అప్పుడు చాలా బాధేసింది.. కానీ ఇప్పుడు లైట్ అంటూ ఈజీగా చెప్పేసిన శృతి హాసన్
కమల్ హాసన్ కూతురు, స్టార్ హీరోయిన్ శృతిహాసన్ కొద్ది రోజులు ప్రియుడు మైకేల్ కోర్సలేతో పీకల్లోతు ప్రేమలో మునిగితేలిన సంగతి తెలిసిందే. సినిమాలు కూడా పక్కన పెట్టేసి మరీ ప్రియుడితో చెట్టాపట్టాలేసుకు తిరిగింది శృతి. ఇంగ్లండ్‌కి చెందిన సింగర్ మైకేల్ కోర్సలేతో డేటింగ్ చేసిన ఆమె.. అతన్ని ఇండియా తీసుకొచ్చి తన తల్లిదండ్రులకు కూడా పరిచయం చేసింది. కానీ ఉన్నట్టుండి ఊహించని రీతిలో అందరికీ షాకిస్తూ మైకేల్‌కి బ్రేకప్ చెప్పేసింది శృతి హాసన్.
ప్రియుడితో డేటింగ్ చేసిన కొద్దికాలం పాటు సినిమాలకు దూరంగా ఉన్న ఆమె తన సింగింగ్ కెరీర్ పై బాగా ఫోకస్ పెట్టింది శృతి హాసన్. ఆ సమయంలో శృతి కాస్త బొద్దుగా కూడా తయారవడంతో ఆమెపై ట్రోల్స్ చేశారు నెటిజన్లు. మైఖేల్ కోర్సలేతో లవ్ ఎఫైర్, శృతి హాసన్ వెయిట్ పై ఓ రేంజ్ లో కామెంట్లు పెట్టారు. దీంతో ఆ సమయంలో ఆమె తెగ ఫీల్ అయిపోయిందట. ఆ టైమ్ లో కొన్ని ఆరోగ్య సమస్యలు తలెత్తడం కారణంగా లావయితే నెటిజన్లు అలా కామెంట్స్ చేయడంతో చాలా బాధపడిందట శృతి.

ఆ కాలం పోయింది.. ప్రియుడితో బ్రేకప్ జరిగింది. మళ్ళీ సినిమాలు మొదలు పెట్టేసింది శృతి.
ఇక ఇప్పుడు ఆమె చెబుతున్న మాటేమిటంటే.. ఎవరెన్ని ట్రోల్స్ చేసినా, తన గురించి ఎలాంటి కామెంట్లు పెట్టినా లైట్ తీసుకుంటా అని. సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చిన శృతిహాసన్ మొదటగా 'లాభం' అనే ప్రాజెక్టు చేపట్టింది. విజయ్ సేతుపతి హీరోగా ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. దీంతో పాటు హిందీలో 'పవర్', తెలుగులో రవితేజ సరసన మరో సినిమాలో నటించనుందని సమాచారం.


Click it and Unblock the Notifications











