శృతీ హాసన్‌ను ఇలా ఎప్పుడూ చూసుండరు.. లక్షల్లో లైకులొచ్చేస్తున్నాయ్.!

కమల్ హాసన్ కూతురిగా సినీ రంగ ప్రవేశం చేసింది శృతీ హాసన్. తండ్రి పేరు చెప్పుకుని ఆమె ఎదగలేదు. సింగర్‌గా, యాక్టర్‌గా అనతి కాలంలోనే బడా ఇమేజ్‌ను సొంతం చేసుకుంది. తనకున్న మల్టిపుల్ టాలెంట్‌తో దక్షిణాది సినిమాలతో పాటు బాలీవుడ్‌లోకీ అడుగు పెట్టింది. కెరీర్ ఆరంభంలో చేతి నిండా సినిమాలతో బిజీ బిజీగా గడిపిన శృతి.. ప్రేమలో పడిన తర్వాత మాత్రం తన కెరీర్‌కు తాత్కాలికంగా పుల్‌స్టాప్ పెట్టేసింది. ఇంగ్లండ్ గాయ‌కుడు మైకేల్ కోర్స‌లేతో ప్రేమ‌లో ప‌డడంతో తన సినీ జీవితాన్ని ప్రశ్నార్థకం చేసుకుంది.

ఇటీవలే అతడికి బ్రేకప్ చెప్పేసి, మరోసారి సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమైంది. తాజాగా ఆమె పలు చిత్రాలు చేయడానికి సైతం సంతకాలు చేసేసింది. అలాగే, మరికొన్ని అవకాశాల కోసం ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగానే తమిళంలో విజయ్ సేతుపతి సరసన 'లాభం' అనే సినిమా చేస్తోంది. అలాగే, తెలుగులోనూ పలు చిత్రాలు చేయడానికి సిద్ధమైంది. ఇవి ప్రస్తుతం చర్చల దశలో ఉన్నాయి. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో ఓ వీడియోను పోస్ట్ చేసింది ఈ బ్యూటీ.

 Shruti Haasan New talent video viral

తమిళనాడు, శ్రీలంకలలో ఎక్కువగా వాయించే 'పరాయ్‌'ను వాయిస్తున్న వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసింది. స్వతహాగా సంగీత దర్శకురాలైన శ్రుతి.. ఈ వీడియోలో డప్పు వాయిస్తూ దానికి అనుగుణంగా కాలు కదుపుతూ కనిపించింది. దీన్ని పోస్ట్‌ చేసిన కొద్ది సమయంలోనే లక్షల్లో లైకులు వచ్చేశాయి. దీన్ని కమల్ ఫ్యాన్స్ తమ పేజీల్లో షేర్ చేసి ఆనందాన్ని పంచుకుంటున్నారు. దీంతో ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

శృతీ హాసన్ తెలుగులో ఎన్నో సినిమాల్లో నటించింది. పవన్ కల్యాణ్, మహేశ్ బాబు, అల్లు అర్జున్, రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ సహా ఎందరో హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకుంది. వీటిలో చాలా వరకు హిట్లే ఉన్నాయి. అయితే, 2017లో వచ్చిన 'కాటమరాయుడు' తర్వాత సినిమాలకు కాస్త బ్రేక్‌ ఇచ్చింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X