసి నటించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X