Don't Miss!
- News ఉరేయాలన్న బొత్స తండ్రి సమానుడా ? వైఎస్ నూ వదల్లేదుగా- జగన్ కు షర్మిల కౌంటర్..!
- Sports ఒక్కసారి కమిటైతే నా మాట నేనే వినను- కమిన్స్ Video
- Travel ఐఆర్సిటీసి వారి హైదరాబాద్ టు అహ్మదాబాద్ 8 రోజుల ట్రైన్ టూర్ ప్యాకేజీ...
- Finance Gold Bonds: గోల్డ్ బాండ్స్ ప్రీమెచూర్ ధర ప్రకటించిన ఆర్బీఐ.. పూర్తి వివరాలివే..
- Automobiles సేఫ్టీలో మహీంద్రా బొలెరో నియోకు కేవలం 1-స్టార్ రేటింగ్.. దీనిపై కంపెనీ ఏమందంటే??
- Technology Realme నుంచి రెండు కొత్త ఫోన్లు లాంచ్ అయ్యాయి! ధర రూ.11,999 కే మొదలు
- Lifestyle వేసవిలో కడుపులో చల్లగా ఉంచే కీరకాయ పెరుగుపచ్చడి-అన్నం, రోటీ లేదా చపాతీ దేనికైనా...
నాగార్జున ఉన్న చోటే శ్రీయ.. బీచ్‌లో సరదాలు.. బికినీ వేసి రచ్చ!
Recommended Video
సీనియర్ హీరోయిన్ శ్రీయ బికినీ వేసి డాన్స్ చేస్తూ యమ ఎంజాయ్ చేసేసింది. అది కూడా బీచ్ ఒడ్డున. ఈ వీడియోను స్వయంగా ఆమెనే షేర్ చేయడంతో నెట్టింట వైరల్ అయింది. పైగా అది నాగార్జున పుట్టిన రోజు వేడుకల కోసం వెళ్లిన ఐబిజా బీచ్ కావడంతో ఈ వీడియో కాస్త నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది. ఆ వివరాలు చూస్తే..
పెళ్లి చేసుకున్న శ్రీయ శరణ్.. ఫుల్ యాక్టివ్
ఇటీవలే పెళ్లి చేసుకున్న సీనియర్ హీరోయిన్ శ్రీయ శరణ్ ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ అయింది. ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫొటోలు, వీడియోలతో నెటిజన్లకు స్పెషల్ ట్రీట్ ఇస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా హాట్ హాట్ ఫోజులిస్తూ ఆమె చేసిన డాన్స్ వీడియోను స్వయంగా తానే సోషల్ మీడియాలో పెట్టి సంచలనం సృష్టించింది.
బీచ్ డ్యాన్స్.. వైరల్ వీడియో
ఈ వీడియోలో శ్రీయ శరన్ యమ జోష్‌లో కనిపించింది. పింక్ కలర్ బికినీ వేసి బీచ్ ఒడ్డున తన డాన్స్ పర్ఫార్మెన్స్తో మతిపోగెట్టేసింది. డాన్స్ చేస్తూ ఎంతో సరదాగా ఉన్న ఆమెను చూసి యూత్ ఆడియన్స్ ఫిదా అవుతున్నారు. శ్రీయ షేర్ చేసిన ఈ వీడియో వైరల్‌గా మారడంతో దీనిపై నెటిజన్లు పెద్ద ఎత్తున కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.
బీచ్‌లో ఇలా ఎంజాయ్ చేశా.. మిస్ అవుతున్నా
ఈ వీడియోని తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా షేర్ చేసిన శ్రీయ.. ఈ వీడియో ఇప్పటిది కాదని, ఒకప్పుడు ఐబిజా బీచ్‌లో ఇలా ఎంజాయ్ చేశానని, ఇప్పుడు ఆ బీచ్ మిస్ అవుతున్నానని పేర్కొంటూ ట్యాగ్ చేసింది. దీంతో ఇది కాస్త చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే అదే బీచ్‌లో ప్రస్తుతం నాగార్జున కూడా ఉన్నాడు కాబట్టి.
అక్కినేని ఫ్యామిలీ జాలీ షికారు.. హాట్ హాట్ చర్చలు
గత వారం నాగార్జున పుట్టినరోజు వేడుక నిమిత్తం అక్కినేని ఫ్యామిలీ అంతా కలిసి స్పెయిన్‌లోని ఐబిజాకు వెళ్లిన సంగతి తెలిసిందే. నాగార్జున సహా నాగచైతన్య, సమంత, అఖిల్, నాగార్జున, అమల తదితరులు ఐబిజా ట్రిప్‌ను ఫుల్లుగా ఎంజాయ్ చేస్తున్నారు. ఈ విశేషాలను సమంత ఎప్పటికప్పుడు నెటిజన్ల ముందుంచుతూనే ఉంది. సరిగ్గా ఈ సమయంలో శ్రీయ అదే బీచ్‌లో ఎంజాయ్ చేసిన వీడియో షేర్ చేయడం హాట్ హాట్ చర్చలకు దారి తీస్తోంది.
పెళ్లి తర్వాత కూడా శ్రీయ
సినిమాలకు పెళ్లి అడ్డు కాదు అన్నట్లుగా పెళ్లి తర్వాత కూడా మంచి జోష్‌లో సినిమాలు చేస్తోంది శ్రీయ. "నరకాసురుడు, సందకారి'' లాంటి తమిళ చిత్రాల్లో నటించిన శ్రీయా శరణ్ మరో హాలీవుడ్ సినిమా స్ఫూర్తిగా రూపొందే చిత్రంలో నటిస్తోంది. ఈమె తీరు చూస్తుంటే తిరిగి తెలుగు తెరపై సందడి చేసేందుకు సిద్దమవుతున్నట్లుగా తెలుస్తోంది.