Nani30: నాని సినిమాలో శ్రుతి హాసన్.. హీరోయిన్‌గా కాకుండా అలాంటి పాత్ర!

లోక నాయకుడు కమల్ హాసన్ కుమార్తెగా సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది గ్లామరస్ బ్యూటి శ్రుతి హాసన్. తెలుగులో అనగనగా ఓ ధీరుడు సినిమాతో.. హిందీలో లక్ మూవీతో అడుగు పెట్టిన శ్రుతి హాసన్ కు ఆ సినిమాలు అంతగా కలిసి రాలేదు. కానీ తర్వాత రానురాను తెలుగు సినీ ఇండస్ట్రీలో హిట్ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది. అగ్ర హీరోలతో ఆమె నటించిన సినిమాలన్ని దాదాపుగా సూపర్ హిట్ సాధించాయి. ఈ ఏడాది వాల్తేరు వీరయ్య, వీర సింహా రెడ్డి సినిమాలతో సూపర్ హిట్ కొట్టింది. ఇప్పుడు నేచురల్ స్టార్ నాని సినిమాలో నటిస్తోంది.

నేచురల్ స్టార్ నాని తాజాగా దసరా సినిమతో వంద కోట్ల క్లబ్ లో చేరాడు. మహానటి కీర్తి సురేష్ హీరోయిన్ గా డెబ్యూ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదేల తెరకెక్కించిన దసరా చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు కొల్లగొట్టింది. నాని తన కెరీర్ బెస్ట్ పెర్ఫామెన్స్ ఇచ్చాడని ప్రశంసలు అందుకున్నాడు. నానితోపాటు మిగతా నటీనటులు, చిత్రబృందానికి టాలీవుడ్ సినీ సెలబ్రిటీల నుంచి పొగడ్తల వర్షం కురిసింది. తాజాగా ఏప్రిల్ 28న ఓటీటీలో విడుదలైన ఈ సినిమా ట్రెండింగ్ లో నిలిచింది. ప్రస్తుతం దసరా సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్న నాని తర్వాతి సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నాడు.

Shruti Haasan

నాని ప్రస్తుతం చేస్తున్న సినిమా Nani30. ఇంకా టైటిల్ ఫిక్స్ కానీ ఈ సినిమాకు కొత్త దర్శకుడు తెరకెక్కిస్తున్నాడు. న్యూ డైరెక్టర్స్ ను ఎంకరేజ్ చేసే నాని ఈ సినిమాతో కూడా శౌర్యవ్ అనే దర్శకుడని పరిచయం చేస్తున్నాడు. వైరా ఎంటర్టైన్ మెంట్స్ పతాకంపై మోహన్ చెరుకూరి, డాక్టర్ విజేందర్ రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమాలో నానికి హీరోయిన్ గా సీతా రామం బ్యూటి మృణాల్ ఠాకూర్ అలరించనుంది. ఇక ఈ మూవీ తండ్రీ కూతుళ్ల సెంటిమెంట్ నేపథ్యంలో చిత్రీకరిస్తున్నారు.

Shruti Haasan

Nani30 మూవీకి మలయాళ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ హేషమ్ అబ్దుల్ వహాబ్ సంగీతం అందించనున్నారు. ఈ సినిమాను త్వరగా పూర్తి చేసి డిసెంబర్ 21న విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. అయితే తాజాగా ఈ సినిమా నుంచి కొత్త అప్డేట్ ఇచ్చారు. ఈ సినిమాలో బ్యూటిఫుల్ శ్రుతి హాసన్ కూడా నటించనుంది. అయితే ఆమె హీరోయిన్ గా చేయట్లేదు. ఇందులో అతి ముఖ్యమైన కీలక పాత్రను శ్రుతిహాసన్ పోషించనుంది. ఆమె ద్వారా కథ మలుపు తిరగనుందని ఇన్ సైడ్ టాక్. ఆమెకు సంబంధించిన షూటింగ్ ను గోవాలో చేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X