Bhola Shankar: చిరంజీవి మూవీలో మరో స్టార్ హీరోయిన్.. బాస్ పార్టీకి మించిన ట్రీట్
సినిమాల్లోకి కమ్‌బ్యాక్ అయిన తర్వాత ఏకధాటిగా సినిమాలు చేస్తూ జెట్ స్పీడుతో దూసుకుపోతోన్నారు టాలీవుడ్ బడా హీరో మెగాస్టార్ చిరంజీవి. రీఎంట్రీ ఇచ్చిన తర్వాత ఇప్పటికే ఎన్నో సినిమాలతో ప్రేక్షకులను అలరించిన ఆయన.. గత సంక్రాంతికి 'వాల్తేరు వీరయ్య' అనే చిత్రంతో వచ్చేశారు. దీనికి అన్ని వర్గాల వాళ్ల నుంచి భారీ స్పందన దక్కింది. దీంతో ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా కలెక్షన్లు పోటెత్తాయి. ఫలితంగా ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. తద్వారా ఆయన కెరీర్‌లోనే టాప్ మూవీగా నిలిచింది. ఈ ఉత్సాహంతో చిరంజీవి దూసుకెళ్తోన్నారు.
మెగాస్టార్ చిరంజీవి చాలా చిత్రాలను లైన్‌లో పెట్టుకున్నారు. అందులో తమిళ సూపర్ హిట్ ఫిల్మ్ వేదాళంకు రీమేక్‌గా తెరకెక్కుతోన్న 'భోళా శంకర్' ఒకటి. దీన్ని టాలీవుడ్‌లో డిజాస్టర్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్న మెహర్ రమేశ్ తెరకెక్కిస్తున్నాడు. ఈ సారి ఎలాగైనా హిట్ కొట్టాలన్న పట్టుదలతో ఈ సినిమాను ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నాడు. ఇక, ఈ మూవీ షూటింగ్ గత ఏడాదే ప్రారంభం అయింది. అప్పటి నుంచి దీన్ని శరవేగంగా జరుపుకుంటూ వచ్చారు. ఇందులో భాగంగానే కొన్ని షెడ్యూళ్లను కూడా కంప్లీట్ చేశారు. ఈ నేపథ్యంలో తాజాగా దీని నుంచి ఓ క్రేజీ న్యూస్ లీకైంది.

'భోళా శంకర్' మూవీలో చిరంజీవి సోదరిగా మహానటి కీర్తి సురేష్ నటిస్తోంది. అలాగే, హీరోయిన్‌గా తమన్నా భాటియా చేస్తోంది. ఇక, ఇప్పుడు ఈ చిత్రంలో మరో స్టార్ హీరోయిన్ కూడా భాగం కాబోతున్నట్లు తెలిసింది. ఆమె ఎవరో కాదు.. సుదీర్ఘ కాలంగా టాలీవుడ్‌లో హవాను చూపిస్తోన్న శ్రీయ సరన్. అవును.. ఈ బ్యూటీనే ఇప్పుడు 'భోళా శంకర్' మూవీలో ఓ స్పెషల్ సాంగ్ చేస్తుందట. ఇందులో ఆమె తనదైన అందచందాలను చూపించి అదిరిపోయే ట్రీట్ ఇవ్వబోతుందని తెలిసింది. త్వరలోనే దీనికి సంబంధించిన షూటింగ్ జరగనుందని కూడా ఓ న్యూస్ లీకైంది.
'భోళా శంకర్' మూవీలో చిరంజీవి ట్యాక్సీ డ్రైవర్‌గా నటిస్తున్నారు. ఈ సినిమాను ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై అనిల్ సుంకర నిర్మిస్తున్నారు. మహతి స్వర సాగర్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నాడు. ఇందులో ఎంతో మంది ప్రముఖులు కీలక పాత్రలను పోషిస్తున్నారు.


Click it and Unblock the Notifications











