Mega 154లో హీరోగా స్టార్ హీరోయిన్..ఉమెన్స్ డే రోజున ప్రకటించిన మెగాస్టార్

మెగాస్టార్ చిరంజీవి వరుస సినిమాలతో బిజీ బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. ఖైదీ నెం 150, సైరా తర్వాత చేసిన ఆచార్య సినిమా విడుదలకు సిద్ధంగా ఉండగా మరో నాలుగు సినిమాలు లైన్ లో పెట్టారు. వాటిలో డైరెక్టర్ బాబీతో కూడా ఒక సినిమా చేస్తున్నారు. ఆ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. ఈ సినిమాలో హీరోయిన్ గా ఎవరిని తీసుకుంటారు? అనే చర్చ ముందు నుంచీ జరుగుతూ వచ్చింది. తాజాగా ఈ సినిమాలో హీరోయిన్ ఎవరు అనే విషయాన్ని ప్రకటించారు., ఆ వివరాల్లోకి వెళితే...

 వాయిదా పడుతూ

వాయిదా పడుతూ


రాజకీయాలు విరమించుకున్న తరువాత 'ఖైదీ నెంబర్ 150' సినిమాతో సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవి ఆ తర్వాత వరుస సినిమాలు చేస్తూ ముందుకు వెళ్తున్నారు. ఆ తరువాత చిరకాల డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన సైరా నరసింహారెడ్డి సినిమా పూర్తి చేసిన ఆయన కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య అనే సినిమా చేస్తున్నారు. ఎప్పుడో షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా విడుదల కావాల్సి ఉంది కానీ కరోనా కారణంగా అంతకంతకు వాయిదా పడుతూ వస్తోంది.

'భోళా శంకర్ కూడా

'భోళా శంకర్ కూడా


ఇదిలా ఉంటే కరోనా సమయంలో మెగాస్టార్ చిరంజీవి మరో నాలుగు సినిమాలు లైన్ లో పెట్టారు. మలయాళంలో సూపర్ హిట్ గా నిలిచిన లూసిఫర్ అనే సినిమాని తెలుగులో గాడ్ ఫాదర్ పేరుతో రీమేక్ చేస్తున్నారు. ఈ సినిమాకు మోహన్ రాజా దర్శకత్వం వహిస్తూ ఉండగా ఈ సినిమా షూటింగ్ తో పాటు మెహర్ రమేష్ దర్శకత్వంలో వేదళం రీమేక్ 'భోళా శంకర్ కూడా చేస్తున్నారు.

 పూర్తి చేసే పనిలో

పూర్తి చేసే పనిలో


ఇవి కాకుండా బాబీ దర్శకత్వంలో తన 154వ సినిమా అలాగే వెంకీ కుడుముల దర్శకత్వంలో మరో సినిమా కూడా చిరంజీవి ప్రకటించారు. ఒకరకంగా సినిమా షెడ్యూల్ గ్యాప్ లో మరో సినిమా షెడ్యూల్ ప్లాన్ చేస్తూ వరుస సినిమాలు త్వరత్వరగా పూర్తి చేసే పనిలో ఉన్నారు మెగాస్టార్ చిరంజీవి. అయితే బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో హీరోయిన్ ఎవరు అనే విషయం మీద అనేక చర్చలు జరిగాయి.

శృతి హాసన్ హీరోయిన్ గా

శృతి హాసన్ హీరోయిన్ గా


చివరికి ఉమెన్స్ డే సందర్భంగా ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తున్నట్టు చిరంజీవి సహా సినిమా యూనిట్ ప్రకటించింది. ఈ విషయాన్ని ప్రకటించడానికి ఉమెన్స్ డే కంటే ఇంకా మంచి రోజు ఎప్పుడు ఉంటుందని చిరంజీవి పేర్కొన్నారు. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ మీద నవీన్ యెర్నేని రవిశంకర్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్న ఈ సినిమాకు జీకే మోహన్ సహా నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

Recommended Video

Adipurush Update | Bhola Shankar First Look | Prabhas | Bheemla Nayak Collections | Filmibeat Telugu
అధికారిక ప్రకటన

అధికారిక ప్రకటన

దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాలో శృతి హాసన్ కూడా నటించే అవకాశం ఉందని ముందు ప్రచారం జరిగింది. ఎందుకంటే ఆమె బాలకృష్ణ హీరోగా నటిస్తున్న గోపీచంద్ మలినేని సినిమాలో హీరోయిన్ గా చేసింది. ఆ సినిమాను నిర్మించేది కూడా మైత్రీ మూవీ మేకర్స్ కావడంతో ఆమెను చిరంజీవి సినిమా కోసం కూడా సంప్రదించే అవకాశం ఉందని ప్రచారం జరిగింది. అదే నిజమై ఇప్పుడు ఎట్టకేలకు అధికారిక ప్రకటన వెలువడింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X